Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సీమాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పిన కార‌ణం గా ప్రాణ‌ న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


సీమాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న లో జరిగిన ప్రాణ‌ న‌ష్టం తో తాను తీవ్ర మానసిక వ్యథ కు లోనైనట్లు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు.

“ఆప్తులను కోల్పోయిన కుటుంబాల వారి యొక్క శోకం లో నేను పాలుపంచుకొంటున్నాను. ఈ ఘ‌ట‌న లో గాయ‌ప‌డిన వారు శీ‌ఘ్రం గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని ప్రార్థిస్తున్నాను. ప్ర‌మాదం జ‌రిగిన నేప‌థ్యం లో రైల్వేస్, ఎన్‌డిఆర్ఎఫ్ లతో పాటు స్థానిక అధికారులు కూడా సాధ్యమైన అన్ని విధాల స‌హాయాన్ని అందిస్తున్నారు” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.