పిఎంఇండియా
సూక్ష్మ, చిన్నసంస్థల (ఎంఎస్ఇ ల) ప్రగతి కోసం రూపొందిన ప్యాకేజికి, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ (సిజిటిఎమ్ఎస్ఇ) కార్పస్ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ప్రతిపాదనల వివరాలు ఇలా వున్నాయి:
1. ట్రస్ట్ కార్పస్ ఫండ్ ను రూ. 2,500 కోట్ల నుండి రూ. 7,500 కోట్లకు పెంచుతారు. ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
2. క్రెడిట్ గ్యారంటీ స్కీము కింద ఇచ్చే రుణాలను రూ. కోటి నుండి రూ.2 కోట్లకు పెంచుతారు.
3. సూక్ష్మ, చిన్న సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ స్కీమును ఎన్ బి ఎఫ్ సి లకు కూడా వర్తింపచేస్తారు. తద్వారా ట్రస్ట్ పరిమాణం పెరుగుతుంది.
ఈ చర్యల కారణంగా కింద తెలిపిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
ఇతరుల మీద ఆధారపడడం తగ్గుతుంది;
ఫండ్ సుస్థిరత పెరుగుతుంది;
పలు ఎంఎస్ ఇ లకు అధిక మొత్తంలో క్రెడిట్ గ్యారంటీ ని పెంచడం ట్రస్ట్ కు వీలవుతుంది;
ఆర్ధిక నిర్వహణ మెరుగవుతుంది;
నిధులు లేని తాత్కాలిక కార్యక్రమాలు తగ్గిపోతాయి.
కార్పస్ విస్తరణ కారణంగా ఎమ్ఎస్ఇ లకు ఇచ్చే రుణాలు పెరుగుతాయి. తద్వారా ఉత్పత్తితో పాటు ఉపాధి కూడా పెరుగుతుంది. అంతే కాదు, అందరికీ ప్రయోజనాలు సిద్ధించడమే కాక సమానంగా లబ్ది చేకూరుతుంది.
కొల్లేటరల్ లేకుండా, మూడో పార్టీ గ్యారంటీ అవసరం లేకుండా ఈ స్కీము ద్వారా రుణాలు లభిస్తాయి కాబట్టి నూతన ఆలోచనలు, పరిశోధనల ఆధారంగా నూతన సంస్థలు ఏర్పాటవ్వడానికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
ప్రతి కార్యక్రమం ఆన్ లైన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకత ఏర్పడి సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది.