Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ) కి మరియు యూరోపియన్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ అథారిటీ కి మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


యూరోపియన్ సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ అథారిటీ (ఇఎస్ఎమ్ఎ) తో పరస్పర సహకారం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ) ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు) కుదుర్చుకోవడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ ఎమ్ఒయు సహకారపూర్వక సర్దుబాటులను ఒక ముందస్తు షరతు గా విధించే అవకాశం ఉంది. అవేమిటంటే, యూరోపియన్ యూనియన్ లోని క్లియరింగ్ మెంబర్స్ లేదా ట్రేడింగ్ వెన్యూస్ కు క్లియరింగ్ సేవలను అందించడం కోసం భారతదేశంలో ఏర్పాటై, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉన్న సెంట్రట్ కౌంటర్ పార్టీస్ (సిసిపి స్) ను ఇఎస్ఎమ్ఎ గుర్తించాలి; అలాగే, కవర్ డ్ సిసిపి స్ ఇప్పటికే అనుసరిస్తున్న పద్ధతులను పర్యవేక్షించేందుకు ఇఎస్ఎమ్ఎ కు తగిన సాధనాలను సమకూర్చడం జరుగుతుంది.