పిఎంఇండియా
సెప్టెంబర్ 27 న ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో జరిగే టౌన్ హాల్ ప్రశ్న మరియు జవాబుల (Q&A) కార్యక్రమం కోసం భారత యూజర్లు ప్రశ్నలు షేర్ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
“మార్క్ జుకర్ బర్గ్ ఆహ్వానానికి ప్రధాని తన ఫేస్ బుక్ పోస్ట్ లో ధన్యవాదాలు తెలుపుతూ సెప్టెంబర్ 27 న భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు (ఉదయం 9:30 పసిఫిక్ సమయం) ఫేస్ బుక్ ప్రధానకార్యాలయంలో జరిగే టౌన్ హాల్ ప్రశ్న మరియు జవాబుల (Q&A) కార్యక్రమం కోసం తాను సంసిద్దంగా ఉన్నట్లు తెలిపారు
చిరస్మరణీయమైన ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక, ఆర్థిక పరమైన సవాళ్లకు పరిష్కార మార్గాలపై చర్చ ఉంటుందని ప్రధాని అన్నారు.
మీ భాగస్వామ్యం లేకపోతే ఈ కార్యక్రమం అసంపూర్తిగా ఉంటుంది. తప్పనిసరిగా మీ ప్రశ్నలు ఫేస్ బుక్ లో షేర్ చేయండి.
మీ ప్రశ్నలన్నింటిని ‘నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్’ ద్వారాషేర్ చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవ్వడంతో పాటు ఈ కార్యక్రమం ఓ మధుర జ్ఞాపకంగా గుర్తుండేలా చేయాలని భారత యూజర్లకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.”
I thank Mark Zuckerberg for the invite to visit @facebook HQ & for the Townhall Q&A at 10 PM IST on 27th September. https://t.co/tlbCeLZeh4
— Narendra Modi (@narendramodi) September 13, 2015
The Townhall Q&A will be incomplete without your participation. Share Qs on FB or on 'Narendra Modi Mobile App.' http://t.co/cpHBU3k5ry
— Narendra Modi (@narendramodi) September 13, 2015