Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైనిక దినోత్స‌వ సంద‌ర్భంగా భార‌తీయ సైన్య ప‌రిశోధ‌కుల‌కు స‌ర్టిఫికెట్లను ప్ర‌దానం చేసిన ప్ర‌ధాని

సైనిక దినోత్స‌వ సంద‌ర్భంగా భార‌తీయ సైన్య ప‌రిశోధ‌కుల‌కు స‌ర్టిఫికెట్లను ప్ర‌దానం చేసిన ప్ర‌ధాని

సైనిక దినోత్స‌వ సంద‌ర్భంగా భార‌తీయ సైన్య ప‌రిశోధ‌కుల‌కు స‌ర్టిఫికెట్లను ప్ర‌దానం చేసిన ప్ర‌ధాని

భార‌తీయ సైన్యానికి చెందిన ప‌లువురు ప‌రిశోధ‌కుల‌కు ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేశారు.

క‌మ్యూనికేష‌న్లరంగంలోను, ఉగ్ర‌వాద వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల్లోను, సిమ్యులేష‌న్ విభాగంలోను వైవిధ్య‌మైన ప‌రిశోధ‌న‌లు చేసి నూత‌న విష‌యాల‌ను, ప‌రిక‌రాల‌ను క‌నిపెట్టిన‌వారికి ఈ స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేయ‌డం జ‌రిగింది.

సైనిక దినోత్స‌వం సంద‌ర్భంగా సైనిక బ‌ల‌గాల ప్ర‌ధాన అధిప‌తి నివాసంలో ఏర్పాటైన ఎట్ హోమ్ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని ఈ స‌ర్టిఫికెట్ల‌ను పరిశోధ‌కుల‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ పారిక‌ర్ కూడా పాల్గొన్నారు.

స‌ర్టిఫికెట్ల‌ను అందుకున్న ప‌రిశోధ‌నాత్మ‌క అధికారులు ఆర్మీ చీఫ్ స‌మ‌క్షంలో తాము క‌నిపెట్టిన అంశాల‌గురించి ప్ర‌ధానికి వివ‌రించారు.