Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సోమనాథ్ ఆలయ పటిష్ఠతను, నాగరికత ప్రాముఖ్యతను తెలిపే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన కథనాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సోమనాథ్ ఆలయ పటిష్ఠత, కాలాతీతమైన నాగరికత ప్రాముఖ్యతను ఈ కథనం తెలియజేస్తుంది.

సోమనాథ్ కేవలం ఆలయం మాత్రమే కాదని, భారతదేశ అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. శిథిలావస్థ నుంచి పునరుజ్జీవం వైపు సాగిన ఆలయ ప్రయాణం.. ఓటమి ఎరుగని, ధైర్యానికి ప్రతీకగా నిలిచే దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

సోమనాథ్ కేవలం ఆలయం మాత్రమే కాదు, భారతదేశ అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనం. శిథిలావస్థ నుంచి పునరుజ్జీవం వైపు సాగిన ఆలయ ప్రయాణం… ఓటమి ఎరుగని, ధైర్యానికి ప్రతీకగా నిలిచే దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

సోమనాథ్ ఆలయం పటిష్ఠత, కాలాతీతమైన నాగరికత ప్రాముఖ్యతకు సంబంధించి కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆలోచనలను పంచుకున్నారు. తప్పక చదవండి!”.