పిఎంఇండియా
గౌరవ సౌదీ యువరాజు, ఆ దేశ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.
పశ్చిమాసియా పరిణామాలపై వారిద్దరూ చర్చించారు. సౌదీ అరేబియాపై ఇటీవలి దాడులను తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ.. అది సార్వభౌమత్వాన్నీ, ప్రాంతీయ సమగ్రతనూ ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా పశ్చిమాసియా ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించడమే ప్రస్తుతం అత్యంత ప్రధానమైన అంశమని వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.
ఈ కష్ట కాలంలో సౌదీ అరేబియాలోని భారతీయులకు రక్షణ కల్పిస్తున్న గౌరవ యువరాజుకు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘పశ్చిమాసియాలో పరిణామాలపై గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చించాను. ఆ దేశ సార్వభౌమత్వానికీ, ప్రాదేశిక సమగ్రతకూ భంగం కలిగించేలా.. సౌదీ అరేబియాపై ఇటీవల జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించడమే ప్రస్తుతం అత్యంత ప్రధానమైన అంశమన్న ఏకాభిప్రాయానికి వచ్చాం. ఈ కష్టకాలంలో సౌదీ అరేబియాలోని భారతీయులకు రక్షణ కల్పిస్తున్న యువరాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’
***
Discussed the evolving situation in West Asia with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman. India condemns the recent attacks on Saudi Arabia in violation of its sovereignty and territorial integrity. We agreed that earliest restoration of regional…
— Narendra Modi (@narendramodi) March 2, 2026