Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్క్రామ్ జెట్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించినందుకు ఐఎస్ఆర్ఒ శాస్త్ర వేత్తలకు ప్రధాన మంత్రి అభినందనలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్క్రామ్ జెట్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించినందుకు ఐఎస్ఆర్ఒ (ఇస్రో) శాస్త్ర వేత్తలకు అభినందనలు తెలిపారు.

“స్క్రామ్ జెట్ రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా పరీక్షించడం అనేది మన శాస్త్రవేత్తలు పడిన కష్టానికి, వారి నైపుణ్యానికి ఒక నిదర్శనం. ఇస్రో కు అభినందనలు.

మన శాస్త్రవేత్తలతో పాటు మన అంతరిక్ష కార్యక్రమం భారతదేశానికి ఎలా గర్వకారణంగా నిలచాయో మనం తరచుగా చూసినదే” అని ప్రధాన మంత్రి తన సందేశంలో అన్నారు.