పిఎంఇండియా
గౌరవ స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
భారత్ – స్పెయిన్ మైత్రిని పెంపొందించే మార్గాలపై.. ముఖ్యంగా రక్షణ, భద్రత, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై వారిద్దరూ చర్చించారు.
2026ను భారత్-స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం, ఏఐ సంవత్సరంగా రెండు దేశాలు గుర్తించాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఢిల్లీలో స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో సమావేశం ఫలప్రదంగా జరిగింది. భారత్ – స్పెయిన్ మైత్రినీ.. ముఖ్యంగా రక్షణ, భద్రత, సాంకేతికత, తదితర రంగాల్లో సహకారాన్నీ పెంపొందించే మార్గాలపై చర్చించాం. 2026ను భారత్ – స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక, ఏఐ సంవత్సరంగా ఇరు దేశాలూ గుర్తించాయి. ఇది ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. విశ్వవిద్యాలయాల నుంచి భారీ ప్రతినిధి బృందం కూడా భారత్‌కు రావడం సంతోషాన్నిస్తోంది. మన ప్రజలను అనుసంధానించడంలో ఇది కూడా చాలా దోహదం చేస్తుంది.
ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. స్పెయిన్‌తో ఆర్థిక భాగస్వామ్యంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మన దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను అందిస్తుంది.
@sanchezcastejon”
“స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో ఢిల్లీలో నా సమావేశం ఫలప్రదంగా సాగింది. భారత్ – స్పెయిన్ మైత్రినీ.. ముఖ్యంగా రక్షణ, భద్రత, సాంకేతికత, తదితర రంగాల్లో సహకారాన్నీ పెంపొందించే మార్గాలపై చర్చించాం.
2026ను భారత్ – స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక, ఏఐ సంవత్సరంగా ఇరు దేశాలూ గుర్తించాయి. ఇది ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. విశ్వవిద్యాలయాల నుంచి భారీ ప్రతినిధి బృందం కూడా భారత్‌కు రావడం సంతోషాన్నిస్తోంది. మన ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడంలో ఇది కూడా చాలా దోహదం చేస్తుంది.
ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. స్పెయిన్‌తో ఆర్థిక భాగస్వామ్యంపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే మన దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను అందిస్తుంది.
@sanchezcastejon”
Had a productive meeting with President Pedro Sánchez in Delhi. Discussed ways to boost the India-Spain friendship, especially in areas such as defence, security, technology and more. Our nations are marking 2026 as the India-Spain Year of Culture, Tourism and AI. This will… pic.twitter.com/AAG6nssd3F
— Narendra Modi (@narendramodi) February 18, 2026
Tuve una reunión productiva con el presidente Pedro Sánchez en Delhi. Hablamos de formas de fortalecer la amistad entre la India y España, especialmente en ámbitos como la defensa, la seguridad, la tecnología y otros.
— Narendra Modi (@narendramodi) February 18, 2026
Nuestros países celebran 2026 como el Año India-España de la… pic.twitter.com/5u4IiRtjFg