పిఎంఇండియా
మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.
ఈ కథనంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణ భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న అభివృద్ధి ఆధారిత పాలనా నమూనాను మాజీ ఉప రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ కాలంలో 4,399 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కీలక ఘట్టాన్ని అసాధారణ విజయంగా అభివర్ణిస్తూ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఒక కథనాన్ని రాశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణ భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న పీఎం మోదీ అభివృద్ధి ఆధారిత పరిపాలనా విధానాన్ని ఆయన కొనియాడారు“.
As PM @narendramodi completes 4,399 days in office, this article by former Vice President Shri @MVenkaiahNaidu hails the milestone as an extraordinary achievement. He highlights PM Modi’s development-driven governance model that resonates with people’s aspirations, paving the way… pic.twitter.com/KxYB8hw4ZL
— PMO India (@PMOIndia) June 10, 2026