పిఎంఇండియా
స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య పోషించిన అమూల్యమైన పాత్రను ప్రధానమంత్రి స్మరించుకున్నారు. ఆయన కృషి… అంకితభావం, దేశభక్తితో దేశానికి సేవలు అందించేలా ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.
త్రివర్ణ పతాకం… ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతో నిండిపోయేలా చేస్తుందనీ, దేశ నిర్మాణానికి కృషి చేసేలా స్ఫూర్తినిస్తుందనీ శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:
‘‘పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా వారికి నివాళులు. మన దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో ఆయన పోషించిన అమూల్యమైన పాత్రకు ఆయన చిరస్మరణీయులు. అంకిత భావం, దేశభక్తితో దేశానికి సేవలు అందించేలా ఆయన కృషి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తిని అందించుగాక!
త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుని హృదయాన్ని అపారమైన గర్వంతో నింపుతుంది. దేశ నిర్మాణానికి కృషి చేసేలా మనకు స్ఫూర్తినిస్తుంది.”
***
Tributes to Pingali Venkayya Ji on his 150th birth anniversary. He is remembered for his invaluable role in giving our nation the Tricolour. May his efforts always inspire people to serve our country with dedication and patriotic fervour.
— Narendra Modi (@narendramodi) August 2, 2026
The Tiranga fills every Indian heart…