Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి ఆత్మస్థానంద జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


స్వామి ఆత్మస్థానంద జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘స్వామి ఆత్మస్థానంద జీ మరణం నాకు వ్యక్తిగతంగా కలిగిన లోటు. నా జీవనంలో ఎంతో ముఖ్యమైన కాలంలో ఆయనతో కలిసివున్నాను.

స్వామి ఆత్మస్థానంద గారిలో అపారమైన వివేకం, విజ్ఞానం మూర్తీభవించి ఉన్నాయి. ఆఆదర్శప్రాయమైనటువంటి ఆయన వ్యక్తిత్వం తరాల తరబడి జ్ఞాపకముంటుంది.

నేను కోల్ కతా ను సందర్శించినపుడల్లా స్వామి ఆత్మస్థానంద గారి ఆశీస్సులు కోరడం మరచిపోనే లేదు.

స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం అధ్యక్షునిగా స్వామి ఆత్మస్థానంద గారు అలుపెరుగక పాటుపడ్డారు; మఠ ప్రభావాన్ని విశ్వవ్యాప్తం చేశారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.