Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వీడన్ అత్యున్నత పురస్కారం – రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న ప్రధానమంత్రి

స్వీడన్ అత్యున్నత పురస్కారం –  రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ ను అందుకున్న ప్రధానమంత్రి


స్వీడన్ లో18వ శతాబ్దంలో ఏర్పాటైన దేశ అత్యంత పురాతన, విశిష్ట పురస్కారాలలో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్నారు. గాథెన్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, స్వీడన్ యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అసాధారణ ప్రజా సేవకు,  స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అందించిన విశేష కృషికి గుర్తింపుగా విదేశీ ప్రభుత్వ అధినేతలకు స్వీడన్ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుంది. 

ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని అందించినందుకు యువరాణి క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియాకు, స్వీడన్ ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయ ప్రజలకు, భారత్,  స్వీడన్ దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ పురస్కారాన్ని అందుకోవడం భారత్, స్వీడన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలకు, సాంస్కృతిక సంబంధాలకు దక్కిన గౌరవమని, ఇరు దేశాల ప్రజలను ఏకం చేసే ఆప్యాయత, అనురాగాలకు లభించిన గుర్తింపు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి ఆసియా దేశాధినేత భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కావడం విశేషం. 

ఈ పురస్కార ప్రదానం భారత్-స్వీడన్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు దోహదపడటానికి ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.

***