పిఎంఇండియా
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. జాతికి సర్దార్ పటేల్ అందించిన మార్గదర్శకమైన సేవలను, ఏకత్వం సమగ్రత సందేశాలను ప్రధాని జ్ఞాపకం చేసుకున్నారు.
“ఆయన పుణ్య తిథి నాడు, సర్దార్ పటేల్‌కు ప్రణామాలు. ఆయన అందించిన మార్గదర్శకపూరితమైన సేవలు మనకు గుర్తున్నాయి. అలాగే, ఆయన అందించిన ఏకత్వం, సమగ్రతలనే సందేశాలు మనకు స్ఫూర్తిదాయకాలే” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
On his Punya Tithi, salutations to Sardar Patel. We remember his exemplary service & are inspired by his message of unity & integration.
— Narendra Modi (@narendramodi) December 15, 2015