Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో ప్రమాదం… ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం


 హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో సంభవించిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.  ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు శ్రీ  మోదీ తెలిపారు

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు. 

 

‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో జరిగిన ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. ఈ కష్ట సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ