Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబంతో ప్రధానమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.,. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో  ఈ రోజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
శ్రీ చంద్రబాబు నాయుడునూ, ఆయన కుటుంబాన్నీ కలుసుకోవడం ఎల్లవేళలా సంతోషాన్ని కలిగిస్తుంటుంది అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపైనా, విభిన్న విషయాలపైనా వారు తమ అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకున్నారు.
 సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కుటుంబంతో భేటీ అయ్యాను. వారిని కలుసుకోవడం,  అనేక అంశాలపై  మేం మా ఆలోచనలను పరస్పరం తెలియజేసుకోవడం ఎప్పటికీ సంతోషదాయకం’’ అని పేర్కొన్నారు.