పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.,. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో ఈ రోజు హైదరాబాద్లో భేటీ అయ్యారు.
శ్రీ చంద్రబాబు నాయుడునూ, ఆయన కుటుంబాన్నీ కలుసుకోవడం ఎల్లవేళలా సంతోషాన్ని కలిగిస్తుంటుంది అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపైనా, విభిన్న విషయాలపైనా వారు తమ అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కుటుంబంతో భేటీ అయ్యాను. వారిని కలుసుకోవడం, అనేక అంశాలపై మేం మా ఆలోచనలను పరస్పరం తెలియజేసుకోవడం ఎప్పటికీ సంతోషదాయకం’’ అని పేర్కొన్నారు.
In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.@ncbn pic.twitter.com/YyFqO9Hry7
— Narendra Modi (@narendramodi) May 10, 2026
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. వారిని కలసి విభిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకతే.@ncbn pic.twitter.com/OoYVQ5Wi5u
— Narendra Modi (@narendramodi) May 10, 2026