Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హొమియోపతి లో సంస్కరణలు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం కేంద్ర హొమియోపతీ మండలి ( సవరణ) బిల్లు, 2019కు ఆమోదం తెలిపింది.

ప్రభావం:

మామూలుగా కేంద్ర హోమియోపతి మండలి పునర్వ్యస్థీకరణ ఏడాదికి ఒకసారి జరిగేది. అయితే మండలి పదవీకాలాన్ని రెండేళ్లకు పెంచడం ద్వారా మండలిని పర్యవేక్షించే గవర్నర్ల బోర్డు పదవీ కాలాన్ని 17 మే, 2019 నుంచి మరో ఏడాది పొడిగించేందుకు వీలవుతుంది.

దానివల్ల కేంద్ర హోమియోపతి మండలి తమ విధులను యథాప్రకారం నిర్వహించడానికి వీలు కలుగుతుంది.

అమలు:

ఈ బిల్లు ఇటీవల జారీ చేసిన కేంద్ర హొమియోపతీ మండలి ( సవరణ) ఆర్డినెన్సు, 2019 స్థానంలో అమలులోకి వస్తుంది. మరియు పాలక మండలి పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తుంది.

నేపథ్యం:

కేంద్ర హొమియోపతీ మండలి పర్యవేక్షణ బాధ్యతను హోమియోపతీ వైద్య విధానంలో పేరొందిన నిపుణులు, పాలనావేత్తలు, అర్హులైన డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించడం జరిగింది. హోమియోపతీ రాష్ట్ర రిజిస్టర్లు నవీకరించకపోవడం, అదే సమయంలో సాధారణ ఎన్నికలు జరగడం వల్ల ఏడాది లోపల కేంద్ర హోమియోపతీ మండలి పునర్వ్యవస్థీకరణ జరగనందువల్ల మండలి పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది.