Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోంమంత్రిత్వ శాఖ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ, ప్రకృతి సంరక్షణ దిశగా ప్రతీ ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది : ప్రధానమంత్రి


దేశవ్యాప్తంగా హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘‘అఖిల భారత మెక్కల పెంపక ప్రచార కార్యక్రమం’’లో భాగంగా 4వ కోటి (40 మిలియన్) మొక్క నాటినట్టు తెలియచేస్తూ హోంమంత్రి శ్రీ అమిత్  షా ఒక  సందేశం పంపారు. పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ విజయానికి కారణమైన సిఏపిఎఫ్  సిబ్బందిని శ్రీ షా అభినందించారు.

ఈ సందేశానికి ప్రధానమంత్రి స్పందిస్తూ

‘‘అద్భుతమైన విజయం ఇది. హోమ్  మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ చెట్ల  పెంపకం ప్రచార కార్యక్రమం పర్యావరణ, ప్రకృతి సంరక్షణ దిశగా  ప్రతీ ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది’’ అన్నారు.

 

***

DS/ST