Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోం శాఖ కార్య‌ద‌ర్శిగా శ్రీ రాజీవ్ మెహ‌ర్షి


రాజ‌స్థాన్ కేడ‌ర్ కు చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీ రాజీవ్ మెహ‌ర్షిని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. ఈ నియామ‌కానికి ప్ర‌ధాని ఆమోదం తెలిపారు. ఇంత‌కుముందు ఈయ‌న ఆర్థిక మంత్రిత్వ‌శాఖ లోని ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగంలో కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. శ్రీ మెహ‌ర్షి రెండు సంవ‌త్స‌రాల‌పాటు ప‌ద‌విలో కొన‌సాగుతారు.

ఇంత‌కుముందు హోంశాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన శ్రీ ఎల్‌.సి.గోయ‌ల్ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల చేసిన‌ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ విజ్ఞ‌ప్తిని కూడా ప్ర‌ధాని ఆమోదించారు.