Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హ‌రియాణా ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి; స‌ర్ ఛోటూ రామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ తో పాటు రైలు పెట్టెల మ‌ర‌మ్మ‌తు క‌ర్మాగారానికి శంకుస్థాప‌న‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హ‌రియాణా లోని రోహ్‌త‌క్ లో గ‌ల సాంప్‌లా ను ఈ రోజు సంద‌ర్శించారు.

ఆయ‌న దీన‌బంధు స‌ర్ ఛోటూ రామ్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఒక జ‌న స‌భ‌ లో ప్ర‌ధాన మంత్రి సోనీపత్ లో రైలు పెట్టెల మ‌ర‌మ్మ‌తు కార్ఖానా కు శంకుస్థాప‌న సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు. ఈ కర్మాగారం పూర్తి అయిందంటే గ‌నుక ఉత్త‌ర ప్రాంతం లో రైలు పెట్టెల మ‌ర‌మ్మ‌తు, ఇంకా నిర్వ‌హ‌ణ స‌దుపాయాలు క‌లిగివున్నటువంటి ఒక ప్ర‌ధాన కేంద్రం గా నిలవనుంది. దీనిని మాడ్యుల‌ర్, ఇంకా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ ప‌ద్ధ‌తుల‌ను, ఆధునిక యంత్ర సామ‌గ్రి ని మరియు ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర‌మైన ప‌ద్ధ‌తుల‌ను వినియోగించుకొంటూ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, చౌధరీ ఛోటూ రామ్ గారు సామాజిక సంస్క‌ర్త‌ లలో ఒక‌ర‌ని, భార‌త‌దేశానికి ఒక ప్ర‌ధానమైన తోడ్పాటు ను అందించార‌ని చెప్పారు. అణ‌చివేత కు గురైన వ‌ర్గాలు మ‌రియు అనాద‌ర‌ణ‌కు లోనైన వ‌ర్గాల వారి త‌ర‌ఫున త‌న స్వ‌రాన్ని గ‌ట్టిగా వినిపించిన వారి లో స‌ర్ ఛోటూ రామ్ ఒక‌రు అంటూ ఆయ‌న అభివ‌ర్ణించారు.

రైలు పెట్టెల మ‌ర‌మ్మ‌తు క‌ర్మాగారం ఒక్క సోనీపత్ అభివృద్ధి కే కాక యావ‌త్తు హ‌రియాణా రాష్ట్రం అభివృద్ధి కి కూడా తోడ్ప‌డగలద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ ప్రాంతం లో చిన్న న‌వ పారిశ్రామికు ల‌కు ప్ర‌యోజ‌న‌కారి కావ‌డం తో పాటు యువ‌తీయువ‌కుల‌కు ఉపాధి ని సైతం క‌ల్పించగలదని ఆయ‌న అన్నారు.

స‌ర్ ఛోటూ రామ్ యొక్క దార్శ‌నిక‌త ను ప్ర‌ధాన మంత్రి శ్లాఘించారు. ఈ సంద‌ర్భం లో భాక్రా ఆన‌క‌ట్ట ను గురించి కూడా ఆయ‌న వివ‌రించారు. రైతుల‌ కు గిట్టుబాటు ధ‌ర‌ ల‌ను అందించడానికి స‌ర్ ఛోటూ రామ్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. ఈ విష‌యం లో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌ల‌ ను గురించి కూడా ఆయ‌న వివ‌రించారు.

‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కం యొక్క పురోగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, ఈ ఆరోగ్య హామీ ప‌థ‌కం తొలి ల‌బ్దిదారు ఈ రాష్ట్రానికి చెందిన‌ వారే అన్నారు. రెండు వారాల లోప‌ల 50 వేల మంది కి పైగా ప్ర‌జ‌లు ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాల‌ ను అందుకొన్నార‌ని చెప్తూ ఆయ‌న త‌న సంతృప్తి ని వ్య‌క్తం చేశారు.

“బేటీ బచావో, బేటీ పఢావో” ప‌థ‌కం లో భాగంగా సాధించిన సాఫ‌ల్యాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. హరియాణా ప‌ల్లె లలో జ‌న్మించిన బాలిక‌లు ప్ర‌పంచ క్రీడా మైదానం లో దేశాని కి గ‌ర్వ‌కార‌ణం గా నిలుస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. అలాగే, హ‌రియాణా యువ‌త భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ క్రీడా శ‌క్తి గా చూపించ‌డం లో దోహ‌ద‌ ప‌డుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇవి స‌ర్ ఛోటూ రామ్ స్వ‌ప్నాల‌ ను సాకారం చేసే దిశ‌ గా మ‌నం శ‌ర వేగం గా పురోగ‌మిస్తున్నామ‌నడానికి సూచికలు అని ఆయ‌న అన్నారు.

***