Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

01.07.2017 నాటి నుండి వ‌ర్తించే విధంగా కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 1 శాతం అద‌న‌పు క‌రువు భ‌త్యం మ‌రియు పింఛ‌న్ దారుల‌కు డియ‌ర్‌నెస్ రిలీఫ్ విడుద‌ల‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అద‌నంగా ఒక శాతం క‌రువు భ‌త్యం (డిఎ) మ‌రియు పింఛ‌న్ దారుల‌కు డియ‌ర్‌నెస్ రిలీఫ్ (డిఆర్‌) విడుద‌ల‌కు త‌న ఆమోదాన్ని తెలియజేసింది. ఇది 01.07.2017 నుండి వ‌ర్తించ‌నుంది.

అధిక ధ‌ర‌ల‌ వల్ల కలుగుతున్న న‌ష్టాన్ని భర్తీ చేసేందుకు మూల వేత‌నం/పింఛ‌న్ లో ఇప్పుడున్న 4 శాతానికి అద‌నంగా 1 శాతం డిఎ కిస్తీని విడుద‌ల చేస్తారు. ఈ పెరుగుద‌ల 7వ కేంద్ర వేత‌న సంఘం సిఫారసుల ఆధారంగా ఆమోదించిన‌టువంటి ఒక సూత్రానికి అనుగుణంగా ఉంది.

డిఎ మ‌రియు డిఆర్ ల కార‌ణంగా ఖ‌జానా పై ప‌డే ఉమ్మ‌డి భారం ఒక సంవ‌త్స‌రానికి 3068.26 కోట్ల రూపాయ‌లుగాను మ‌రియు 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో (2017 జులై నుండి 2018 ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య 8 నెల‌ల కాలానికి) 2045.50 కోట్ల రూపాయ‌లు గాను ఉంటుంది. ఇది దాదాపు 49.26 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు 61.17 ల‌క్ష‌ల మంది పింఛ‌న్ దారుల‌కు ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చనుంది.