Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

129వ మన్ కీ బాత్ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


129వ విడత మన్ కీ బాత్ విశేషాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“140 కోట్ల భారతీయుల సామర్థ్యాలునైపుణ్యాల కారణంగా మన దేశం 2025లో వివిధ రంగాలలో చాలా విజయాలను సాధించింది.”

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనేది దేశ నిర్మాణానికి సహకరించడానికి ఒక గొప్ప వేదిక. 2026 జనవరి 12న జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకుమన యువశక్తి ఆలోచనలుఅభిప్రాయాలను వినడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”

కీలకమైన జాతీయసామాజిక సవాళ్లకు పరిష్కారాలను అందించేందుకు మన యువతఆవిష్కర్తలకు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఒక వేదికను కల్పిస్తుంది.”

సుస్థిరత పట్ల భారతదేశ యువత గొప్ప అభిలాషను ప్రదర్శిస్తోందిసమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి సౌరశక్తిని వినియోగిస్తున్న మణిపూర్‌కు చెందిన మోయిరంగ్తెం సెత్‌ను ఈ సందర్భంగా అభినందించాను.”

పేదలుఅణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పార్బతీ గిరి గారి జన్మ శతాబ్ది వేడుకలను వచ్చే నెలలో మనం జరుపుకోబోతున్నాంనేటి మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ఆమెకు నివాళులర్పించాను. “

” రణ్ పిలుస్తోంది!!

రణ్ ఉత్సవాన్ని ఆస్వాదించడానికి కచ్‌కి విచ్చేయండి.

కచ్ శాశ్వత సౌందర్యాన్నిస్థానిక హస్తకళల గొప్పతనాన్నిజానపద సంప్రదాయాల లయను ప్రత్యక్షంగా చూడటానికి రండి.”

అందమైన కన్నడ భాషను భారతీయ ప్రవాసులలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి దుబాయ్‌లో జరుగుతున్న అభినందనీయమైన కృషిని ప్రశంసించాను.”

నరసాపురంలో చేపట్టిన ఈ ప్రయత్నం స్థానిక లేస్‌ కళకు మళ్లీ ప్రాణం పోసి అనేక మందికి సాధికారత చేకూర్చింది”

మనకు బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్న ఫిజీ దేశంలో తమిళ భాష ప్రాచుర్యం పొందటం సంతోషంగా ఉంది.”

కాశీ తమిళ సంగమంలో స్పష్టమైనట్లుగా కాశీ ప్రజల్లో తమిళ భాష ప్రాచుర్యం పొందడం ఎంతో హృదయపూర్వకమైన విషయం.”

జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక గుర్తింపు ఎంత పురాతనమైనదోఎంత సుసంపన్నమైనదో బారాముల్లాలోని జెహన్ పోరా బౌద్ధ సముదాయం తెలియజేస్తోందిఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపాల వెనుక ఉన్న కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది!”

భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీలో అయినా లేదా మన కాశీలో అయినా తమిళ భాషా వ్యాప్తి కోసం జరుగుతున్న అభినందనీయమైన కృషి హృదయాన్ని హత్తుకునేలా ఉందిప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఈ భాష పట్ల నేడు దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో కూడా ఆకర్షణ పెరుగుతుండటం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. “

నిమోనియాయూటీఐ వంటి వ్యాధులలో యాంటీబయాటిక్ మందులు బలహీనంగా మారుతున్నాయని ఐసీఎంఆర్ ఇటీవలి నివేదిక తెలియజేస్తోందివీటిని ఆలోచించకుండా వాడటమే దీనికి ఒక ప్రధాన కారణంవైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ మందులు తీసుకోవద్దని విన్నవిస్తున్నాను.”

ఇతరుల జీవితాలను సాధికారత వైపు నడిపిస్తూమణిపూర్ సంప్రదాయ హస్తకళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ నివాసి మార్గరెట్ రమ్‌తార్సీమ్ ను చూసి గర్విస్తున్నాను.”

అనేకమంది రైతుల జీవితాలను మారుస్తూ పుష్పాల సాగులో అసాధారణమైన కృషి చేసిన మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన కెచోఖోన్ క్రిచెనా అభినందనీయులు”