పిఎంఇండియా
స్పీకర్ మేడమ్, ఈ సభ ను మీరు మీ యావత్తు పదవీ కాలం లో ఓరిమి తో, సమతుల్యత తో మరియు ఎల్ల వేళల చిరునవ్వు మోము తో నిర్వహించినందుకు 16వ లోక్ సభ నాయకుడి గా, సభ లోని సభ్యులు అందరి పక్షాన మిమ్ముల ను నేను అభినందిస్తున్నాను.
దేవి అహిల్య గారి జీవనం మరియు ప్రబోధాల ద్వారా మీరు ప్రగాఢం గా ప్రభావితులు అయ్యారు. ఆ సూత్రాల ను, ప్రబోధాల ను మీరు ఆచరణలో పెట్టేందుకు ఎల్ల వేళల ప్రయత్నించారు. అవే సూత్రాల ను మీరు అనుసరిస్తూ ఎప్పటికి అప్పుడు అధికారం లో ఉన్న ప్రభుత్వాని కి, అలాగే ప్రతిపక్షాని కి సంబంధించినంత వరకు కఠిన నిర్ణయాల ను తరచు గా తీసుకొని, ఒక సంపూర్ణమైన సమతుల్యత ను ఏర్పరచారు. ఈ విలువ లు మరియు ఆదర్శాలు లోక్ సభ లో ఉత్తమ సంప్రదాయాల ను పరిరక్షించడం కోసం సదా ఆలంబన అవుతాయని నేను నమ్ముతున్నాను.
మహిళల కు ఒక సంస్థ ను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త సభ్యుల కోసం మీరు ఒక పవిత్ర కార్యాన్ని పూర్తి చేశారని నేను నమ్ముతున్నాను. చర్చ జరిపే సంస్కృతి ని, అందులో విషయాన్ని మరియు సమాచారాన్ని సుసంపన్నం చేయడం లో మీరు ఒక కీలకమైన పాత్ర ను పోషించారు.
స్పీకర్ మేడమ్,
2014వ సంవత్సరం లో నేను కొత్త గా ఎన్నికైన ఎంపీల లో ఒకరు గా ఉన్నాను. పార్లమెంటు యొక్క భౌగోళికత ను గురించి గాని, మరే విషయాన్ని గురించి గాని నాకు ఒక ఆలోచన లేదు. నేను పూర్తి గా కొత్తవాడి ని. నేను ప్రతి విషయాన్ని అది ఏమిటి, అది ఎక్కడ ఉన్నది, తదితర విషయాల ను ఎంతో కుతూహలం తో గమనిస్తూ ఉండే వాడి ని. అయితే, ఇక్కడ కూర్చోవడం మొదలుపెట్టినప్పటి నుండి ఆ మీట దేని కోసం అని ఆశ్చర్యపోతూ ఉండే వాడి ని. నేను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను.
అలాగ, ఇక్కడ ఒక ఫలకాన్ని నేను చూశాను. నా కన్నా ముందు 13 మంది ప్రధాన మంత్రులు ఇదే చోటు లో పదవీ బాధ్యతల ను స్వీకరించారు. ఆ ఫలకం పై కేవలం ముగ్గురు ప్రధాన మంత్రుల పేర్లు వ్రాసి ఉన్నాయి. దీని కి కారణం ఏమిటి ? సరళమైన భావజాలాన్ని కలిగివున్న పండితులు దీని ని క్షుణ్ణం గా పరిశీలించి ఈ ప్రశ్న కు తగిన సమాధానాన్ని మాకు అందించేందుకు అవకాశం తీసుకోవచ్చును.
నాకు ప్రతిదీ క్రొత్త గా ఉండింది. ప్రతి ఒక్కదాని పట్ల నేను ఆసక్తి ని కనబరచే వాడి ని. మూడు సంవత్సరాల క్రితం 2014వ సంవత్సరం లో ఒక ప్రభుత్వం సంపూర్ణ సంఖ్యాధిక్యం తో అది కూడాను కాంగ్రెస్ నాయకత్వం లేకుండా ఏర్పాటయింది. ఈ 16వ లోక్ సభ లో, 17 సమావేశాలు చోటు చేసుకొన్నాయి. ఈ సమావేశాల లో ఎనిమిదింటి లో 100 శాతం కన్నా ఎక్కువ పనులు జరిగాయి. మనం గనుక పరిశీలించినట్లయితే సగటు న 85 శాతం ఫలితం తో నిష్క్రమిస్తున్నాము.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రుల కు, వారికి అంటూ బాధ్యతలు ఉంటాయి. ప్రస్తుతం వాటిని తోమర్ గారు చూసుకొంటున్నారు. అంతకు ముందు ఈ వ్యవహారాల ను వెంకయ్య గారు చూసేవారు. ఆయన ఒక ప్రశంసాపాత్రమైనటువంటి పని ని చేసిపెట్టారు. ఇప్పుడు ఆయన ఉప రాష్ట్రపతి గా, మరి అలాగే, ఎగువ సభ చైర్మన్ గా ఒక కీలక పాత్ర ను పోషిస్తున్నారు. మనం మన యొక్క హుషారైన సహచరుడు అనంత్ కుమార్ గారి గైరు హాజరీ ని గమనించవచ్చు. అయితే, వారి వారి పనుల ను పూర్తి చేసిన ప్రతి ఒక్కరి ని నేను అభినందిస్తున్నాను.
16వ లోక్ సభ కాలం లో మొదటి సారి గా మనం అత్యధిక శాతం మహిళా ఎంపీ లను కలిగి ఉన్నందుకు కూడా మనం గర్వించవచ్చు. వారి లో 44 మంది మహిళా ఎంపీ లు కొత్త గా ఎన్నికైన వారు. మరి యావత్తు పదవీకాలం లో మహిళా ఎంపీ ల భాగస్వామ్యం అత్యున్నత స్థాయి లో ఉండింది. మనం దీని ని నమోదు చేయాలి. మహిళా ఎంపీలు అందరి కి ఇవే నా అభినందనలు.
మంత్రివర్గం లో అతి పెద్ద సంఖ్య లో మనం మహిళా మంత్రుల ను కలిగి వుండటం ఇదే తొలి సారి. అంతేకాదు, మొట్టమొదటి సారి గా మహిళా మంత్రులు ఇద్దరు- రక్షణ మంత్రి మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి- భద్రత సంబంధ సంఘం లో పాలు పంచుకొంటున్నారు. స్పీకర్ సైతం ఓ మహిళే. మరి అలాగే, రిజిస్ట్రార్ జనరల్, ఇంకా సెక్రటరీ జనరల్ కూడాను. లోక్ సభ సెక్రటరీ జనరల్ కు మరియు ఆమె యొక్క బృందం అంతటి కి కూడాను. అలాగే ఈ భవన సముదాయాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరి కి నేను అభినందనల ను తెలియజేస్తున్నాను.
ప్రభుత్వం యొక్క కార్యసాఫల్యాల ను ఈ సభ లో ప్రకటించడం కోసం నేను ఇక్కడ నిలబడ్డానని ఏ ఒక్కరూ భావించ వద్దు. అయితే, గడచిన 5 సంవత్సరాల కాలం లో యావత్తు సభ ప్రశంసా పాత్రమైన తోడ్పాటుల ను జోడించింది. అధికారం లో ఉన్న వారు, ప్రతిపక్షం లో ఉన్న వారు మన కృషి కి బలాన్ని సంతరించడం లో సహకరించారు.
గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలం లో ప్రపంచం లోకెల్లా ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం ఆవిర్భవించడం మన లో ప్రతి ఒక్కరి కి ఒక శుభ వార్తే. ఈ పదవీకాలం లో సాధించినటువంటి ఒక గొప్ప కార్యసిద్ధి ఇది. మరి దీని లో మనం అందరం భాగస్తులం అయి ఉన్నాము. విధానాలు మనం ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గా ఎదిగేందుకు మార్గదర్శకత్వం వహించాయి. మరి మన సభ చేసినటువంటి కృషి దేశం త్వరిత గతి న వృద్ధి చెందేందుకు సహాయకారి కావడం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించింది.
ప్రస్తుతం భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసం ఎంతో ఉన్నత స్థాయి లో ఉంది. ముందంజ వేయడాని కి ఆత్మవిశ్వాసం అనేది ఒక గొప్ప శక్తి అవుతుంది. సవాళ్ళ కు ఎదురొడ్డి నిలచి, పోరాడి విజయం సాధించడం లో ఆత్మవిశ్వాసం ఒక గొప్ప బలాన్ని ప్రసాదిస్తుంది. దేశ ప్రజలు ప్రస్తుతం విశ్వాసం తో ఉట్టిపడుతున్నారు. ఈ విశ్వాసాన్ని అంకురింప చేయడం లో ఈ సభ ఏకత తో మరియు మంచి వేగం తో ఒక కీలక పాత్ర ను పోషించింది. మరి అలాగే, ఈ గణనీయ ప్రక్రియల లో నాయకత్వ బాధ్యత ను కూడా వహించింది.
ఈ రోజు న, ప్రపంచం లోని ప్రఖ్యాత సంస్థ లు అన్నీ కూడాను భారతదేశం యొక్క ఉజ్వల భవిత కు సంబంధించి వాటి అభిప్రాయాల ను ఏకగ్రీవం గా వ్యక్తం చేయడం లో ఎటువంటి సంకోచాని కి తావు ఇవ్వడం లేదు. మరి భారతదేశం డిజిటల్ జగత్తు లో తనదైన స్థానాన్ని సంపాదించుకొని, అనేక సాఫల్యాల ను సాధించడం లో ఈ యొక్క పదవీకాలం దేశాని కి తోడ్పడటం అనేది స్వాభావికం గా ఉండింది.
ప్రపంచం భూతాపాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, భారతదేశం శక్తి సంరక్షణ అంశాల లో ఇంటర్నేశనల్ సోలర్ అలయన్స్ ద్వారా అగ్రగామి గా నిలచింది. పెట్రోలియమ్ ఉత్పత్తుల విషయం లో దేశాల సభ్యత్వం తో కూడిన ఒక సంస్థ ఉన్న విధంగానే భారతదేశం తీసుకొన్న ఈ నిర్ణయం యొక్క ప్రభావం రానున్న దశాబ్ధాల లో ప్రతిబింబించే రోజు ఎంతో దూరం లో లేదు. ఇంటర్నేశనల్ సోలర్ అలయన్స్ కు పర్యావరణాన్ని కాపాడేటటువంటి మరియు భూతాపం తో పోరాడేటటువంటి శక్తి ఉంది. అయితే, ప్రపంచాని కి ఒక ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థ ను అందించడం లో ఈ పదవీకాలం ఒక కీలకమైన పాత్ర ను పోషించినట్లు నేను నమ్ముతున్నాను.
అంతరిక్ష రంగం లో భారతదేశం తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరచుకొంది. ఈ పదవీ కాలం లో ఉపగ్రహ ప్రయోగాలు గరిష్ఠ సంఖ్య లో జరిగాయి. ఇది మన యొక్క శక్తి గా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచాని కి ఒక ప్రయోగ వేదిక మాదిరి గా ఒక గమ్య స్థానం గా ఆవిర్భవించింది. అది ఆర్థిక కార్యకలాపాల కు ఒక కేంద్రం గా కూడా మారుతోంది. తయారీ రంగం లోను, ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి లోను స్వావలంబన ద్వారా ముందంజ వేసే దిశ గా భారతదేశం సాహసోపేతమైనటువంటి అడుగుల ను వేస్తోంది.
ప్రపంచం ఈ రోజు న భారతదేశాన్ని గంభీరం గా పరిశీలిస్తోంది. మోదీ గారి వల్ల మరియు సుష్మ గారి వల్ల భారతదేశం యొక్క హోదా పెంపొందిందన్న భ్రాంతి లో ప్రజలు ఉండివుండవచ్చును. కానీ, వాస్తవం వేరు గా ఉంది. ఈ హోదా యొక్క ఉన్నతి కి కారణం సంపూర్ణ సంఖ్యాధిక్యత తో కూడిన ప్రభుత్వమే. పూర్తి సంఖ్యాధిక్యత తో కూడిన ఒక ప్రభుత్వాన్ని ప్రపంచం గుర్తిస్తుంది.
అటువంటి ఒక ప్రభుత్వం కొరవడిన కారణం గా ఆమధ్య 30 సంవత్సరాల కాలం లో ఒక నష్టం ఏర్పడింది. ఇలా ఎందుకు జరిగిందీ అంటే, ఎప్పుడైతే ఒక నాయకుడు అతడి కి పూర్తి మద్దతు ఉన్న వేళ మరొక దేశం యొక్క నేత – అతడు లేదా ఆమె- తో భేటీ అయినప్పుడు, ముందు పేర్కొన్న వ్యక్తి కి ప్రజల మద్ధతు ఉన్నదని అతడు లేదా ఆమె గ్రహించగలుగుతారు. దీని కి ఉండే విలువే ప్రత్యేకమైనటువంటిది. భారతదేశం ఈ రోజు న సాధించుకొన్నటువంటి స్థానం తాలూకు ఘనత మోదీ కి గాని, లేదా సుష్మ గారి కి గాని చెందదని, అది 2014వ సంవత్సరం లో 125 కోట్ల మంది భారతీయులు తీసుకొన్న నిర్ణయాని కి దక్కుతుందనే సంగతి ని అయిదు సంవత్సరాల కాలం లో నేను గమనించాను.
ఇదే విధం గా ఈ పదవీ కాలం లో భారతదేశం అనేక అంతర్జాతీయ సంస్థల లో ఒక స్థానాన్ని సంపాదించుకొంది. బాంగ్లాదేశ్ తో భూ వివాదాన్ని మనం పరిష్కరించుకొన్నది కూడా ఈ కాలం లోనే. అది ఒక పెద్ద కార్యభారం. భారతదేశం విభజన కు లోనై, మరి బాంగ్లాదేశ్ అవతరించినప్పుడు వివాదాలు పుట్టాయి. అయితే, దీని ని ఈ సభ పరిష్కరించింది. మరి నేను నమ్ముతున్నది ఏమిటి అంటే, మనం ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉన్నామని, మనం కలసి పని చేశామని, మరి ఏకాభిప్రాయ సహిత సందేశాన్ని ప్రపంచాని కి అందించామనీను. ఇవాళ నేను ఈ సభ తో పాటు, అన్ని పక్షాల కు నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.
ఇదే మాదిరి గా, మన విదేశీ విధానం లో ఒక కొత్త అంశం పుట్టుకు వచ్చింది. అది ఏమిటి అంటే, మానవీయ విలువలు మరియు మానవ హక్కులు ప్రపంచం లోని ఒక భాగాని కి చెందిన బాధ్యతే తప్ప వీటి తో మరెవరి కీ సంబంధం లేదు అనేదే. మరి మానవ హక్కుల ఉల్లంఘనల కు గాను నిందల బారిన పడ్డం ఈ దేశం ‘వసుధైవ కుటుంబకమ్’ మరియు మానవీయత లను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పట్ల అటువంటి ఒక ఇమేజ్ ను సృష్టించడమైంది. అయినప్పటి కి, నాకు తెలియనిది ఏమిటంటే, అటువంటి ఇమేజ్ ను ఎందుకు సృష్టించారు అనేదే. గడచిన అయిదు సంవత్సరాల ను మీరు గనుక పరిశీలించినట్లయితే, మనం నేపాల్ భూకంపం కాలం లో గాని, మాల్దీవ్స్ లో జల సంక్షోభం ఏర్పడినప్పుడు గాని, లేదా శ్రీ లంక లో, ఫిజీ లో గాలి వానలు వచ్చిన తరువాత గాని, లేదా మయన్మార్ కారణం గా బాంగ్లాదేశ్ లో శరణార్థుల సంక్షోభం తలెత్తినప్పుడు గానీ సహాయాన్ని అందించాము. యెమన్ వంటి విదేశాల లో చిక్కుబడిపోయిన ప్రజల ను మనం కాపాడాము. నేపాల్ లో 80 మంది ని కాపాడి వారి ని భద్రం గా తిరిగి వెనుక కు పంపించాము.
మానవ జాతి కి భారతదేశం ఒక గొప్ప తోడ్పాటు ను అందించింది. యోగా అనేది యావత్తు ప్రపంచం లో మనకు గర్వకారణం గా నిలచింది. ఇంతవరకు ఐరాస లో ఆమోదించినటువంటి అన్ని తీర్మానాల లోకి యోగా కు సంబంధించిన తీర్మానాన్ని అత్యంత స్వల్ప అవధి లో మరి అలాగే, గరిష్ట సభ్యుల సమ్మతి తో ఆమోదించడం జరిగింది. గాంధీ మహాత్ముని 150వ జయంతి ని మరియు బాబా సాహెబ్ ఆంబేడ్కర్ 125 వ జయంతి ని ఐరాస ఒక ఉత్సవం గా జరిపింది. మన నరాల లో ప్రవహించే ‘‘వైష్ణవ జన్ తో తేనే రే కహియే’ గీతాన్ని గాంధీ మహాత్ముని 150వ జయంతి నాడు 150 దేశాల కు చెందిన ప్రఖ్యాత గాయకులు ఆలాపించడం, మరి ఈ విధం గా ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించడం ఎవరూ ఎన్నటి కీ ఊహించ లేరు. అంటే, సాఫ్ట్ పవర్ ను ప్రపంచాని కి ఎలాగ చాటి చెప్పవచ్చో మనం ఈ రోజు న గ్రహిస్తున్నాం అన్న మాట.
జనవరి 26వ తేదీ న, అన్ని రాష్ట్రాలు గాంధీ గారి ని కేంద్ర బిందువు గా తీసుకొని, ఆయన ను ఒక విశిష్టమైన రీతి లో ఆవిష్కరించిన తీరు ను మనం తప్పక చూసే ఉంటాము; అదే, గాంధీ గారి ని ఆయన యొక్క 150వ జయంతి నాడు స్మరించుకోవడం. మనం ఈ పదవీకాలం లో రాజ్యాంగ దినాన్ని ఒక వేడుక గా జరుపుకొన్నాము. బాబా సాహబ్ 125వ జయంతి సందర్భం గా ఈ సభ లో ఒక ప్రత్యేక చర్చ ను మనం నిర్వహించుకొన్నాము. మనం ఈ సభ లో ఐరాస తాలూకు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాని కి కాలాన్ని వెచ్చించాము. మరి, సుస్థిర అభివృద్ధి లక్ష్యం అంశం పై సమష్టి గా చర్చించాము. ఈ పదవీకాలం లో ఈ సభ యొక్క నాయకత్వం లో భాగం గా ఇటువంటి కొత్త కొత్త అంశాలు సాధ్యపడ్డాయి. ఈ కారణం గా సభ లోని సభ్యులు అందరి కీ ఇవే నా అభినందనలు. ఈ సభ లోని ప్రతి ఒక్క సభ్యుడి కి, సభ్యురాలి కి నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.
దాదాపు గా 219 బిల్లుల ను ప్రవేశపెట్టగా 203 బిల్లుల కు ఆమోదం తెలపడమైంది. 16వ లోక్ సభ ను గురించి గాని, లేదా ఆ సభ కాలం లో వారి యొక్క జీవనం గురించి గాని, లేదా ఎన్నికల అనంతరం గాని ఈ సభ లోని సభ్యులు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నప్పుడల్లా, లేదా ఎప్పటికైనా ఏ విషయాన్నైనా రాయదలచినప్పుడల్లా వారు తప్పక ప్రస్తావించి తీరవలసిన విషయం ఈ పదవీకాలం లో ఈ సభ లో వారు ఒక భాగం గా వారు అవినీతి కి మరియు నల్లధనాని కి వ్యతిరేకం గా ఒక కఠినమైన చట్టాన్ని రూపొందించారన్నదే. ఇదివరకు రూపొందబడనటువంటి తరహా చట్టాల ను ఈ సభ రూపొందించడం జరిగింది. మరి విదేశాల లో కూడబెట్టినటువంటి నల్లధనాని కి వ్యతిరేకం గా అత్యంత ముఖ్యమైన చట్టాన్ని ఈ సభ లో రూపొందించడమైంది.
ఈ సభ దివాలా తీసిన కంపెనీలకు, అలాగే బేనామీ ఆస్తుల కు సంబంధించిన ఒక చట్టాన్ని కూడా రూపొందించింది. అదే ఐబిసి చట్టం. ఇదే సభ ఆర్థిక నేరగాళ్ళ కు వ్యతిరేకం గా సైతం చట్టాల ను రూపొందించింది.
సభ యొక్క అయిదేళ్ళ పదవీకాలం లో అవినీతి కి మరియు నల్లధనాని కి వ్యతిరేకం గా ఉత్తమమైన చట్టాల కు ఆమోదం తెలపడం, మరి వాటి కి వ్యతిరేకం గా పోరాడటం కోసం న్యాయ వ్యవస్థ ను బలవత్తరం చేయడం, తద్వారా అంతర్జాతీయ వేదిక లో మన చట్టం యొక్క బలాన్ని రుజువు చేయడం వంటి పనుల ద్వారా రాబోయే శతాబ్ధి కి ఈ సభ తన సేవల ను అందించింది. ఈ కారణం గా మీ నాయకత్వాని కి మరియు ఈ సభ కు అనేక అభినందనలు. ఈ విషయం లో భావి తరాలు సైతం మిమ్మల్ని అభినందిస్తాయి. ఇదే సభ జిఎస్టి బిల్లు ను ఆమోదించింది. మధ్య రాత్రి 12 గంటల కు ఒక సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటూ ఖ్యాతి ని పొందకుండా, మునుపటి ఆర్థిక మంత్రి మరియు అప్పటి రాష్ట్రపతి ల ద్వారా జిఎస్టి కి ఆమోదాన్ని తెలపడమైంది. అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరు హక్కుల ను పొందారు. మరి మనం కూడాను ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే మన యొక్క మంత్రాన్ని ఆచరణ రూపం లోకి తీసుకు రాగలిగాము.
అదే విధం గా, ఈ సభే ఆధార్ బిల్లు కు ఒక న్యాయపరమైన శక్తి ని సమకూర్చింది. ఆధార్ అనేది ప్రపంచాని కి ఒక అబ్బురమైనటువంటి విషయం గా ఉంది. ఈ దేశం అటువంటి ఒక పెద్ద కార్యభారాన్ని నెరవేర్చడాన్ని ఈ ప్రపంచం చూడగలిగింది. ఈ ప్రక్రియ ను అర్థం చేసుకోవడాని కి ప్రపంచం ప్రయత్నిస్తోంది. ఇది ప్రపంచం లో ఒక ప్రధానమైనటువంటి కార్యసాధన గా నిలచింది.
దేశం స్వాతంత్య్రం సంపాదించుకొంది. ఏమైనప్పటి కి, శత్రువు యొక్క ఆస్తి పట్ల నిర్ణయాల ను తీసుకోకుండా మనను అడ్డుకొన్న దృక్పథం ఏమిటి ? శత్రువు ఆస్తి బిల్లు ను దృఢం గా ఆమోదించడం జరిగింది.
ఈ సభ సామాజిక న్యాయం ద్వారా సమాజాన్ని చాలా కాలం పాటు ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సమాజం లో అగ్రవర్ణానికి చెందిన రిజర్వేశన్ ను పేద వర్గం వారి కి కల్పించడం జరిగింది. ఎటువంటి కటుత కు, అస్పష్టత కు, సందేహానికి లేదా భీతి కి గాని తావు ఇవ్వకుండా ఈ చట్టాన్ని చేసి, తద్వారా సమాజం లోని అణచివేత కు గురైన వర్గాల వాణి ని ఆలకించడం జరిగింది. ఉభయ సభల లోని అన్ని పక్షాల ఎంపీలు అందరు అభినందన కు అర్హులు. 10 శాతం రిజర్వేశన్ ఒక ప్రధానమైన కార్యభారం.
ఇదేవిధం గా, ఒబిసి కమిశన్ ను ఏర్పాటు చేయడం మరియు సర్వోన్నత న్యాయ స్థానం యొక్క నిర్ణయం అనంతరం ఎస్సి/ఎస్టి చట్టాని కి సంబంధించిన అపార్ధాన్ని తొలగించడం ఈ సభ ద్వారా జరిగాయి. మాతృత్వ ప్రయోజన చట్టం లో సవరణ చేయడం ద్వారా మాతృత్వపు సెలవుల ను12 వారాల నుండి 26 వారాల కు పెంచారన్న వాస్తవాన్ని గురించి తెలుసుకొని ప్రపంచం ఆశ్చర్య చకితం అయింది. భారతదేశాన్ని ప్రగతిశీల ఆలోచన ధోరణి కలిగినటువంటి ఒక దేశం గా ప్రపంచం ప్రస్తుతం పరిగణిస్తోంది. ఈ సభ దీని ని సాధించి పెట్టింది.
ఈ సభ చట్టాల ను రూపొందిస్తుంది. అయితే దేశ ప్రజలు మరియు ప్రపంచం కూడాను ఈ పదవీకాలాన్ని ఒక్క చట్టాల రూపకల్పన కోసమే కాకుండా కొన్ని కాలం చెల్లిన చట్టాల కు స్వస్తి పలికినందుకు కూడా జ్ఞాపకం పెట్టుకొంటుంది. ఇదే సభ యొక్క సభ్యులు 1400కు పైగా చట్టాల కు భరత వాక్యాన్ని పలికారు. ఈ సభ లో చట్టాల నందనం ఒకటి పుష్పించింది. మరి ఈ సభ పని కి రానటువంటి చట్టాల ను ఏరివేయడం ద్వారా కొత్త దారుల ను కనుగొన్నది. 1400 చట్టాల కు అంతం పలికిన తరువాత కూడా ఇది ఒక ఆరంభం అని నేను అంటాను. చేయవలసింది ఇప్పటి కీ ఎంతో ఉంది. ఆ పని కి గాను, ములాయం సింహ్ గారు ఆయన యొక్క దీవెనల ను మనకు అందించారు.
అది ఎంతటి గొప్ప కార్యభారమో! అయినప్పటి కి మనం దీనిని తీసుకుపోవలసిన పద్ధతి లో దేశ ప్రజల వద్ద కు తీసుకు వెళ్ళలేకపోయాము అని నేను అనుకొంటున్నాను. మన పట్ల ఎల్లప్పటి కీ ఒక అపఖ్యాతి ఉంటుంది. అది ఏమిటంటే, ఎంపీ లు వారి జీతాన్ని వారే నిర్ణయించుకున్నారు అనేది; దేశ ప్రజల ను గురించి ఎన్నడూ పట్టించుకోకుండా మన ఇష్టాని కి మన జీతాల ను పెంచుకుంటూ పోయాము అనేదీనూ. ఎంపీ ల జీతాన్ని పెంచిన రోజు న అన్ని వైపుల నుండి మన మీద కు అన్ని రకాల దుర్భాష లు రువ్వబడ్డాయి. ఇవి గడచిన 50 సంవత్సరాలు గా కొనసాగుతూ వచ్చింది.
మొట్టమొదటి సారి గా, ఎంపీ లందరూ ఈ యొక్క విమర్శ బారి నుండి తప్పించుకోవడాని కి ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించారు. మరి వారు ప్రతి ఒక్కరి కి ఒకే విధమైన జీతం ఉండేటటువంటి ఒక రాజ్యంగ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు. జీతం పెంపుదల ను గురించి వారు నిర్ణయించవలసిన అగత్యం ఉండదు. ఈ విమర్శ బారి నుండి ఎంపీ లు ప్రస్తుతం విముక్తి ని పొందారు. గత 50 సంవత్సరాలు గా సీనియర్ ఎంపీ లు అనేక మంది విమర్శ ల ను ఎదుర్కోవడం, అలాగే దుర్భాషల ను స్వీకరించడం చేయవలసి వచ్చింది. అయితే, ఈ సభ ప్రస్తుతం వారందరి కి విముక్తి ని ప్రసాదించింది. మన జితేంద్ర గారు మనకు చక్కటి నాణ్యమైన ఆహారాన్ని సమకూర్చారు. అయినప్పటి కీ, ఫలాహారశాల కు నిధులు తక్కువ గా ఉన్నాయని, బయటి ఆహారం ఖరీదైంది గా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఈ ఎంపీ లు ఇలాగ ఎందుకు వ్యవహరిస్తారు ?
జితేంద్ర గారి సంఘం నా యొక్క అభ్యర్ధన ను మన్నించినందుకు, అలాగే స్పీకర్ మేడమ్ నా యొక్క అభ్యర్ధన ను మన్నించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఫలాహారశాల లో ఆహార పదార్థాల ధరలు ఇక ఎంత మాత్రం చౌక గా లేవు. ఇది మన జేబుల కు చిల్లులు వేస్తుందన్న సంగతి ని నేను ఎరుగుదును. అయితే, ఈ సమస్య ను పరిష్కరించడాని కి కూడా మేము చర్యల ను చేపట్టాము. రానున్న రోజుల లో ఈ అంశాన్ని పూర్తి గా పరిష్కరించగలుగుతామని నేను నమ్ముతున్నాను.
అదే విధం గా మరికొన్ని అంశాల ను గురించి తెలుసుకోవడం ఈ సభ కు సంతోషాన్ని మిగుల్చుతుంది. సభ లో ఒకసారి భూకంపం వస్తుందన్న సంగతి ని మనమంతా వింటూ వచ్చాము. ఏమైనా అయిదు సంవత్సరాల కాలం ముగింపున కు వస్తోంది. కానీ, ఏమీ జరుగనే లేదు. ప్రజాస్వామ్యం యొక్క శక్తి మరియు లోక్ సభ యొక్క గౌరవం ఎటువంటివంటే ఆ విషయాలు ఏవీ ఎన్నడూ సంభవించనేలేదు. కొన్ని సందర్భాల లో వేడి వేడి సంభాషణలు చోటు చేసుకొనేవి; ఒక్కొక్క సారి అటు వైపు నుండి మరి కొన్నిసార్లు ఈ వైపు నుండి కూడా అలా జరిగింది. అప్పుడప్పుడు కొన్ని మాటలు అధికార పక్షం నుండి లేదా విపక్షం నుండి అనకూడనివి అనడం జరిగింది. ఏమైనా, ఈ సభ యొక్క నేత గా నేను – मिक्षामी दुखम: అని అంటాను. ఈ మాటల కు ఒక బలమైన సందేశం జత పడి వుంది; మరి నేను ఇందుకు క్షమాపణ వేడుకొంటున్నాను.
మల్లిఖార్జున్ గారి కి మరియు మాకు మధ్య ఇటువంటివే జరుగుతూ వచ్చాయి. ఆయన గొంతుక ఈ రోజున సరిగానే ఉందని నేను కోరుకొంటున్నాను. ఆయన చెప్పే మాటలు మనకు లబ్ధి ని చేకూర్చి ఉండాల్సింది. కొన్ని సార్లు ఆయన మాటల ను నేను వినలేకపోయాను. ఆనక పూర్తి వివరాల ను నేను తిలకించే వాడిని. అలా చేయడం అవసరం కూడాను. ఆయన యొక్క మాటలు నిజంగానే నాలో స్పృహ ను రేకెత్తించి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. నిజాని కి చాలా వరకు నేను నా ఉపన్యాసం లోని విషయాన్ని అక్కడి నుండే గ్రహించ గలిగాను. ఈ కారణం గా ఖడ్గే గారి కి నేను ఎంతో కృతజ్ఞుడినై ఉంటాను. ఆడ్వాణీ గారు సభ లో చాలాసేపు కూర్చొని ఉండే వారు. ఖడ్గే గారు కూడాను సభ లో పూర్తి సమయం పాటు ఉండే వారు. ఈ విషయాన్ని పార్లమెంటు సభ్యులు అందరూ నేర్చుకొని తీరాలి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తూవుండి ఇప్పటి కి దాదాపు 50 సంవత్సరాలు గడిచాయి. ఇది చిన్న విషయం ఏమీ కాదు. మీరు మీ యొక్క బాధ్యత ను ప్రశంసమైన రీతి లో నెరవేర్చారు. మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ, మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.
నేను ఈ సభ లోకి మొట్టమొదటి సారి గా విచ్చేసినప్పుడు నేను అనేక కొత్త విషయాల ను తెలుసుకోగలిగాను. ఉదాహరణ కు మొట్టమొదటి సారి గా ఎవరినైనా హత్తుకోవడాని కి మరియు వేటాడడాని కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి నేను తెలుసుకోగలిగాను. మొట్టమొదటి సారి గా కళ్ళ లో కోపం అనేది ఎలా వుంటుందనేది నేను గ్రహించగలిగాను. కనులు తెలిపే భావాల తో ఆడే ఆట ను నేను చూడగలిగాను. విదేశీ ప్రసార మాధ్యమాలు సైతం దీని ని ఆస్వాదించాయి. ఒక పార్లమెంటు సభ్యుడి గా మన బాధ్యత ఏమిటి అంటే అది పార్లమెంటు యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. మరి ఈ విషయం లో మనం మన శక్తి మేరకు ప్రయత్నించాము.
ఈ సారి మనం మన ఎంపీ ల ప్రతిభ ను గమనించవచ్చును. ఒక రోజు న నేను ప్రసంగిస్తున్న సమయం లో ఎంపీ లు ఈ సభ లో రాష్ట్రపతి ని గురించి కబుర్లు ఆడుకోవడం నేను విన్నాను. వినోద పరిశ్రమ కు చెందిన వారి కి అటువంటి కబుర్లు అవసరం అవుతాయి. కళాకారుల లో అత్యంత గొప్ప వారి వద్ద కూడాను ఇక్కడ నేను విన్నటువంటి కబుర్లు ఉండవు.
అదే విధం గా వేరు వేరు వస్త్రధారణ లు కూడాను. మన టిడిపి సహచరుడు ఇక్కడ లేరు గానీ టిడిపి కి చెందిన ఎన్. శివప్రసాద్ ఆ తరహా అసాధారణమైన దుస్తుల ను ధరించడాని కి అలవాటు పడ్డారు. ఉద్రిక్తత అనేది దృష్టి ని ఆకర్షించేది. మన పదవీకాలాన్ని ఎంతో ఉల్లాసం గా గడిపేయడమైంది.
నా వంటి ఒక కొత్త ఎంపీ మీ అందరి వద్ద నుండి ఎన్నో అంశాల ను నేర్చుకొన్నాడు. కొత్త వారు అయినప్పటికీ, మీరంతా నాకు ఎప్పటి కీ సహాయం చేస్తూ వచ్చారు. నేను ఉండకూడని చోటు లో ఉన్నానేమిటా అని ఏనాడూ అనుకోలేదు. ఒకటో ఇన్నింగ్స్ ఆరంభం లో మీరందరూ ఇచ్చినటువంటి మద్దతు కు, మార్గదర్శకత్వాని కి మరియు నాయకత్వాని కి మీకు నేను ఎంతగానో కృతజ్ఞుడినై వుంటాను. ప్రత్యేకించి మాన్య ములాయం సింహ్ గారి కి నేను కృతజ్ఞత లు చెప్పాలి. ఆయన యొక్క ఆప్యాయత మాకే కాకుండా, ప్రతి ఒక్కరి కి ఎంతో విలువైంది గా ఉంది. చిరకాల అనుభం కలిగిన సభ్యులు అందరి తోడ్పాటు ఎంతో విలువైంది గా ఉంది. మరొక్క మారు మీకు అందరికీ నేను నా మనసారా అభినందల ను తెలియ జేస్తున్నాను.
ఎంపీ లు అందరి పట్ల శ్రద్ధ ను వహించిన ఈ సభ తో అనుబంధితులైన సిబ్బంది అందరి ని నేను అభినందిస్తున్నాను. అలాగే, పార్లమెంట్ సభ్యులు అందరి కి ఇవే నా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపో గలిగాము. అలాగే, ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలపరచడం కోసం ఒక ఆరోగ్యకరమైన స్పర్ధ ను ప్రదర్శించ గలిగాము.
ఈ స్ఫూర్తి తోను, శుభాకాంక్షల తోను నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. మరొక్క మారు నా శిరస్సు ను వంచుతూ నేను పార్లమెంట్ సభ్యులు అందరి కి నా హృదయపూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
Several sessions in this Lok Sabha had good productivity. This is a very good sign.
— PMO India (@PMOIndia) February 13, 2019
I appreciate @MVenkaiahNaidu Ji, Late @AnanthKumar_BJP Ji for their service as Ministers for Parliamentary Affairs: PM @narendramodi in the Lok Sabha
India's self-confidence is at an all time high.
— PMO India (@PMOIndia) February 13, 2019
I consider this to be a very positive sign because such confidence gives an impetus to development: PM @narendramodi
The world is discussing global warming and India made an effort in the form of the International Solar Alliance to mitigate this menace: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 13, 2019
It is this Lok Sabha that has passed stringent laws against corruption and black money: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 13, 2019
It is this Lok Sabha that passed the GST.
— PMO India (@PMOIndia) February 13, 2019
The GST process revealed the spirit of cooperation and bipartisanship: PM @narendramodi