పిఎంఇండియా
సాయుధ దళాల ప్రత్యేక న్యాయస్థానం (ప్రధాన ధర్మాసనం), న్యూఢిల్లీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా 2014 డిసెంబరు 1వ తేదీ నాటి నుంచి 2016 ఏప్రిల్ 30 వరకు 17 నెలల కాలానికి భారత వైమానిక దళంలో ఎయిర్ మార్షల్ హోదాతో నిర్ణీత సంఖ్యకు మించిన ఒక పదవిని సృష్టించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. దీని ద్వారా.. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ బ్రాంచికి మంజూరు చేసిన ఎయిర్ మార్షల్స్ నిర్ణీత సంఖ్యకు మించి ఈ పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. సాయుధ దళాల ప్రత్యేక న్యాయస్థానం (ప్రధాన ధర్మాసనం), న్యూఢిల్లీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగాను, అలాగే రివ్యూ స్పెషల్ ప్రమోషన్ బోర్డు -2014 ప్రొసీడింగ్స్ కు అనుగుణంగాను ఎవిఎమ్ శ్రీ సంజయ్ శర్మకు పదోన్నతిని ఇచ్చేందుకు నియామకాలపై మంత్రివర్గ సంఘం (ఎసిసి) అనుమతిని సంబంధిత మంత్రిత్వ శాఖ కోరడానికి మార్గం సుగమం అవుతుంది.
ఈ పోస్టు ను సృష్టించడమనేది భారత సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలులో పెట్టడానికి దోహదం చేస్తుంది. మంజూరు లభించిన అనంతరం, అటు తరువాత రివ్యూ స్పెషల్ ప్రమోషన్ బోర్డు -2014 సమ్మతి తెలిపాక ఎవిఎమ్ శ్రీ సంజయ్ శర్మకు 2014 డిసెంబరు 1వ తేదీ నుంచి ఎయిర్ మార్షల్ ర్యాంకుకు ప్రమోషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు.