Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

20వ రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు సెప్టెంబర్ 19న నియామక పత్రాలను పంపిణీ చేయనున్న పీఎం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 12:30 గంటలకు జరిగే 20వ రోజ్‌గార్ మేళాలో, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కొత్తగా నియామకాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరిగే ఈ కార్యక్రమంలో అభ్యర్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో ఈ రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తారు. కొత్తగా నియామకాలు పొందిన అభ్యర్థులు రెవెన్యూ విభాగం, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. 

యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, దేశాభివృద్ధి ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం సారిస్తున్న దృష్టిని రోజ్‌గార్ మేళా ప్రతిబింబిస్తుంది. 20వ రోజ్‌గార్ మేళాతో కలిపి వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో నియామక పత్రాలు పొందిన యువత సంఖ్య సుమారుగా 12.75 లక్షలకు చేరుకుంటుంది.

 

***