Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2015 అభివృద్ధి అజెండా అమ‌లుకు ఐక్య‌రాజ్య‌స‌మితి సమావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం, న్యూయార్క్ న‌గ‌రంలో ద్వైపాక్షిక స‌మావేశాలు


ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 2105 అనంత‌ర అభివృద్ధి అజెండా అమ‌లుపై జ‌రుగుతున్న ఐక్య‌రాజ్య‌స‌మితి శిఖ‌రాగ్ర స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆయ‌న స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాన్ కీ మూన్‌ను, ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్‌ల‌తో స‌మావేశం కానున్నారు. న్యూయార్క్ న‌గ‌రంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న జోర్డాన్ రాజు, భూటాన్ ప్ర‌ధాని, శ్రీ‌లంక అధ్య‌క్షుడు, స్వీడ‌న్ ప్ర‌ధాని, ఈజిప్టు అధ్య‌క్షుడు, సెయింట్ లూసియా ప్ర‌ధాని, సైప్ర‌స్ అధ్య‌క్షుల‌తో వేర్వేరుగా ద్వైపాక్షిక స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు.