Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2016 జనవరి 2,3 వ తేదీలలో ప్రధాని కర్ణాటక పర్యటన


2016 జనవరి 2,3 వ తేదీలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్ణాటక లో పర్యటి౦చనున్నారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం ప్రధాని మైసూరు చేరుకుంటారు. పర్యటనలో భాగ౦గా అవధూత దత్త పీఠాన్ని స౦దర్శిస్తారు. ఆ తర్వాత శ్రీ సుత్తూరు మఠం జగద్గురు డాక్టర్ శ్రీ శివరాత్రి రాజేంద్ర మహాస్వామిజీ శతజయ౦తి వేడుకలలో పాల్గొ౦టారు.

జనవరి 3వ తేదీన మైసూర్ విశ్వవిద్యాలయంలో జరగబోయే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103 వ సెషన్(సమావేశము) ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత తుంకూరు వద్ద నూతనహెలికాప్టర్ తయారీ యూనిట్ కి ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

చివరగా యోగా రీసెర్చ్ మరియు దాని అప్లికేషన్స్(యోగా పై పరిశోధన, దాని అనువర్తనాలలో ఉన్న పరిమితుల)పై జిగ్నిలో జరిగే 21వ అ౦తర్జాతీయ సదస్సును ఆదివార౦ నాడు ప్రధాని ప్రార౦భిస్తారు.