Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2016-17, 2017-18 మరియు 2018-19 సంవత్సరాలలో కంట్రోల్ యూనిట్స్, బ్యాలట్ యూనిట్స్, ఇంకా వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యూనిట్స్ సేకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం


ఈ కింద పేర్కొన్న వాటిని సేకరించాలని ఎన్నిక‌ల సంఘం చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంమంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

అ) 2016-17 సంవ‌త్స‌రంలో 5,50,000 బ్యాలట్ యూనిట్లు (బి యు లు.. ఒక్కొక్క బ్యాలట్ యూనిటును తాత్కాలిక ధర రూ.77,007 చొప్పున) మరియు 5,45,000 కంట్రోల్ యూనిట్లను (సి యు లు.. ఒక్కొక్క సియు తాత్కాలిక ధర రూ.93,007 చొప్పున‌) క్రమానుగతంగా మెస్సర్స్ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ నుండి, మరియు మెస్సర్స్ ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి సేకరించాలి. ఇంకా..

ఆ) ఈ సేక‌ర‌ణకు మొత్తంమీద అయ్యే ఖ‌ర్చును భవిష్యత్తులో గ‌ణ‌నీయ స్థాయిలో త‌గ్గించాలన్న ప్రత్యేక ప్రయోజనంతో ప‌రిశోధ‌న మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) ప్రయత్నాల కోసం రూ.25 కోట్లు కేటాయించాలి. 2017-18 మరియు 2018-19 సంవత్సరాల కోసం బి యు లు ఇంకా సి యు ల సేకరణ ప్రణాళికను తదనంతరం పరిశీలించాలని కూడా నిర్ణయించారు. అలాగే, 2016-17, 2017-18 మరియు 2018-19 సంవత్సరాలకు గాను వోట‌ర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్ర‌య‌ల్ యూనిట్ (వి వి పి ఎ టి)ల సేకరణ ప్రణాళికను గురించి కూడా త‌రువాతే పరిశీలించనున్నారు.

2000- 2005 సంవత్సరాల మ‌ధ్య కాలంలో సేకరించిన ఎల‌క్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు పాతబడిపోయాయి. వాటిని ఎన్నికల సంఘం క్రమంగా పక్కన పెట్టి కొత్త వాటితో పూర్తి చేసేటందుకు, 2019 సంవత్సరంలో నిర్వహించవలసి ఉన్న లోక్ సభ సాధారణ ఎన్నికల అవసరాలను, అలాగే కొన్ని రాష్ట్రాలలో విధాన సభలకు జరపవలసి ఉన్న ఎన్నికల అవసరాలను తీర్చుకొనేటందుకు కూడా తాజా నిర్ణయం ఎన్నికల సంఘానికి వీలు కల్పించనున్నది.

పూర్వ రంగం:

ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను (ఇ వి ఎమ్ లను) మొదట్లో ప్రయోగించి చూసి, ఆ పిమ్మట 2004 లోక్ సభ సాధార‌ణ ఎన్నిక‌లప్పటి నుండి దేశమంతటా అన్ని పోలింగ్ కేంద్రాలలోను ఇ వి ఎమ్ ల‌నే ఉప‌యోగిస్తూ వస్తున్నారు. ఈ ఇ వి ఎమ్ లను ఎన్నికల సంఘం కోరిన మీదట రెండు ప్రభుత్వ రంగ సంస్థలు.. బెంగళూరు లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బి ఇ ఎల్), మరియు హైదరాబాద్ లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇ సి ఐ ఎల్)లు తయారు చేశాయి. ఒక్కొక్క ఇ వి ఎమ్ లోను సాధారణంగా ఒక బ్యాలట్ యూనిట్ (బి యు), ఒక కంట్రోల్ యూనిట్ (సి యు) ఉంటాయి. అయితే, అభ్యర్థుల సంఖ్య 16 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒక సి యు కు మ‌రొక బి యు ను చేర్చడానికి వీలు ఉంది; ఇలాగ గరిష్ఠంగా 4 బి యు లను ఒక సి యు కు తగిలించవచ్చు.