Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 ఆగ‌స్టు 11న ముంబ‌యి లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018 ఆగ‌స్టు 11వ తేదీన ముంబ‌యి లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఆయ‌న బాంబే లో గ‌ల ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి 56వ వార్షిక స్నాత‌కోత్స‌వం లో పాలుపంచుకొని స్నాత‌కోత్స‌వ ప్ర‌సంగం చేస్తారు.

స్నాత‌కోత్స‌వం అనంతరం, ప్ర‌ధాన మంత్రి ఐఐటి బాంబే లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన‌ర్జీ సైన్స్ & ఇంజినీరింగ్ నూత‌న భ‌వ‌నాన్ని మ‌రియు సెంట‌ర్ ఫ‌ర్ ఎన్ వైర‌న్ మంట‌ల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ను ప్రారంభిస్తారు.

**