Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018, జూన్ 14వ తేదీన ఛత్తీస్ గఢ్ లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జూన్ 14వ తేదీ గురువారం నాడు ఛత్తీస్ గఢ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

భిలాయి లో ఆధునికీక‌రించిన మ‌రియు సామ‌ర్ధ్యాన్ని విస్త‌రించిన‌టువంటి భిలాయి స్టీల్ ప్లాంటు ను దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి అంకితం చేస్తారు. ఈ ఆధునికీక‌ర‌ణ కార్య‌క్ర‌మం లో భాగంగా ఉత్పాద‌క‌త‌, నాణ్య‌త‌, వ్య‌యం, స్ప‌ర్ధాత్మ‌క‌త‌, శ‌క్తి వినియోగంలో సామ‌ర్ధ్యం, ఇంకా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ రంగాల‌లో అత్య‌ాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని నెలకొల్పడం జరిగింది.

ఇదే కార్య‌క్ర‌మంలో భాగంగా, ఐఐటి భిలాయి కి శాశ్వ‌త ప్రాంగ‌ణ నిర్మాణం కోసం శ్రీ న‌రేంద్ర మోదీ పునాది రాయి ని వేస్తారు. ఆయ‌న భారత్ నెట్ యొక్క రెండో ద‌శ కు ఆరంభ సూచ‌కమైన ఓ ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రిస్తారు. భారత్ నెట్ ప్రాజెక్టు లో భాగంగా గ్రామ పంచాయ‌తీ ల‌ను భూగ‌ర్భ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ సంధానాన్ని కల్పించడం జరుగుతుంది.

జ‌గ్‌ ద‌ల్‌ పుర్ మ‌రియు రాయ్‌ పుర్ ల మ‌ధ్య గగనతల సేవల‌ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించనున్నారు. వివిధ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌కు ల్యాప్‌టాప్ ల‌ను, ధృవ ప‌త్రాల‌ను మ‌రియు చెక్కులు త‌దిత‌ర ప‌త్రాల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి వితరణ చేస్తారు. ఒక జ‌న స‌భ‌ ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

భిలాయి కి చేరుకోవడానికన్నా ముందు ప్ర‌ధాన మంత్రి నయా రాయ్‌ పుర్ స్మార్ట్ సిటీ ని సంద‌ర్శించి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ ను ప్రారంభిస్తారు.

***