Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018, మార్చి 16వ తేదీన మ‌ణిపుర్ లో ప‌ర్య‌టించ‌నున్న‌ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2018, మార్చి 16వ తేదీ నాడు మ‌ణిపుర్ లో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఆయ‌న ఇంఫాల్ లోని మ‌ణిపుర్ విశ్వ‌విద్యాల‌యంలో జ‌రిగే ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్ 105వ స‌ద‌స్సులో ప్రారంభోప‌న్యాసం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిథేయిగా వ్యవహరించే ఈశాన్య ప్రాంతంలోని రెండో నగరం ఇంఫాల్ యే కానున్నది.

లువాంగ్ సంగ్ బమ్ లోని లువాంగ్ పోక్ పా మ‌ల్టి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్ లో జాతీయ క్రీడా విశ్వ‌విద్యాల‌యంతో పాటు 1000 ఆంగన్‌ వాడీ కేంద్రాలు, ఉపాధ్యాయులు, వైద్యులు మ‌రియు న‌ర్సుల కోసం ఉద్దేశించిన 19 నివాస భ‌వ‌న స‌ముదాయాలకు ప్రధాన మంత్రి శంకుస్థాప‌న చేస్తారు; ఇంకా, ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌కు చెందిన కార్య‌క్ర‌మాలలోనూ పాలుపంచుకొంటారు. లువాంగ్ పోక్ పా మ‌ల్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్, రాణి గైడిన్‌లియూ పార్క్, త‌దిత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ సంద‌ర్భంగా జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తారు.

***