Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 వేసవి యువ ఒలింపిక్స్ పతక విజేతలకు ప్రధానమంత్రి సత్కారం

2018 వేసవి యువ ఒలింపిక్స్ పతక విజేతలకు ప్రధానమంత్రి సత్కారం

2018 వేసవి యువ ఒలింపిక్స్ పతక విజేతలకు ప్రధానమంత్రి సత్కారం


అర్జెంటీనాలో జరిగిన 2018 వేసవి యువ ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన యువ క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సత్కరించారు. రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో పతక విజేతల వేదికపై భారతీయులుగా సగర్వంతో నిలిచే క్షణం కోసం ఏకాగ్రతతో కృషి చేయాల్సిందిగా ప్రధానమంత్రి వారికి సూచించారు. ఇందుకు ప్రభుత్వపరంగా అవసరమైన మద్దతుతోపాటు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ యువ క్రీడాకారులు తమతమ గ్రామాల్లో, పాఠశాలల్లోని సహచరులు క్రీడలవైపు మళ్లేవిధంగా వారిలో స్ఫూర్తిని రగిలించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత పతాకం రెపరెపలాడే విధంగా పతక విజేతలైన యువ క్రీడాకారుల ప్రతిభకు పదునుపెట్టడంలో తమవంతు కృషిచేసిన శిక్షకులను కూడా ప్రధానమంత్రి అభినందించారు.

***