Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ న జరిగిన నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ న జరిగిన నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ న జరిగిన నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ న జరిగిన నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


ఈ కార్యక్రమాని కి హాజరైన సినీ పరిశ్రమ వారందరికీ అభినందన లు. నాకు అందించిన హృద‌య‌పూర్వక స్వాగతాని కి మీ అందరి కి ఇవే ధన్యవాదాలు. నా జీవితం లో తొలిసారి గా చలనచిత్ర పరిశ్రమ కు చెందిన ప్రముఖుల తో సమావేశమై, ఈ సృజనాత్మక జగత్తు కు చెందిన వారి తో చర్చించే అవకాశం వచ్చింది. నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేశాను గాని ఇటువంటి అవకాశం ఎన్నడూ రాలేదు. మీ అందరి ప్రతిభ పాటవాల తో భారతదేశం లో చలనచిత్ర రంగం ఎప్పటికప్పుడు కొత్త పుంత లు తొక్కుతున్నది. ఈ ప్రక్రియ కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను. నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా ను ఏర్పాటు చేసినందుకు మీ అందరి కి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

గత రెండు దశాబ్దాలు గా ఈ మ్యూజియమ్ చర్చల లో ఉంది. ఇది ఈ రోజు న ప్రారంభం కావడం తో భారతీయ సినిమా సువర్ణ చరిత్ర ను కళ్ల కు కట్టాలన్న కల సాకారం అయింది. ఈ పాత్ర ను పోషించే మంచి అవకాశాన్ని నాకు ముందు పని చేసిన ప్రధానులు అందరు నాకు వదలిపెట్టారని, ఆ కారణం గా కేవలం నా ఒక్కరికే ఇటువంటి అవకాశాలు లభించాయని నేను భావిస్తున్నాను.

మీరు అందరు న్యూ ఇండియా లో నవ సినిమా కు సారథులు. ఈ సమయం లో అన్ని తరాల కు చెందిన కళాకారులు ఇక్కడ ఉన్నారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను.. ఈ రోజు న మీతో ఉన్నాను గనుక ఆ ప్రశ్న ను అడుగుతున్నాను.

ఎలా ఉంది జోశ్?

ఎలా ఉంది జోశ్?

ఈ రోజుల లో ఈ జోశ్ అనే మాట దేశం లో విస్తృతం గా వాడకం లో ఉంది. న్యూ ఇండియా నిర్మాణాని కి ఈ జోశ్ అనేది ఎంతో కీలకం.

రంగు రంగు ల ఈ సినిమా ప్రపంచం లో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆ కోణాలు అన్నిటి ని ఈ మ్యూజియమ్ దేశ ప్రజలు అందరి కి సజీవం గా చూపిస్తున్నది. ఆ అంశం పై ఆసక్తి గల వారి కి ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. భారతీయ చలనచిత్ర రంగం గత వైభవాని కి, సుప్రసిద్ధ చిత్రాల కు, నటుల కు సంబంధించిన సంపూర్ణ సమాచారం తో పాటు వారు ఆ రంగం లో నిలదొక్కుకొనేందుకు ఎలా పోరాడిందీ కూడా కథనాల రూపం లో సందర్శకుల కు చూపిస్తుంది.

ఈ జాతీయ చలనచిత్ర సంగ్రహాలయాన్ని చూసి తెలుసుకొనేందుకు, అర్థం చేసుకొనేందుకు యువతరాని కి ఎంతో అవకాశం ఉంది. ఈ సంగ్రహాలయం లో జరుగుతున్న ఏర్పాట్లను గురించి కొన్ని సందర్భాల లో నేను చూశాను. ఒకటో అంతస్తు ను మరియు రెండో అంతస్తు ను కూడా నేను సందర్శించాను. మూడో అంతస్తు ను కూడా చూడాలని ఉంది. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. చివరి వరకు అన్నీ అనుభవపూర్వకం గా చూడాలనే ఉత్సుకత ను మది చూపించింది. అందుకే నేను ఆలస్యం గా ఇక్కడ కు వచ్చాను. మీ అందరికి క్షమాపణ లు చెప్తున్నాను.

మన చలనచిత్రాలు ఎంత గొప్పవో ఈ సంగ్రహాలయం కూడా అంతే గొప్పది. అది చరిత్ర ను గౌరవించడమే కాకుండా భవిష్యత్తు కు దిశానిర్దేశం చేస్తుంది. దీని కి పురాతన విలువ లు మరియు ఆధునిక విలువ లు రెండూ ఉన్నాయి. గుల్ శన్ బహల్ భవనం చరిత్ర కు దర్పణం పడితే రెండో ఆధునిక భవనం మన భవిష్యత్ దృష్టి కోణాని కి సంకేతం గా నిలుస్తుంది. భారతీయ సినిమా కు గర్వకారణమైన ప్రారంభ కాలాన్ని గుల్ శన్ బహల్ భవనం ఆవిష్కరిస్తుంది. 30 గంటల నిడివి ఉండే మ్యూజియమ్ లోని ఈ విభాగం రెండో ప్రపంచ యుద్ధం లో మన సైన్యం సాహసాల ను కళ్ల కు కట్టినట్టు చూపుతుందని నాతో చెప్పారు.

సైన్యం నుండి కథ ను తీసుకొని దానిని డిజిటైజ్ చేసినందుకు ఫిలిం డివిజన్ ను నేను అభినందిస్తున్నాను. ఇది రెండో ప్రపంచ యుద్ధాని కి చెందిన ఫుటేజ్ అయినప్పటికీ 20 లక్షల మంది కి పైగా భారతీయ సైనికులు చూపిన సాహసం మన భవిష్యత్ తరాల కు కళ్ల కు కట్టినట్టు చూపించడం తో పాటు వారి లో స్ఫూర్తి ని నింపుతుంది. ఒకటో ప్రపంచ యుద్ధం లో, రెండో ప్రపంచ యుద్ధం లో 15 లక్షల మంది కి పైగా భారతీయ సైనికులు ఆత్మార్పణ చేశారు; అయితే ఆ విషయాలన్నిటి ని మనం మర్చిపోయాము. చరిత్ర లోని ఆ కోణాన్ని ఇక్కడ సరికొత్త విధానం లో చూపించారు.

నేను ప్రపంచం లో ఎవరితో అయినా మాట్లాడినప్పుడు శాంతి ని గురించి మీరు మాకు బోధించనక్కరలేదని చెబుతూ ఉంటాను. ప్రపంచం లోని ఇతర దేశాల ప్రజల కోసం 15 లక్షల మంది సైనికుల ను మనం కోల్పోయాము. అదే మన చరిత్ర. అది భవిష్యత్ తరాల కు స్ఫూర్తిదాయకం.

అందుకే మిత్రులారా, వాస్తవం లో చలనచిత్రాలు, సమాజం రెండూ కూడాను ఒక దాని ప్రతిబింబం మరొకటి.
సమాజం లో ఏం జరుగుతోంది చలనచిత్రాల లో చూపిస్తారు. చలనచిత్రాల లో ఏం జరుగుతుందనేది సమాజం చూస్తుంది. ప్రజలు సమాజం లో రానున్న మార్పు ను గుర్తించడం చాలా సందర్భాల లో మీరు గమనించే ఉంటారు. ఏదైనా జరగడానికి ముందే అది సినిమాల లో చూడగలుగుతారు. కళాప్రపంచం రేపటి ని ఆవిష్కరిస్తుంది. 60వ, 70వ దశకాల్లో మనోజ్ కుమార్ చిత్రాలు దేశ భక్తి ప్రపూరితంగా ఉన్న విషయం మనందరికీ గుర్తుంది. స్వాతంత్ర్యం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం చలనచిత్రాల లో మరింత పెద్దదైన పాత్ర ను పోషించివుండవలసింది.

అదే విధం గా 70 , 80వ దశాబ్దాల్లో యాంగ్రీ యంగ్ మన్ కనిపించాడు. కానీ మన జీవన స్థితిగతుల లో ఎంతో మెరుగుదల చోటు చేసుకోవడం తో మన ఆశలు, ఆశయాలు కూడా పెరగడం మొదలైంది. ఆ మార్పు సినిమాల లో కూడా కనిపిస్తోంది. సమాజం లో వలెనే సినిమాల లో కూడా ప్రతి దశ లో మార్పు ఏర్పడుతుంది. ఈ రోజు న మనందరం సరికొత్త ట్రెండ్ ను చూస్తున్నాము.

ఒకప్పుడు సినిమా లో ఒక అంశం ప్రముఖం గా కనిపించేది. ఆ చిత్రం లో హీరో ముంబయి లేదా ఢిల్లీ వంటి పెద్ద నగరాల లో పెద్ద కుటుంబాని కి చెందిన వాడై ఆకర్షణీయం గా కనిపించే వాడు. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ ట్రెండ్ మారింది. రెండో అంచె, మూడో అంచె నగరాల లో మధ్య తరగతి కుటుంబాల కు చెందిన యువత చిత్ర రంగం లో ప్రవేశించారు. కళ పరం గా, నైపుణ్యం పరంగా వారు చలనచిత్ర పరిశ్రమ కు కొత్త జీవాన్ని అందించారు. ఇది కూడా దేశం లో చోటు చేసుకొంటున్న మార్పు కు దర్పణమే అని నేను చెబుతున్నాను. దాని ని మనం చూశాము, అనుభవించాము.

ఈ రోజు న క్రీడలే కావచ్చు, స్టార్ట్- అప్ లే కావచ్చు, 10వ తరగతి, 12 తరగతి ఫలితాలే కావచ్చు.. ఎందులోనూ పెద్ద నగరాలకు చెందిన ప్రముఖ పాఠశాల ల పిల్లలు కాకుండా చిన్న చిన్న పట్టణాల కు చెందిన వారు అగ్ర స్థానాల లో నిలుస్తున్నారు. అంటే దేశం యొక్క శక్తి పెరుగుతోంది. మనం చాలా చలనచిత్రాల లో భారతదేశం యొక్క పేదరికాన్ని, నిస్సహాయత్వాన్ని చూశాము. కానీ ఈ రోజు న వస్తున్న చిత్రాల్లో వాటికి పరిష్కారాల ను కూడా చూపుతున్నారు. లేదంటే పేదరికం జన్మతః వస్తుందని మనం నమ్ముతాము. సత్యనారాయణ వ్రతం సినిమా చూసినా ఒక పేద గ్రామం లోని నిరుపేద బ్రాహ్మణుని తో కథ మొదలవుతుంది. పేదరికం జన్మతః వస్తుందన్న మన మానసిక ధోరణి ప్రభావం ఇది.

మారుతున్న భారతదేశం ఈ రోజు న భిన్నం గా ఆలోచిస్తోంది, భిన్నం గా చూస్తోంది, భిన్నం గా భావ ప్రకటన చేస్తోంది. ఆ మార్పు ఈ రోజు న సమాజం లో, సినిమాలో కూడా సుస్పష్టం గా కనిపిస్తోంది. ఈ రోజు కూడా సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలూ ఉన్నాయి. ఏదైనా అవరోధం ఉంటే దాని ని అధిగమించాలనే ఒక భావం కూడా ఉంది. భారతదేశం మారుతోంది. సొంత పరిష్కార మార్గాల ను అన్వేషిస్తోంది.

లక్షలాది సమస్యలు ఉంటే వాటి కి కోట్లాది పరిష్కారాలు ఉన్నాయి. మనం మారగలము. మన లోపలి ఆత్మ విశ్వాసం సుస్పష్టం గా గోచరిస్తోంది. ఆ ఆత్మవిశ్వాసం తో సమాజాన్ని కుదిపివేస్తున్న సమస్యల ను మనం తీసుకొంటున్నాము. ఏ సమస్య చేపట్టేందుకైనా వెనుకంజ అనేది లేదు. మనం బెదిరిపోము లేదా వాటిని దాచిపెట్టము. అందుకు భిన్నం గా అది మరింత గా కనిపించేలా చేసి దాని ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాము. దేశాన్ని గర్వం గా నిలబెడుతున్న కొత్త విశ్వాసం ఇదే.

మిత్రులారా,

మీరు మరో ట్రెండ్ ను కూడా గమనించి ఉంటారు. గతం లో ఒక చిత్రం నిర్మించాలంటే 8 నుండి 10 సంవత్సరాలు లేదా 10 నుండి 15 సంవత్సరాల కాలం పట్టేది. చలనచిత్రాన్ని నిర్మించడానికి ఎంత కాలం పట్టిందనేది కూడా ఒక గుర్తింపు గా ఉండేది. 8, 9, 12 సంవత్సరాలు నిర్మిస్తే అదో పెద్ద ఘనత గా చెప్పుకొనే వారు. ప్రజలు దాని ని గురించే చర్చించే వారు. కానీ ఇప్పుడు నెలల కాలవ్యవధిలోనే చలన చిత్ర నిర్మాణం పూర్తయిపోతోంది.

ఇప్పుడు ప్రభుత్వ పథకాల తీరు కూడా అలాగే ఉంది. గతం లో జరిగినంత పెద్ద ప్రణాళిక ల పని లేకుండా పోయింది. గతం లో ఏదైనా పథకం పూర్తి కావాలంటే 30 లేదా 40 సంవత్సరాలు పట్టేది. ఈ ఒక్క మ్యూజియమ్ నిర్మాణానికే 20 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిర్దిష్ట కాల పరిమితి ని ప్రకటించి ఆ లోగా దానిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తోంది. మీరంతా దాన్ని చూస్తూనే ఉన్నారు. యువతరం ఆశయాలను ముందుగానే గుర్తించి మీరు అభివృద్ధి చెందారని చెప్పడం తప్పు కాదనే నేను భావిస్తున్నాను. మీరు రెండడుగులు ముందే ఉన్నారు. ఆ శక్తి జాతి నిర్మాణం లో కీలక పాత్ర పోషించగలుగుతుంది.

మిత్రులారా,

మన వినోద పరిశ్రమ లోని కథాంశాలు మానవ భావోద్వేగాలు, సునిశిత వైఖరులు, చర్యలు, ప్రతిచర్యలు, హాస్యం, విషాదం అన్నీ కలసి ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం తో మమేకం అయ్యే అంశాలే. దేశం ఏదైనా మానవ భావోద్వేగాలు సమానం గా ఉంటాయి. భారత వినోద పరిశ్రమ ఈ భావాలన్నింటినీ ప్రేక్షకులు అనుభవించేలా చేస్తుంది.

ఒకసారి నేను విదేశాల కు వెళ్తూ విమానం లో తోటి ప్రయాణికుల ను చూశాను. ఒక వ్యక్తి నాతో ఇలా చెప్పాడు. నేను భారతదేశం వస్తూ ఉంటాను. భారతీయ సినిమాలు చూస్తూ ఉంటాను. మీ దేశం లో కళాకారులు ఒకరి కాళ్ల మీద పడి ఎందుకు ఏడుస్తారు, వారు దేవాలయాల కు వెళ్లి ఎందుకు విలపిస్తారు, ఎందుకు అలా అరుస్తారు? అని ప్రశ్నించాడు. అది అతని కి ఒక అద్భుతం గా గోచరించిందని అర్ధం. భారత సంప్రదాయం ప్రకారం మనిషి ఆ భావోద్వేగాల కారణం గా తక్షణ ఉపశమనాన్ని పొందుతాడు. కాని వారికి అది ఒక ఆశ్చర్యకరమైన అంశం.

మన సినిమాలు ఆ అద్భుతాన్ని సాధించాయి. సగటు మనిషి భావోద్వేగాల ను అలవోక గా ప్రదర్శించి ప్రేక్షకుల కళ్ల ముందుంచుతాయి. అది అంత తేలికేమీ కాదు. కళ లు, కళాకారులు, సాహిత్యం అన్నీ క్షేత్ర స్థాయి వాస్తవాల తో సమ్మిళితం అయి ఉంటాయి గనుక కళ కే అది సాధ్యం. అప్పుడే కళా బీజాలు మొలకెత్తుతాయి.

హాస్యం చేయడానికో, అభిమానుల ను పెంచుకోవడానికో మనం ఆ ప్రభావాన్ని చూపిస్తాము. ఈ అద్భుతాన్ని సాధించినందుకు నేను చిత్ర పరిశ్రమ ను నిజం గా అభినందిస్తున్నాను. వారందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన యువత బాట్ మన్ అభిమానులు, అలాగే బాహుబలి అభిమానులు కూడాను. మన చలనచిత్రాల్లోని పాత్రల కు ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు ఉంది.

మిత్రులారా,

భారత సాఫ్ట్ పవర్ లో అంతర్గతమైన కీలక విభాగం చలనచిత్రాలు. అవి ప్రపంచ దేశాల దృష్టి లో భారతీయత కు ప్రతినిధులు గా నిలుస్తాయి. ప్రపంచాని కి భారతీయ చలనచిత్రాలు పెద్ద ఆకర్షణ. అక్కడి బాక్స్ ఆఫీసుల్లో మన చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తాయి. దేశం పట్ల విశ్వసనీయత ను పెంచేందుకు, భారతదేశానికి ఒక బ్రాండ్ ను కల్పించేందుకు అవి కృషి చేస్తాయి.

రాజ్ కపూర్ సినిమాల కు మన దేశంలోనే కాదు, విదేశాల లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం అందరికీ బాగా తెలుసు. వివిధ పర్యటనల్లో ప్రజల ను కలిసినప్పుడు నాకు అది అనుభవంలోకి కూడా వచ్చింది. కొన్ని దేశాల అధ్యక్షులు కూడా హిందీ చలనచిత్రాల్లోని పాట లు పూర్తి గా పాడడం నేను చూశాను.

నేను ఇటీవలే ఇజ్రాయల్ కు వెళ్లాను. అక్కడ ప్రధాని ఇచ్చిన విందు లో మేము ఇరువురమే పాల్గొన్నాము. మా మధ్య మంచి స్నేహం ఉంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు మేము మాట్లాడుకొంటూనే ఉన్నాము. ఇజ్రాయల్ ప్రధాని ‘‘ఇచక్ దానా’’ పాట ను పూర్తిగా పాడారు. ఆయన కు భాష తెలియదు, పాట భావం కూడా తెలియదు. మన చలనచిత్ర పరిశ్రమ పరిధి అది.

కొంత కాలం క్రితం నేను దక్షిణ కొరియా ను సందర్శించాను. అక్కడి అధ్యక్షుడు విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భం గా బాలల ప్రదర్శన ఏర్పాటయింది. ఆ పాఠశాల బాలలు ‘‘హాథీ మేరీ సాథీ’’ పాట కు అభినయిస్తూ పాడారు. ఆ తరువాత వారి ని కలసినప్పుడు మీరు పాడిందేమిటో మీకు తెలుసా ? అని అడిగాను. ఒక గున్న ఏనుగు తెలుసు, మిగతాది తెలియదు అని వారు ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యచకితుడి ని చేసింది. వారి ప్రదర్శన ఎంతో చక్కగా ఉంది. అంత తక్కువ సమయం లో వారు ఎంత గా కృషి చేశారో అని నేను విస్మయం చెందాను.

మన పరిశ్రమ చూపే ప్రభావం ఎంతటిదో చూడండి. కొరియా నుండి తిరిగి వచ్చిన తరువాత నేను ఆ పాట ను కొరియన్ భాష లోకి తర్జుమా చేయించి ఆ పాఠశాల బాలల కు తిరిగి పంపాను. మీ బలం అంతటి ది. ఈ రోజు న సినిమా ల వలెనే టివి సీరియళ్లు కూడా ప్రత్యేక గుర్తింపు సాధించాయి. టివి సీరియల్ ‘‘క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ’’ని ఒక్క భారతదేశం లోనే చూస్తారని మీరు అనుకొంటే అది పొరపాటే. ప్రపంచ దేశాల లో పర్యటించినప్పుడు ఈ విషయాన్ని గమనించాను. ప్రత్యేకం గా అఫ్గానిస్తాన్ లో ఈ సీరియల్ ను చూడని కుటుంబం లేదు అంటే ఆశ్చర్యం గా ఉంటుంది.

ప్రపంచ దేశాల ప్రజలు భారతదేశం లో సగటు ప్రజల జీవనం ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ని ప్రదర్శిస్తారు. ఆ సంగతి ని వారు బహిరంగంగానే చర్చిస్తారు. ఒకసారి నేను వియత్నాం పర్యటన లో ఉండగా ఆ దేశ ప్రధాని తో ముఖాముఖి సమావేశం అయ్యాను. అక్కడ మేము ఇద్దరమే ఉన్నాము. మీరు ఒక్కరే ఎందుకు వచ్చారు?, మీ కుటుంబం ఏది? అని ప్రశ్నించాను. మీ భార్య ను కూడా తీసుకు వచ్చేందుకు ఇది చక్కని సందర్భం కదా అన్నాను. వారి ది కమ్యూనిస్టు దేశం. నాయకుడు కమ్యూనిస్టు. ప్రజలు కమ్యూనిస్టులు. ఆ తరువాత జనవరి 26వ తేదీ న రిపబ్లిక్ డే వేడుకల ను వీక్షించడానికి నేను పలు దేశాల నాయకుల ను ఆహ్వానించాను. ఆ సందర్భంగా వియత్నాం ప్రధాని తో జరిగిన ఒక సంభాషణ మీకు చెబుతాను. ‘‘సోదరా, నా ఇంట్లో ఒక సమస్య ఉంది’’ అంటూ ఆయన ఇలా చెప్పుకు వచ్చారు. నా భార్య వియత్నాం భాష లోకి తర్జుమా చేసిన ‘‘రామాయణ’’ సీరియల్ గంట ల తరబడి చూస్తుంది. అందుకే ఆమె ఇక్కడకు రావడానికి ఇష్టపడలేదు అన్నారు ఆయన. మనం ఇతరుల ను ఎంత గా ప్రభావితం చేస్తున్నామో మీరు ఊహించగలరా ? మనం మన బలాన్ని గుర్తించకపోతే, ఎవ్వరి ని కూడాను నిందించ కూడదు అన్నది నా భావన.

మిత్రులారా,

మన సినిమా ది నిశ్శబ్ద శక్తి. ఈ నిశ్శబ్ద శక్తి బోధిస్తుంది, కొత్త ఆలోచనల ను అందిస్తుంది. కొత్త ఆలోచన లు సమాజం పై ఒక శక్తివంతమైన ఆయుధం గా నిలుస్తాయి. అటువంటి ఆలోచన ధోరణి ని నాటిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటి నుండి స్ఫూర్తి ని పొంది కొందరు కొత్త ఆలోచనల తో ముందుకు వచ్చారు.

ఈ రోజులలో ఒక టాయ్ లెట్, మహిళా సాధికారిత, క్రీడలు, బాలల సమస్య లు, వ్యాధుల పట్ల చైతన్యం, సైనికుల సాహసం వంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు న మీరు నిర్మించిన అత్యుత్తమ చిత్రాలు సినిమా మాధ్యమం ద్వారా సమాజాని కి చేరుతున్నాయి. విప్లవం అనే ఆలోచన యొక్క స్వభావమే మారిపోయింది.

సామాజిక కథాంశాలు గల చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తాయి. అవి కూడా జాతి నిర్మాణాని కి తమ వంతు వాటా ను అందించగలుగుతాయి.

మిత్రులారా,

మీరు చలనచిత్ర నిర్మాణ ప్రక్రియ ద్వారా మన దేశం లోని భిన్నత్వాన్ని గౌరవిస్తున్నారు. అది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి ని బలోపేతం చేస్తుంది.

మన హిందీ చిత్రాల లో, వినోద పరిశ్రమ లో ప్రతి ఒక్కరూ నేపాలీ భాష ను, నేపాలీ కళాకారుల ను ఉపయోగించుకొంటున్నారు. కానీ మన దేశంలోనే ప్రతి ఒక్క రాష్ట్రాని కి ఒక ప్రత్యేకత అంటూ ఉంది. దాని ని కూడా ఒక ప్రయోజనం గా తీసుకొని ఇద్దరు కళాకారులు చిత్రం లో కనీసం నాలుగు వాక్యాలైనా ఆ భాష లో మాట్లాడితే దేశం లో ఐక్యత భావం తాలూకు సందేశం వ్యాపిస్తుంది. ఉదాహరణ కు నాగాలాండ్ కు చెందిన వారు ఎవరైనా తెర మీద కనుపించి నాగా భాష ను మాట్లాడితే అది వందలాది భాష లు, 1700కి పైగా మాండలికాల కు ప్రేరణ గా నిలుస్తుంది. సుసంపన్నమైన దేశ భిన్నత్వాని కి పట్టం కట్టినట్టు అవుతుంది.

ఉదాహరణ కు ఒక కళాకారుడు ఒక సామెత ను చెప్పినట్టయితే మరో వ్యక్తి తక్షణం తమ భాష లో దానికి సమానార్ధం వచ్చే సామెత ను చెబుతాడు. దాంతో దేశం లోని భిన్నత్వం లో ఏకత్వం యొక్క బలం ఎంతటిదో తెలుస్తుంది. సమాచారానికి అంత శక్తి ఉంది.

రాజ్యవర్థన్ సింగ్ రాఠౌడ్ గారు చెప్పినట్టు దేశం లో కేవలం సినిమా షూటింగ్ ల ద్వారానే ప్రసిద్ధం అయిన పలు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. మనం దాని ని కూడా శక్తివంతమైన సాధనం గా మార్చుకోవచ్చు. ఈ రోజు న కూడా ఎక్కడికైనా వెళ్తే ఈ ప్రాంతం లో ఆ పాట చిత్రీకరించారు, ఆ సంఘటన చిత్రీకరించారు అని ప్రజలు చెబుతూ ఉంటారు. ఆ సమయం లో తాము పుట్టిందీ లేనిదీ కూడా వారికి తెలియదు. కానీ ఆ సంఘటన ఇక్కడ చిత్రీకరించారు, దేవానంద్ ఇక్కడ కనిపించారు అని ప్రజలు చెప్పుకోవడం పరిపాటి. శాస్త్ర ప్రాధాన్యం గల ఎన్నో ప్రదేశాలు కూడా ఎంతో అందం గా చిత్రాల్లో కనిపించాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించడం లో చలనచిత్ర పరిశ్రమ ఎంతో పెద్ద పాత్ర ను పోషించగలదన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు న పర్యాటకం ఎంతో విస్తరించింది. కానీ తాజ్ మహల్ సహా ఎన్నో ప్రాంతాల కు చెందిన సమాచారం పూర్తి స్థాయి లో అందుబాటు లో లేదు. మన దేశం లో చూడడానికి ఏదీ లేదు అనే ప్రచారాని కి ఆ సమాచార లోపం దారి తీస్తుంది. ప్రపంచ భావన అంతా సమాచార లోపం ప్రతిబింబమే.

చూపించడానికి మా దగ్గర కూడా ఎంతో ఉంది అని మనం ప్రపంచాని కి నమ్మకంగా చెప్పడానికి కావలసిన వేదిక ను ఏర్పాటు చేయడంతో చలనచిత్ర పరిశ్రమ ఎంతో పెద్ద పాత్ర పోషించగలుగుతుంది. అత్యంత నిరుపేద చాయ్ అమ్మకం దారు కు కూడా ఉపాధి ని కల్పించగల విభాగం పర్యాటకమే అన్నది నా భావన.

ఇటీవల నేను చాలా మంది తో భేటీ అయ్యాను. తాము ఎన్నో ప్రదేశాల కు వెళ్లామని, షూటింగ్ కు అనుమతులు పొందడం లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పిన వారు ఉన్నారు. చట్టాల ను సరళతరం చేసినట్టయితే అది సాధ్యం అవుతుంది. ఇతరులు చెప్పడం ద్వారా చలనచిత్ర పరిశ్రమ ను గురించి నేను ఎంతో విన్నాను. ఇప్పుడు మీ ప్రపంచం పై నాకు మరింత అవగాహన కలిగింది. నేను ప్రభుత్వ అధికారుల కు కూడా అదే విషయాన్ని చెప్పి, ఆ సమస్య కు పరిష్కారం ఏమైనా ఉందేమో పరిశీలించవలసింది గా సూచించాను.

దేశం లోని భిన్న ప్రాంతాల లో చలనచిత్రాల చిత్రీకరణ లకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం త్వరలో రానున్నదని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అలాగే ఇందుకోసం ఒక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేశాము. మీరు అందులో సమాచారం పొందుపరిస్తే చాలు, ఎన్ఎఫ్ డిసి కి చెందిన సంబంధిత అధికారి తాను చేయవలసిన పని ని పూర్తి చేస్తారు. ఈ ప్రయత్నం మీరు నా ముందు పెట్టిన పలు పెద్ద సమస్యల ను పరిష్కరించగలుగుతుందని నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో అనుమతుల కోసం 50 మంది వేర్వేరు వ్యక్తుల కు చేతులు జోడించి మీరు నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉండదు. మీ హీరో తో ఒక ఫొటో తీసుకొనేందుకు అనుమతి ఇచ్చినప్పుడే నేను అనుమతిస్తాను అని షరతు లు విధించే వారు కూడా ఉండరు. ఇటువంటి అనుభవాలు ఇక ముందు మీరు నాతో చెప్పే అవకాశం కూడా రాదు. ఇది అత్యంత చౌక మార్గం అని మీరే అనుకుంటారు. వ్యాపారానుకూలత కు దీటు గా చలనచిత్ర అనుకూలత ను మీరే గమనిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం సర్వత్రా నిఘా తో వ్యవహరిస్తుంది. నా వంతు గా చేయగలదంతా చేస్తాను, నన్ను నమ్మండి.

మిత్రులారా,

భారతీయ సినిమా ను మరింత పటిష్ఠం చేయడానికి, దేశం లో సానుకూలత ను తీసుకు వచ్చేందుకు, మీ సమస్యల పై సమగ్ర చర్చ ను చేసేందుకు ప్రభుత్వం మీకు సహాయకారి గా ఉంటుంది. కొంతమంది మిత్రులు జిఎస్ టి ని గురించి ఆందోళన ప్రకటించారు. నేను అతడి ని రాజ్ భవన్ లో కలుసుకొన్నాను. సార్, మేం ఎంతో కష్టపడి నిర్మిస్తున్నాము. కానీ ప్రేక్షకులు రాకపోతే ఏం ప్రయోజనం?, మేం ఏం చేయాలి? అని అడిగారు. ఎవరు డబ్బు పెట్టారో వారి ఆసక్తి అది. భిన్న శ్రేణి కి చెందిన ఇతర కళాకారులు కూడా ఉన్నారు. వారు తమ కళ ప్రేక్షకుల ను చేరాలని మాత్రమే ఆతృత ప్రదర్శిస్తారు. వారి కి డబ్బు తో ఏం పని లేదు. ఆ విషయం నా చెవి న పడగానే దాని ని గురించి పరిశీలించాలని నేను జిఎస్ టి కౌన్సిల్ కు సూచించాను. దాని ని మార్చ గల శక్తి నా చేతి లో లేదు, చేయవలసింది జిఎస్ టి కౌన్సిల్. అందుకే కౌన్సిల్ మీ ఆందోళన ను గుర్తించి, 100 రూపాయల పైబడి ధర లోని టికెట్ లకు జిఎస్ టి ని 28 శాతం నుండి 18 శాతాని కి తగ్గించింది.

అలాగే పైరసీ సమస్య ను నా చెవి న వేశారు. దాని ని గురించి మీరు ఆవేదన చెందడం అత్యంత సహజం. పైరసీ మీ శ్రమ కు, మీ సామర్థ్యాని కి అవమానకరం. దాని ని దృష్టి లో పెట్టుకొని పైరసీ ని నిలువరించేందుకు 1952 సంవత్సరపు సినిమటోగ్రఫీ చట్టం లో సవరణల ను చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ సవరణ అనంతరం చలనచిత్రాల ను వీడియో కెమెరాల లో బంధించడం శిక్షార్హమైన నేరమే కాదు, ఆ నేరాని కి శిక్ష కూడా అత్యంత కఠినం కూడా అవుతుంది.

మిత్రులారా,

గత నాలుగున్నర సంవత్సరాల కాలం లో ప్రభుత్వం 1400 పైగా కాలం చెల్లిపోయిన చట్టాల ను రద్దు చేసింది. 2013-14 లో నేను ప్రచారం చేస్తున్న సమయానికి అప్పటి ప్రభుత్వం తాము చేసిన చట్టాలను, చేయబోయే చట్టాలను మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేసిందంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తరువాత ఆ చట్టాల గతి ఏమిటన్నది వారికి అవసరం లేదు. అందుకే ఆ సమస్య ను నేను పరిష్కరించాను. కాలం చెల్లిపోయిన చట్టాలను రోజుకొక్కటి చొప్పున రద్దు చేయాలని సంకల్పించాను. దేశం లో జరిగిన చాలా మంచి పనుల కు గుర్తింపు రానట్టుగానే ఈ విషయం మీ వరకు వచ్చి ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క దానికి పౌరులు ప్రభుత్వం వెంట ఎందుకు పడాలన్నది నాకు అర్ధం కాని విషయం. ఉదాహరణ కు సాంకేతిక విజ్ఞ‌ానం ఎంతగానో మారిపోయింది. ఈ రోజు న మొబైల్ ఫోన్ లో కూడా మీరు రేడియో ను వినవచ్చు. కానీ దానికి లైసెన్స్ కావాలి. ఆ చట్టాన్ని నేను రద్దు చేశాను. మారుతున్న కాలాని కి దీటు గా ఉపయోగకరం కాని చట్టాలను మరెన్నింటి నో రద్దు చేస్తానని మీకు ఈ సందర్భం గా హామీ ఇస్తున్నాను.

యానిమేశన్ విభాగం లో ప్రభుత్వ నిర్ణయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మన దేశం లో తయారయ్యే యానిమేశన్, విజువల్ ఎఫెక్ట్ ల విషయంలో ప్రపంచవ్యాప్తం గా ఎంతో గౌరవం ఉంది. మేక్ ఇన్ ఇండియా కు ఎంత ప్రాధాన్యం ఉందో డిజైన్ ఇన్ ఇండియా కు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మన సృజనాత్మక ప్రతిభ ప్రపంచాని కి ఎంతో అందించగలుగుతుంది. దానిని బలోపేతం చేయడానికి యానిమేశన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ విభాగాల కోసం జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సృజనాత్మక ప్రతిభ అపారం గా ఉన్న చిత్ర పరిశ్రమ దేశం లో ఈ విభాగం లో మానవ వనరుల కొరత ను తగ్గించేందుకు తన వంతు సహాయాన్ని చేయలేదా అన్నదే నా ప్రశ్న.

దేశం లో కమ్యూనికేశన్, ఎంటర్ టైన్ మెంట్ విశ్వవిద్యాలయం ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చలనచిత్ర పరిశ్రమ కు చెందిన వారు దీని పై మరింత గా కృషి చేసి చక్కని సాంకేతిక విజ్ఞ‌ానం గల, సృజనాత్మకత కు పూర్తి స్థాయి అవకాశం గల, మారుతున్న ప్రపంచాని కి అవసరమైన ప్రభావం చూపించగల పూర్తి స్థాయి విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే చలనచిత్రాల కు ఫైనాన్సింగ్ కూడా మంచి అవకాశాలు ఉన్నటువంటి విభాగం. ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసినట్టయితే ప్రభుత్వం చేసిందన్న భావన మీలో కలుగుతుంది. దానికి కొన్ని దురుద్దేశాలను అంటగట్టే ప్రయత్నం కూడా జరగవచ్చు, నేను దానిని కోరుకోవడం లేదు. దేశం లో సగటు మనిషి కి కావలసింది చేయాలనే నేను భావిస్తాను. కానీ ఈ దిశ గా కృషి చేసేందుకు మీరు ముందుకు వస్తే ప్రభుత్వం తన వంతు సాయాన్ని చేస్తుంది.

మిత్రులారా,

ఒక చర్చ లో మీలో కొందరు ఒక ముఖ్యమైన సలహా ను ఇచ్చారు. అది నాకు కూడా నచ్చింది. మనందరం ముంబయి ని ప్రపంచం లో ప్రత్యేకం గా నిలబెట్టాలి, మన ప్రతిష్ఠ అంతర్జాతీయం చేయాలి. అందుకు దోహద పడే సలహా అది. దావోస్ ప్రపంచ ఆర్థిక శిఖరాగ్రాని కి వేదిక అవుతున్నట్టుగానే ప్రతి రెండు సంవత్సరాల కు ఒక సారి భారత చలనచిత్ర పరిశ్రమ ఒక అంతర్జాతీయ సమ్మేళనాన్ని ఎందుకు నిర్వహించకూడదు? అన్నదే వారు ఇచ్చినటువంటి సలహా. ఇప్పటివరకు దేశం లోని చలనచిత్రోత్సవాల్లో సృజనాత్మకత కే అగ్రపీఠం లభిస్తోంది. వ్యాపారాని కి అగ్రపీఠం వేయడం, కొత్త బజారు ను కల్పించుకోవడం ఎందుకు ప్రాధాన్యం లోకి రాకూడదు ? వివిధ సాంకేతికత లు, చలనచిత్రాల కు ఫైనాన్సింగ్, ప్రపంచం లో ఆ రంగాన్ని విస్తరించడం వంటి అంశాల పై చర్చాసభ లు నిర్వహించాలి. ఆ రకమైన ప్రపంచ చలనచిత్రోత్సవం భారతదేశం లో జరుగకూడదా ?

మొత్తం సమ్మేళనాన్ని చలనచిత్ర కళాకారులు, కోట్లాది ప్రజల జీవనోపాధి తో అనుసంధానమైన అన్ని వర్గాల వారి భాగస్వామ్యం తో సమ్మిళితం, పరిపూర్ణం గా నిర్వహించాలనేదే నేను మీ ముందుంచే ఆలోచన. నేను ఆ సలహా కు సానుకూలంగానే స్పందించాను.

తొలి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఆ చలనచిత్రోత్సవం లో మన చలనచిత్ర రంగం భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా నిర్వహించాలి. తదుపరి దాని ని దావోస్ ఆర్థిక సదస్సు అంత గా విస్తృతం చేయాలి. చాలా మంది లో అంతర్గతం గా ఈ సాఫ్ట్ వేర్ ఉంది. నాకు జన్మతః అటువంటి సాఫ్ట్ వేర్ ఉన్నందువల్ల నేను ఏదీ తక్కువ గా ఆలోచించను. మనం అంతర్జాతీయ శక్తి గా ఎదిగేందుకు ఇది ఒక మార్గం. మన నిపుణులు ప్రపంచం ముందు నిలబడి చలనచిత్ర రంగం కృషి ని ప్రపంచానికి వివరిస్తారు. దానిపై చర్చల ను కూడా నిర్వహిస్తారు. దాని వల్ల మన 50, 60, 100 సంవత్సరాల చలనచిత్ర ప్రయాణం వృథా కాదనే సంకేతం ప్రపంచాని కి చేరుతుంది.

మిత్రులారా,

చాలా సందర్భాల లో ఎవరికి చలనచిత్ర రంగం గురించిన ఆలోచన వచ్చినా, దానికి గల గ్లామర్, వెలుగు జిలుగు ల గురించే చర్చ ప్రముఖం గా వస్తుంది. ఆ గ్లామర్ కు, వెలుగు జిలుగుల కు వెలుపల ప్రపంచం యావత్తు ను ఆలోచింప చేయగల, ఆశల ను రేకెత్తించ గల, భావోద్వేగం తో మమేకం కాగలిగినటువంటి అతి పెద్ద ప్రపంచం ఉన్నది. ఈ రోజు న ఈ మ్యూజియమ్ ను చూస్తూవుంటే చలనచిత్ర నిర్మాణం లో తెర వెనుక ఉండే సిబ్బంది ఎన్ని కష్టాల ను ఎదుర్కొంటారో నాకు అర్ధం అయింది. వారు ఎంతో సంక్లిష్టమైన పనుల ను చేయగలరని, ఎంతో కష్టపడతారనే అవగాహన నాకు ఏర్పడింది. పని లో భాగం గా వారు గంటల తరబడి నిలబడే ఉంటారు. కానీ ప్రపంచం నటీనటుల ను మాత్రమే చూస్తుంది. ఇతర అంశాలు అంతగా తెలియవు. అవి అన్నీ వెలుగు లోకి తెచ్చే చక్కని సందర్భం అది. మన దేశం లో అన్ని అంశాల ను ఒకే రాజకీయ నాయకుని కి అప్పగించి దేశాని కి ఎంతో నష్టం కలిగించారు. రహదారుల కు, నిర్మాణాల కు రాజకీయ నాయకుల పేర్ల ను పెట్టడం ద్వారా వారి కి చరిత్ర లో స్థానాన్ని కల్పించారు.

మీ పరిశ్రమ లో సాంకేతిక నిపుణులు, సృజనాత్మకత, కళ.. ఇలా అన్ని వైపులా ఎంతో మంది చక్కని నిపుణులు ఉన్నారు. మీకు మీరే ఒక వ్యవస్థ. దానిని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు అందరూ ఎంతో శ్రమించారు. ఉదాహరణ కు జితేంద్ర గారినే తీసుకొంటే ఆయన సుదీర్ఘ కాలం పాటు తన శరీరాకృతి ని చెక్కు చెదరకుండా ఉంచుకొనేందుకు ఎంతో శ్రమించారు. ఆయన ఎంత శ్రమ పడిందీ సగటు జీవి కి తెలియాలి. ఎంతో పోరాటం చేసి వారందరూ వారి యొక్క జీవితాల ను ఈ శిఖరాని కి తీసుకు వచ్చారు. అవి సామాజిక మాధ్యమం ద్వారా అందరి తో పంచుకోవడానికి మీరు వెనుకాడ కూడదు. మీ జీవితం ఎలా ప్రారంభం అయిందీ, ఎన్ని కష్టాల ను మీరు ఎదుర్కొన్నదీ, పాత రోజుల లో ఎంత గా ఎదురీదిందీ, ఎన్నేసి గంటలు శ్రమించి పని చేసిందీ.. ఇవన్నీ ప్రపంచాని కి తెలియజేయండి. ఉదాహరణ కు హిమాలయాలనే తీసుకొంటే మీరు చలనచిత్రం షూటింగ్ కోసం మంచు ఖండాల కు కూడా వెళ్లారు. మీ శరీరం సహకరించకపోయినా పాత్ర కోసం నవ్వుతూ నటించి ఆ సన్నివేశఆల ను పండించారు. అవి అన్నీ తెలియ చేయక పోతే భావి తరాల కు మీ కష్టాల ను గురించి ఏమీ తెలియదు. వారు వెలుగుల ను మాత్రమే చూస్తారు. మీరు పడ్డ ఇబ్బందులు, మీ కష్టాలు, మీ త్యాగాల ను గురించి ఆలోచించరు. ఈ కష్టాలు, శ్రమ.. దీనిని అంతటి ని సామాజిక మాధ్యమం ద్వారా పంచుకొని యువత కు చేరేటట్టు చేయాలి అన్నది నా సలహా. తాము కూడా ఎన్ని కష్టాలు పడి అయినా సరే, జీవితం లో ఉన్నత శిఖరాల కు చేరాలి అనేటటువంటి ప్రేరణ వారి కి కలుగుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ గా అంచనా వేసుకోకండి. ఈ రోజు న మిమ్మల్నందరినీ ఒక ఆదర్శప్రాయ నమూనా గా భావించే యువత ఎందరో ఉన్నారు. మీ జీవిత వాస్తవాలు వారి కి ఎంతో స్ఫూర్తిదాయకం అవుతాయి. బంగారు పళ్లెం లో పెట్టి ఏదీ మీ ముందుకు రాలేదు అనే సంగతి ని యువతీయువకుల కు తెలియ చేయాలి. పుట్టుక తో అన్నీ అందుబాటు లోకి రాలేదని, ఎంతో కఠోర శ్రమ దాని వెనుక ఉందని వెల్లడి చేయాలి. ఈ వివరాలు అన్నిటి ని ప్రజల ఎదుట ఆవిష్కరిస్తే జీవిత నిర్మాణం, ప్రవర్తన నిర్మాణం లో అవి ఎంతో ఉపయోగకరం గా ఉంటాయన్నది నా యొక్క విశ్వాసం. మీ అనుభవాలు అన్నిటి ని యువత తో పంచుకొంటారని నేను ఆశిస్తున్నాను.

కాలచక్రం అనుగుణం గా భారతీయ సినిమా తీరు ను, పరిధి ని ప్రదర్శించాలని నేను మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఉదాహరణ కు తొలి 25 సంవత్సరాలనే తీసుకుంటే భారత చలనచిత్ర పరిశ్రమ స్వభావం ఎలా ఉంది, మీరందరూ ఎంత గా సంఘర్షించారు, అప్పటి నుండి వచ్చిన మార్పు ఏమిటి ?.. ఇవన్నిటి ని చూపించండి. ప్రజల కు అన్నీ సజీవం గా కళ్ల కు కట్టినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు 21వ శతాబ్ది నడుస్తోంది. చలనచిత్ర నిర్మాణం పూర్తి గా మారిపోయింది. సాంకేతిక విజ్ఞానం దాని ని సమూలం గా మార్చివేసింది. అందుకే పాత కాలం నాటి సమాచారాన్ని పరిరక్షించడం ఎంతో అవసరం. భవిష్యత్తు లో మనం ఏం చేయవలసివుంటుందో ఆలోచిస్తే విజ్ఞ‌ాన శాస్త్రం, నూతన ఆవిష్కరణ లపై రాబోయే తరాల ఆలోచన ధోరణి మారిపోతుంది. శాస్త్రీయ దృక్పథం తో నిర్మించే సినిమాల తీరు వేరే గా ఉంటుంది. శాస్త్రీయ నేపథ్యం తో నిర్మించే చలనచిత్రాల కు చాలా పని చేయవలసివుంటుంది. శాస్త్రీయ ధోరణి ని విస్తరించడం లో సినిమా చక్కని మాధ్యమం గా ఉంటుంది. మీరంతా బయోపిక్ లను నిర్మిస్తూ ఉంటారు. మనం ఎంతో కృషి చేయవలసి ఉన్న విజ్ఞ‌ాన శాస్త్రం, నూతన ఆవిష్కరణ లు, పర్యావరణం వంటి భిన్న రంగాల కు చెందిన అంశాల పై చలనచిత్రాల ను నిర్మిస్తే ప్రజలు స్ఫూర్తివంతం అవుతారు.

మిత్రులారా,

మా ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాల స్వభావాన్ని సమూలం గా మార్చివేసిన విషయాన్ని మీరంతా గమనించే ఉంటారు. నిస్వార్థపరులై మానవతా పూర్వకం గా ఎంతో సేవ చేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు పొందక మరుగున పడ్డ వారి ని గత నాలుగు సంవత్సరాలు గా మేం వెతికి పట్టుకొన్నాము. ఏ వార్తాపత్రికలు, చివరి కి ప్రాంతీయ పత్రిక లు కూడా వారి ని గురించి ప్రచురించలేదు. అటువంటి వారిని వెతికి పట్టుకొని వారి ని ‘పద్మశ్రీ’ తో సత్కరించాము. వారి లో కొందరు పర్యావరణం లో ఎంతో కృషి చేశారు. కొందరు ప్రజల కు ఉచితంగా చికిత్స లు చేశారు. మరొకరు పాఠశాల ను నడిపారు. ఇదంతా వారు జీవిత కాలం లో సంపాదించిన చిన్న మొత్తాల నుండి ఖర్చు చేశారు. అటువంటి మహాత్ములు ఈ దేశం లో ఉన్నారు. అటువంటి వారి ని నేను గౌరవిస్తాను. వారి ని ఎంత గౌరవించినా అది తక్కువే అవుతుంది. అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో చలనచిత్ర పరిశ్రమ పరిశీలించిందా ? మీరందరూ బయోపిక్ లను నిర్మించే సమయం లో వారి జీవితాల ను పరిశీలించండి. వాటిని అధ్యయన అంశాలు గా తీసుకోండి. వారు ఎంతో స్ఫూర్తి ని నింపుతారు, ఎంత మార్పు వస్తుందో మీరు ఊహించనైనా లేరు. మీ చలనచిత్రాల కథల కు మారుమూల అటవీ ప్రాంతాల లో ఏకాకి గా ఉన్న వ్యక్తులు కూడా కథాంశం గా ఉంటారు. దశరథ్ మాంజి వంటి వారి కథల కు అంతటి శక్తి ఉంది.

మిత్రులారా,

మన దృష్టిప‌థం నుండి త‌ప్పుకోరాని ఒక సంఘటన ఉంది. అదే 1857 తిరుగుబాటు. మ‌న‌ కు చారిత్రక అవ‌గాహన ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ 1857 భారత స్వాతంత్ర్య పోరాటాన్ని చూస్తే మన గిరిజ‌నుల పోరాట ప‌టిమ, వారు బ్రిటిష్ పాల‌కుల‌ పై పోరాడిన ధోర‌ణులు తెలుస్తాయి. ప్ర‌తి గిరిజన ప్రాంతం లోనూ, ప్ర‌తి గిరిజ‌నుడి నోట ఈ క‌థ‌ లు అల‌వోక‌ గా వ‌స్తూ ఉంటాయి. 100 నుండి 200 మంది ఉరికంబాల‌కు ఎక్కారు. ఆ రికార్డు ఇప్ప‌టికీ స‌జీవం గా ఉంది. కానీ అద్భుత‌మైన ఈ ప్ర‌ముఖులు చేసిన త్యాగాలు చాలా త‌క్కువ మంది కి మాత్ర‌మే తెలుసు. జ‌లియ‌న్ వాలా బాగ్ సాహస స్ఫూర్తి తో మ‌నం ఆ సంఘ‌ట‌న‌ లు అధ్య‌య‌నం చేయ‌క‌పోవ‌చ్చు, కానీ ఆ క‌థ‌నాలు మ‌న‌ కు అన్ని చోట్లా క‌నిపిస్తాయి.

ప్ర‌భుత్వం ఈ రోజు న ఒక ఉద్య‌మ‌ స్ఫూర్తి తో ప‌ని చేస్తోంది. ఈ సంఘ‌ట‌న‌ల‌ కు ఏయే గిరిజన స‌మాజాలు వేదిక అయ్యాయో ఆ రాష్ట్రాలు 1857 పోరాటాని కి అందించిన వాటా ను స‌మ‌గ్రం గా అధ్య‌య‌నం చేసి ఒక మ్యూజియమ్ మ‌నం ఏర్పాటు చేయవలసివుంది. మీకు అంద‌రికి సృజ‌నాత్మక శ‌క్తి ఉంది గ‌నుక ఈ ఆలోచ‌న‌ కు మీ స‌హాయం ఏమైనా ఉంటుందా అని నేను అడుగుతున్నాను. ఉదాహ‌ర‌ణ‌ కు వ‌ర్చువ‌ల్ మ్యూజియమ్ అనుకుందాం.. దానిని రూపొందించగలిగిన సామ‌ర్థ్యం మీకు ఉంది. ప‌రిశోధన ద్వారా ప్ర‌భుత్వం మీకు స‌హాయం అందిస్తుంది. ఒక యానిమేశన్ చిత్రం లేదా వ‌ర్చువ‌ల్ ప్రెజెంటేశన్ ద్వారా మ‌నం దాని ని త‌యారు చేసే విష‌యాన్ని ఆలోచించ‌ వ‌చ్చును. రాబోయే త‌రాల‌ కు అది ఎంతో స‌హాయ‌కారి గా ఉంటుంది. స‌మాజం లో క‌ల్లోలాన్ని సృష్టిస్తున్న న‌క్స‌ల్స్ కు వారి పూర్వీకులు దేశం కోసం చేసిన సేవ‌లు, వారు అందించిన వాటా ను గురించి తెలియ‌చేసిన‌ట్ట‌యితే వారు దౌర్జ‌న్యకర పంథా ను వీడి స‌రి అయిన బాట‌ లో ప్ర‌వేశిస్తార‌న్న‌ది నా విశ్వాసం.

నేను నాటక రంగాన్ని గురించి కూడా కొంత చెప్పాలనుకుంటున్నాను. మీలో చాలా మంది కి జీవితం లో ఏదో ఒక సమయం లో నాటక రంగం తో అనుబంధం ఉందని నాకు తెలుసు. భారతదేశం లో నాటకం శక్తివంతమైన సాంప్రదాయం. శకుంతల (నాటకం) రోజుల నుండి ఈ రోజు వరకు మనకు ఎన్నో ప్రాచీన ప్రతులు ఉన్నాయి. వాటిలో ప్రపంచాని కి చెప్పడానికి ఎంతో ఉంది. నాటక రంగాన్ని, చలనచిత్ర రంగాన్ని వేరు చేయగలమని నేను భావించడంలేదు. ఆ రెండిటి ని సంఘటితం చేసి నాటక రంగం చరిత్ర ను ప్రేక్షకుల కు, ప్రపంచాని కి తెలియచేయాలి. కళా ప్రపంచాని కి చేయగల పెద్ద సేవ అదే. రానున్న తరాలు కూడా దాని నుండి ప్రయోజనాన్ని పొందుతాయి. మన దేశం లో భిన్న భాషల్లో భిన్న నాటక ప్రక్రియ లు ప్రముఖం గా ఉన్నాయి. అందుకే నాటకాన్ని, చలనచిత్రాన్ని వేరు చేసి చూడకూడదన్నది నా అభిప్రాయం.

సరికొత్త సాంకేతిక విజ్ఞ‌ానం సహాయం తో మీరు చేయగల కృషి చేస్తే నాటక రంగం కూడా శక్తివంతం అవుతుంది. తాజా ప్రతిభ కు కొత్త అవకాశాల ను కల్పించగలుగుతుంది.

మిత్రులారా,

ప్రజాస్వామ్యం లో ఏ ప్రభుత్వం అయినా అన్ని పనులూ తాను ఒంటరి గానే చేయగలనని ఆలోచిస్తుంది. కానీ ప్రభుత్వం తప్పు గా ఆలోచిస్తోందని, మిమ్మల్ని వెర్రివాళ్ల ను చేస్తోందని నేను అంటాను. ప్రతి ఒక్కరి అభివృద్ధి కి ప్రభుత్వాని కి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం.

ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం లో, దేశాని కి తన బాధ్యతల ను తెలియచేయడంలో, దేశం లో చైతన్యం నింపడం లో భారతీయ చిత్ర పరిశ్రమ చేసిన కృషి ని అభినందిస్తూ నేను అభివాదం చేస్తున్నాను. మీరంతా దేశాని కి ఎంతో సేవ చేశారు. ఆ క్షణాన్ని వేడుకగా

జరుపుకొనేందుకు మనందరమూ ఇక్కడ కు వచ్చాము. అందులో నేనూ భాగస్వామిని అయ్యాను.

ఇలా చేయండి అంటూ మీకు సలహా ఇచ్చే హక్కు ఎవరి కి కూడా లేదు. ఈ రంగం లో సలహా అయినా సరే, వాక్ స్వాతంత్ర్యాని కి భంగకరమే. అయినప్పటి కి అవసరాన్ని మించి కాస్తంత ఎక్కువ చెప్పి ఉంటే నన్ను క్షమించండని కోరుతున్నాను. మీరందరూ ముందుకు రండి.. దేశం కోసం కలసి పని చేద్దాము. బలం తో ముందుకు సాగుదాం అని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ పరిశ్రమ కు ఎంతో ప్రాధాన్యం ఉంది. 100 సంవత్సరాల కఠోర శ్రమ కారణం గా ఈ పరిశ్రమ దేశాని కి ఎంతో విలువైంది. ప్రపంచం అంతా మిమ్మల్ని అనుసరిస్తోంది. ప్రపంచాని కి చాటి చెప్పి, ప్రభావితం చేసి స్ఫూర్తి ని నింపవలసిన బాధ్యత మన మీద ఉంది. మన దేశాన్ని మరింత గా కనిపించేలా చేయడానికి మనందరం కలిసి అడుగులు వేద్దాము.

ఈ ఒక్క ఆశ తో మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.

**