పిఎంఇండియా
‘‘2019 వ సంవత్సరపు లోక్ సభ కు సాధారణ ఎన్నికల ను నిర్వహించడం కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని 14వ సెక్షన్ కు చెందిన 2వ సబ్- సెక్షన్ పరిధి లో చట్టబద్ధ నోటిఫికేశన్ లను జారీ చేయడం కోసం’’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇది భారత ఎన్నికల సంఘం తన ప్రోసీడింగ్స్ లో సిఫారసు చేసిన తేదీ లలో లోక్ సభ యొక్క సభ్యుల ను ఎన్నుకోవడం కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల కు పిలుపునిచ్చేందుకు ఉద్దేశించినటువంటిది.
ప్రభావం:
నోటిఫికేశన్ లను జారీ చేయడం ద్వారా, 17వ లోక్ సభ యొక్క కూర్పు కు ఎన్నికల ప్రక్రియ ఆరంభమవుతుంది.
*****