పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ తొలి సమావేశం 17 వ లోక్‌సభ సమావేశాలు 2019 జూన్ 17 వ తేదీ సోమవారం నాడు ప్రారంభించేందుకు అలాగే, ప్రభుత్వ కార్యకలాపాల అవసరతకు లోబడి సభా కార్యకలాపాలను 2019 జూలై 26 వ తేదీకి ముగించేందుకు ఆమోదం తెలిపింది.
రాజ్యసభ సమావేశాలు 2019 జూన్ 20 నుంచి ప్రారంభించి , ప్రభుత్వ అవసరతకు లోబడి 2019 జూలై 26 వ తేదీన ముగించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
స్పీకర్ ఎన్నిక 2019 జూన్ 19న జరుగుతుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 87(1) ప్రకారం, 2019 జూన్20 వ తేదీ ఉదయం 11 గంటలకు, పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను 2019 జూలై 5 వ తేదీ ఉదయం 11 గంటలకు లోక్ సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమర్పణ అనంతరం ఆయా సభలు ఆరోజు వాయిదా పడతాయి.