పిఎంఇండియా
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. స్ఫూర్తిదాయకమైన అనేక సంఘటనలను నవంబర్ నెల తెచ్చిపెట్టింది. కొన్ని రోజుల కిందట – నవంబర్ 26వ తేదీన ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా సెంట్రల్ హాల్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్త కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 25వ తేదీన అయోధ్యలోని రామాలయంలో ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. అదే రోజున కురుక్షేత్రంలోని జ్యోతిసర్‌లో పాంచజన్య స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు.
మిత్రులారా! ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ MRO- మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్- సౌకర్యాన్ని కొద్ది రోజుల క్రితం నేను హైదరాబాద్‌లో ప్రారంభించాను. భారతదేశం విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునఃపరిశీలన రంగంలో ఈ ప్రధాన అడుగు వేసింది. గత వారం ముంబాయిలో జరిగిన ఒక వేడుకలో INS ‘మాహే’ను భారత నౌకాదళంలోకి చేర్చారు. గత వారమే భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇది భారతదేశ నవీన ఆలోచన, ఆవిష్కరణ, యువ శక్తికి ప్రతిబింబంగా నిలిచింది.
మిత్రులారా! దేశం వ్యవసాయ రంగంలో కూడా ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. భారతదేశం 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. మూడు వందల యాభై ఏడు మిలియన్ టన్నులు! 10 సంవత్సరాల కిందటితో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు పెరిగింది. క్రీడా ప్రపంచంలో కూడా భారతదేశం తనదైన ముద్ర వేసింది. భారతదేశం కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కొద్దిరోజుల కిందటే ప్రకటించారు. ఈ విజయాలు దేశానికి, దేశప్రజలకు చెందినవి. ప్రజలు సాధించిన ఇలాంటి విజయాలను, ప్రజల సామూహిక ప్రయత్నాలను ప్రజలకు అందించడానికి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఒక అద్భుతమైన వేదిక.
మిత్రులారా! మనస్సులో అంకితభావం; సామూహిక శక్తిపై, బృంద కృషిపై విశ్వాసం; పడిపోయిన తర్వాత తిరిగి లేచే సాహసం ఉంటే అత్యంత కష్టతరమైన పనులలో కూడా విజయం తప్పనిసరిగా లభిస్తుంది. ఉపగ్రహాలు, GPS వ్యవస్థ, నావిగేషన్ సౌకర్యాలు లేని కాలాన్ని ఊహించుకోండి. అప్పుడు కూడా మన నావికులు పెద్ద ఓడల్లో ప్రయాణించి నిర్ణీత ప్రదేశాలకు చేరుకునేవారు. ఇప్పుడు సముద్రం దాటి కదులుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అంతరిక్షంలోని అనంతమైన ఎత్తులను అధిరోహిస్తున్నాయి. అక్కడ కూడా సవాలు అదే. GPS వ్యవస్థ లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థలు లేవు. కాబట్టి మనం ఎలా ముందుకు వెళ్ళగలం?
మిత్రులారా! సోషల్ మీడియాలో ఒక వీడియో కొన్ని రోజుల కిందట నా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఇస్రో నిర్వహించిన ఒక ప్రత్యేకమైన డ్రోన్ పోటీకి సంబంధించింది. ఈ వీడియోలో మన దేశ యువత- ముఖ్యంగా మన Gen-Z- అంగారక గ్రహ వాతావరణంలో డ్రోన్‌లను ఎగరవేయడానికి ప్రయత్నిస్తోంది. డ్రోన్‌లు ఎగురుతాయి. కొన్ని క్షణాలు సమతుల్యంగా ఉంటాయి. అకస్మాత్తుగా నేలపై పడతాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ ఎగురుతున్న డ్రోన్‌లకు GPS సహకారం లేదు. అంగారక గ్రహంపై GPS సాధ్యం కాదు. కాబట్టి డ్రోన్‌లు ఎటువంటి బాహ్య సంకేతాలను లేదా మార్గదర్శకత్వాన్ని స్వీకరించలేవు. డ్రోన్‌లు వాటి కెమెరాలు, అంతర్నిర్మిత సాఫ్ట్‌వేర్ సహాయంతో ఎగరవలసి వచ్చింది. ఆ చిన్న డ్రోన్ నేల నమూనాలను గుర్తించాలి. ఎత్తును కొలవాలి. అడ్డంకులను అర్థం చేసుకోవాలి. సురక్షితమైన ల్యాండింగ్ మార్గాన్ని కనుగొనాలి. అందువల్ల డ్రోన్‌లు ఒకదాని తర్వాత ఒకటి పడిపోయేవి. మిత్రులారా! పూణే నుండి వచ్చిన యువకుల బృందం ఈ పోటీలో కొంతమేరకు విజయాన్ని సాధించింది. వారి డ్రోన్ కూడా చాలాసార్లు పడిపోయి కూలిపోయింది. కానీ వారు వదిలిపెట్టలేదు. అనేక ప్రయత్నాల తర్వాత ఈ బృందం డ్రోన్ అంగారక గ్రహ వాతావరణంలో కొంతసేపటివరకు ఎగరగలిగింది.
మిత్రులారా! ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు మరొక దృశ్యం గుర్తుకు వచ్చింది. చంద్రయాన్-2 సంబంధం తెగిపోయిన రోజది. ఆ రోజు యావద్దేశం నిరాశ పొందింది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు కొద్దిక్షణాలు నిరాశకు లోనయ్యారు. కానీ, మిత్రులారా! వైఫల్యం వారిని ఆపలేదు. ఆ రోజే వారు చంద్రయాన్-3 విజయగాథ రాయడం ప్రారంభించారు. అందుకే చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయినప్పుడు అది కేవలం ఒక మిషన్ విజయంగా మాత్రమే భావించలేదు. వైఫల్యాన్ని అధిగమించిన తర్వాత నిర్మితమైన ఆత్మవిశ్వాస విజయమది. ఈ వీడియోలో కనిపించే యువకుల కళ్ళలో నేను అదే మెరుపును చూశాను. మన యువత అంకితభావం, మన శాస్త్రవేత్తల నిబద్ధతను చూసిన ప్రతిసారీ నా హృదయం ఉత్సాహభరితమవుతుంది. యువతరం చూపే ఈ అంకితభావం వికసిత భారతదేశానికి గొప్ప బలం.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరందరూ తేనె మాధుర్యాన్ని ఆస్వాదించే ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న కృషిని, సంప్రదాయాలను, ప్రకృతితో అందమైన సామరస్యాన్ని మనం గ్రహించలేం.
మిత్రులారా! జమ్మూ కాశ్మీర్‌లోని కొండ ప్రాంతాలలో తేనెటీగలు సులాయి అని కూడా పేర్కొనే అడవి తులసి నుండి ఒక ప్రత్యేకమైన తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ తెల్లరంగు తేనెను రాంబన్ సులాయి తేనె అని పిలుస్తారు. రాంబన్ సులాయి తేనె కొన్ని సంవత్సరాల కిందట జీఐ ట్యాగ్‌ను పొందింది. అప్పటి నుండి ఈ తేనె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
మిత్రులారా! దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో వృక్షసంపదను తేనె ఉత్పత్తికి అద్భుతమైన వనరుగా పరిగణిస్తారు. అక్కడ ‘గ్రామజన్య’ అనే రైతు సంస్థ ఈ సహజసంపదకు కొత్త దిశానిర్దేశం చేస్తోంది. ‘గ్రామజన్య’ ఒక ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్‌ను నిర్మించింది. ప్రయోగశాల, బాటిలింగ్, నిల్వ, డిజిటల్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలను అనుసంధానించింది. ఇప్పుడు ఈ తేనెను ఒక బ్రాండెడ్ ఉత్పత్తిగా రూపొందిస్తున్నారు. వివిధ గ్రామాలకు, నగరాలకు రవాణా చేస్తున్నారు. రెండున్నర వేలకు పైగా రైతులు ఈ ప్రయత్నం నుండి ప్రయోజనం పొందారు.
మిత్రులారా! కర్ణాటకలోని తుమ్ కూరు జిల్లాలో ‘శివగంగా కాలంజియా’ అనే సంస్థ చేసిన కృషి కూడా ప్రశంసనీయం. ఈ సంస్థలో చేరిన ప్రతి సభ్యునికి ప్రారంభంలో రెండు తేనెటీగల పెట్టెలు ఇస్తారు. ఇలా చేయడం ద్వారా సంస్థ చాలా మంది రైతులను తమ లక్ష్యంతో అనుసంధానించింది. ఈ సంస్థకు చెందిన రైతులు సామూహికంగా తేనెను సంగ్రహించి, అందంగా ప్యాక్ చేసి, స్థానిక మార్కెట్‌కు అందజేస్తారు. దీని ద్వారా వారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక ఉదాహరణ నాగాలాండ్‌లోని క్లిఫ్ హనీ హంటింగ్- కొండ తేనె వేట. నాగాలాండ్‌లోని చోక్లాంగన్ గ్రామంలోని ఖియామని-యాంగన్ ఆదివాసీ తెగకు చెందినవారు శతాబ్దాలుగా తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ తేనెటీగలు చెట్లపై కాకుండా ఎత్తైన కొండలపై తమ గూళ్ళను నిర్మిస్తాయి. అందువల్ల తేనె సేకరణ కూడా చాలా ప్రమాదకరం. అందువల్ల ఇక్కడి ప్రజలు మొదట తేనెటీగలను పలకరిస్తారు. వాటి అనుమతి తీసుకుంటారు. తాము తేనెను సేకరించడానికి వచ్చినట్టు వాటికి తెలియజేస్తారు. ఆ తర్వాత మాత్రమే వారు తేనెను సేకరిస్తారు.
మిత్రులారా! నేడు భారతదేశం తేనె ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 11 సంవత్సరాల కిందట దేశంలో తేనె ఉత్పత్తి 76 వేల మెట్రిక్ టన్నులు. ఇప్పుడు అది ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలలో తేనె ఎగుమతులు కూడా మూడు రెట్లు పెరిగాయి. హనీ మిషన్ కార్యక్రమం కింద ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థ 2 లక్షల 25 వేలకు పైగా తేనెటీగల పెట్టెలను ప్రజలకు పంపిణీ చేసింది. ఇది వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలను అందించింది. దీని అర్థం దేశంలోని వివిధ ప్రాంతాలలో తేనె మాధుర్యం కూడా పెరుగుతోంది. ఈ తీపి రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతోంది.
నా ప్రియమైన దేశవాసులారా! మహాభారత యుద్ధం హర్యానాలోని కురుక్షేత్రంలో జరిగిందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అక్కడి మహాభారత అనుభవ కేంద్రంలో ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. మహాభారత గాథను ఈ అనుభవ కేంద్రంలో 3D, లైట్ అండ్ సౌండ్ షో, డిజిటల్ టెక్నిక్‌ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. నవంబర్ 25వ తేదీన నేను కురుక్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఈ అనుభవ కేంద్ర అనుభవం నాలో ఆనందాన్ని నింపింది.
మిత్రులారా! కురుక్షేత్రలోని బ్రహ్మ సరోవర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవానికి హాజరు కావడం కూడా నాకు చాలా విశేషమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దైవిక గ్రంథమైన గీత ద్వారా ఎలా ప్రేరణ పొందుతున్నారో చూసి నేను చాలా స్ఫూర్తి పొందాను. ఈ ఉత్సవంలో యూరప్, మధ్య ఆసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు పాల్గొన్నారు.
ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియాలో మొదటిసారిగా గీతను బహిరంగ వేదికపై ప్రదర్శించారు. ఐరోపాలోని లాత్వియాలో కూడా చిరస్మరణీయమైన గీతా మహోత్సవం జరిగింది. లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, అల్జీరియా ప్రాంతాల కళాకారులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మిత్రులారా! భారతదేశ మహోన్నత సంస్కృతిలో శాంతి, కరుణ అత్యంత ముఖ్యమైనవి. ప్రతిచోటా విధ్వంసంతో కూడిన భయంకరమైన వాతావరణం నెలకొన్న రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఊహించుకోండి. అటువంటి క్లిష్ట సమయాల్లో గుజరాత్‌లోని నవానగర్‌కు చెందిన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ గారు చేసిన గొప్ప పని ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆ సమయంలో జామ్ సాహెబ్ ఎటువంటి వ్యూహాత్మక కూటమి, యుద్ధ వ్యూహాల గురించి ఆలోచించలేదు. బదులుగా, ప్రపంచ యుద్ధంలో పోలాండుకు చెందిన యూదు పిల్లలను ఎలా రక్షించారనేది ఆయన ఆలోచన. ఆయన గుజరాత్‌లో వేలాది మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నేటికీ ఇది ఒక ఉదాహరణ. కొన్ని రోజుల కిందట దక్షిణ ఇజ్రాయెల్‌లోని మోశావ్ నెవాతిమ్‌లో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా విశేషమైన గౌరవం. పోలాండ్‌లోని వార్సాలో ఉన్న జామ్ సాహెబ్ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించే అదృష్టం గత ఏడాది నాకు లభించింది. ఆ క్షణం నాకు మరపురానిది.
నా ప్రియమైన దేశ ప్రజలారా! సహజ వ్యవసాయంపై జరిగిన ఒక భారీ సమ్మేళనంలో పాల్గొనడానికి కొన్ని రోజుల కిందట నేను కోయంబత్తూర్‌కు వెళ్ళాను. దక్షిణ భారతదేశంలో సహజ వ్యవసాయం విషయంలో జరుగుతున్న ప్రయత్నాలను చూసి నేను చాలా ప్రేరణ పొందాను. అధిక అర్హతలు కలిగిన చాలా మంది యువనిపుణులు ఇప్పుడు సహజ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. నేను అక్కడి రైతులతో మాట్లాడి వారి అనుభవాల గురించి తెలుసుకున్నాను. సహజ వ్యవసాయం భారతదేశ ప్రాచీన సంప్రదాయాలలో భాగం. మాతృ భూమిని రక్షించడానికి దాన్ని నిరంతరం ప్రోత్సహించడం మన కర్తవ్యం.
మిత్రులారా! ప్రపంచంలోని పురాతన భాష, ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒక నగరం- ఈ రెండింటి సంగమం ఎల్లప్పుడూ అద్భుతం. నేను ‘కాశీ- తమిళ సంగమం’ గురించి మాట్లాడుతున్నాను. నాలుగవ కాశీ-తమిళ సంగమం డిసెంబర్ 2వ తేదీన కాశీలోని నమో ఘాట్‌లో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం కాశీ-తమిళ సంగమం థీమ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ థీమ్ ‘తమిళం నేర్చుకోండి – తమిళ కరకలం’. తమిళ భాషను ప్రేమించే వారందరికీ కాశీ-తమిళ సంగమం ఒక ముఖ్యమైన వేదికగా మారింది. నేను కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడల్లా తాము కాశీ-తమిళ సంగమంలో భాగం కావడాన్ని ఆనందిస్తామని వారు ఎప్పుడూ చెప్తారు. ఈ సంగమం వారికి కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈసారి కూడా కాశీ ప్రజలు తమిళనాడు నుండి వచ్చిన తమ సోదర సోదరీమణులను ఎంతో ఉత్సాహంగా స్వాగతించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాశీ-తమిళ సంగమంలో భాగం కావాలని మీ అందరినీ నేను కోరుతున్నాను. అలాగే ‘ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని బలోపేతం చేసే ఇతర వేదికలను పరిగణించండి. ఇక్కడ నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను:
తమిళ కళాచ్చారమ్ ఉయర్వానద్
తమిళ మోళి ఉయర్వానద్
తమిళ ఇందియావిన్ పెరుమిదం
Tamil culture is great.
Tamil language is great.
Tamil is the pride of India
తమిళ సంస్కృతి గొప్పది.
తమిళ భాష గొప్పది.
తమిళం భారతదేశానికి గర్వకారణం
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశ భద్రతా వ్యవస్థ బలోపేతం అయినప్పుడు ప్రతి భారతీయుడు గర్విస్తాడు. ముంబాయిలో ఐ.ఎన్.ఎస్. మాహేను గత వారం భారత నౌకాదళంలో చేర్చారు. దాని స్వదేశీ రూపకల్పనకు కొందరు చాలా ఆకర్షితులయ్యారు. అదే సమయంలో పుదుచ్చేరి- మలబార్ తీరప్రాంత ప్రజలు దాని పేరు విని ఆనందించారు. వాస్తవానికి దీనికి ‘మాహే’ అనే పేరును గొప్ప చారిత్రక వారసత్వం ఉన్న ‘మాహే’ నుండి తీసుకున్నారు. ఈ యుద్ధనౌక శిఖరం ‘కలరిపయట్టు’ యుద్ధక్రీడలో ఉపయోగించే ఉరుమి అనే సాంప్రదాయిక, సౌకర్యవంతమైన ఖడ్గాన్ని పోలి ఉందని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని చాలా మంది గుర్తించారు. మన నౌకాదళం వేగంగా స్వావలంబన వైపు కదులుతుండటం మనందరికీ గర్వకారణం. డిసెంబర్ 4వ తేదీన మనం నౌకాదళ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. ఈ సందర్భం మన సైనికుల అజేయమైన ధైర్యసాహస పరాక్రమాలను గౌరవించే ప్రత్యేక రోజు.
మిత్రులారా! నౌకాదళ సంబంధిత పర్యాటకంలో ఆసక్తి ఉన్నవారికి కొత్త విషయాలు తెలుసుకునే ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. దేశంలోని పశ్చిమ తీరంలో గుజరాత్‌లోని సోమనాథ్ సమీపంలో దీవ్ జిల్లా ఉంది. దీవ్ లో INS ఖుఖ్రీకి గుర్తుగా ఏర్పాటు చేసిన ఖుఖ్రీ స్మారక చిహ్నం, మ్యూజియం ఉన్నాయి. ఆసియాలోనే ఒక ప్రత్యేకమైన మ్యూజియం అయిన నావల్ ఏవియేషన్ మ్యూజియం గోవాలో ఉంది. ఫోర్ట్ కొచ్చిలోని INS ద్రోణాచార్య వద్ద ఇండియన్ నావల్ మారిటైమ్ మ్యూజియం ఉంది. మన దేశ సముద్ర చరిత్రను, భారత నౌకాదళ పరిణామ క్రమాన్ని ఇక్కడ చూడవచ్చు. గతంలో పోర్ట్ బ్లెయిర్ గా పిలిచిన శ్రీవిజయపురంలోని ‘సముద్రికా- నావల్ మెరైన్ మ్యూజియం’ ఈ ప్రాంత గొప్ప చరిత్ర ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది. కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్‌లో ఉన్న వార్ షిప్ మ్యూజియంలో క్షిపణులు, ఆయుధాల ప్రతిరూపాలు ఉన్నాయి. విశాఖపట్నంలో భారత నౌకాదళానికి సంబంధించిన జలాంతర్గామి, హెలికాప్టర్, విమానాల మ్యూజియం కూడా ఉంది. మీరందరూ- ముఖ్యంగా సైనిక చరిత్రపై ఆసక్తి ఉన్నవారు- ఈ మ్యూజియాలను సందర్శించాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! శీతాకాలం వచ్చింది. శీతాకాల పర్యాటకానికి కూడా సీజన్ వచ్చింది. అనేక దేశాలు శీతాకాల పర్యాటకాన్ని తమ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా చేసుకున్నాయి. అనేక దేశాలలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన శీతాకాల పండుగలు, శీతాకాలపు క్రీడా నమూనాలున్నాయి. ఈ దేశాలు స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో ట్రెక్కింగ్, ఐస్ క్లైంబింగ్, ఫ్యామిలీ స్నో పార్కులు వంటి అనుభవాలను తమ గుర్తింపుగా చేసుకున్నాయి. వారు తమ శీతాకాల ఉత్సవాలను ప్రపంచ ఆకర్షణలుగా కూడా మార్చుకున్నారు.
మిత్రులారా! మన దేశంలో శీతాకాల పర్యాటకానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు పర్వతాలున్నాయి. సంస్కృతి ఉంది. అంతులేని సాహస అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకం చాలా మందిని ఆకర్షిస్తుండడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఔలి, మన్ స్యారీ, చోప్టా, డెయారా వంటి ప్రదేశాలు శీతాకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పిథోరాగఢ్ జిల్లాలో పద్నాలుగున్నర వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆది కైలాష్‌లో రాష్ట్రంలోని మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్ మారథాన్ కొన్ని వారాల కిందట జరిగింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి 750 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల పొడవైన ‘ఆది కైలాష్ పరిక్రమ రన్’ ఉదయం 5 గంటలకు తీవ్రమైన చలిలో ప్రారంభమైంది. చలి బాగా ఉన్నప్పటికీ ప్రజల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. మూడు సంవత్సరాల కిందటి వరకు రెండు వేల కంటే తక్కువ మంది పర్యాటకులు ఆది కైలాష్‌ను సందర్శించేవారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య ముప్పై వేలకు పైగా పెరిగింది.
మిత్రులారా! శీతాకాలపు క్రీడలు కూడా కొన్ని వారాల్లో ఉత్తరాఖండ్‌లో జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు, సాహస ప్రియులు, క్రీడా ఔత్సాహికులు ఈ కార్యక్రమం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. స్కీయింగ్, స్నోబోర్డింగ్ మొదలైన వివిధ మంచు ఆధారిత క్రీడలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరాఖండ్ అనుసంధానం, మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించింది. హోమ్‌స్టేలకు సంబంధించి కొత్త విధానాన్ని కూడా రూపొందించారు.
మిత్రులారా! ‘వెడ్ ఇన్ ఇండియా- భారతదేశంలో వివాహం’ ప్రచారం కూడా శీతాకాలంలో కోలాహలాలకు కారణమవుతుంది. శీతాకాలపు బంగారు సూర్యుడి వల్లో లేదా పర్వతాల నుండి దిగుతున్న పొగమంచు దుప్పట్ల వల్లో పర్వతాలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ప్రాచుర్యం పొందుతున్నాయి. ముఖ్యంగా గంగా నది ఒడ్డున ఇప్పుడు చాలా వివాహాలు జరుగుతున్నాయి.
మిత్రులారా! ఈ శీతాకాల నెలల్లో హిమాలయ లోయలు జీవితాంతం వెంటాడే అనుభవాలుగా మారతాయి. మీరు ఈ శీతాకాలంలో ఒక యాత్రను ప్లాన్ చేస్తుంటే, ఖచ్చితంగా హిమాలయ లోయలను పరిగణనలోకి తీసుకోండి.
మిత్రులారా! నేను కొన్ని వారాల కిందట భూటాన్‌ను సందర్శించాను. ఇటువంటి పర్యటనలు విభిన్నమైన పరస్పర సంభాషణలు, చర్చలకు అవకాశాలను అందిస్తాయి. నా సందర్శన సమయంలో నేను భూటాన్ రాజును కలిశాను. గతంలో రాజుగా ఉన్న ప్రస్తుత రాజు తండ్రిని, ప్రధాన మంత్రిని, ఇతరులను కలిశాను. ఈ సందర్భంగా అందరి నుండీ ఒకే మాట వినవచ్చింది. భగవాన్ బుద్ధుడి పవిత్ర అవశేషాలను అక్కడికి పంపినందుకు ప్రతి ఒక్కరూ భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది విన్నప్పుడల్లా నా హృదయం గర్వంతో ఉప్పొంగింది.
మిత్రులారా! బుద్ధుని పవిత్ర అవశేషాల పట్ల ఇలాంటి ఉత్సాహం అనేక ఇతర దేశాలలో కనిపించింది. గత నెలలోనే ఈ పవిత్ర అవశేషాలను నేషనల్ మ్యూజియం నుండి రష్యాలోని కల్మీకియాకు తీసుకెళ్లారు. అక్కడ బౌద్ధమతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రష్యాలోని సుదూర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని చూడటానికి వచ్చారని నాకు తెలిసింది. ఈ పవిత్ర అవశేషాలను మంగోలియా, వియత్నాం, థాయిలాండ్‌లకు కూడా తీసుకెళ్లారు. ప్రతిచోటా ప్రజల ఉత్సాహం ఉప్పొంగింది. ఈ పవిత్ర అవశేషాల దర్శనానికి థాయిలాండ్ రాజు కూడా వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని పవిత్ర అవశేషాలతో ఇంత గాఢమైన సంబంధాన్ని చూడటం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అనుసంధానించడానికి ఇటువంటి చొరవ ఒక మాధ్యమంగా ఎలా మారుతుందో చూడటం ఆనందంగా ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా! మీరందరూ ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రాన్ని పాటించాలని నేను ఎప్పుడూ కోరుతున్నాను. కొన్ని రోజుల కిందట జి-20 శిఖరాగ్ర సమావేశంలో అనేక మంది ప్రపంచ నాయకులకు బహుమతులు అందించే విషయానికి వస్తే ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించాలని నేను మరోసారి చెప్పాను. మన దేశప్రజల తరఫున ప్రపంచ నాయకులకు బహుమతులు అందించేటప్పుడు ఈ భావనను దృష్టిలో ఉంచుకున్నాను. జి-20 సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి నేను నటరాజ కాంస్య విగ్రహాన్ని బహూకరించాను. తమిళనాడులోని తంజావూరు సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉన్న చోళుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. కెనడా ప్రధానమంత్రికి వెండి గుర్రం ప్రతిరూపాన్ని అందజేశాను. ఇది రాజస్థాన్‌లోని ఉదయపూర్ అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. జపాన్ ప్రధానమంత్రికి వెండి బుద్ధ ప్రతిరూపాన్ని బహూకరించాను. ఇది తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇటలీ ప్రధానమంత్రికి పూల ఆకృతులతో కూడిన వెండి అద్దం బహుమతిగా ఇచ్చాను. అది కరీంనగర్ సాంప్రదాయిక లోహ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. కేరళలోని మన్నార్ లో రూపొందించిన అద్భుతమైన కళా నైపుణ్యం ఉండే ఇత్తడి శిల్పాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి నేను బహూకరించాను. భారతీయ చేతిపనులు, కళలు, సంప్రదాయాల గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడం; మన చేతివృత్తులవారి ప్రతిభకు ప్రపంచ వేదికను అందించడం నా లక్ష్యం.
మిత్రులారా! దేశంలోని లక్షలాది మంది ప్రజలు ‘వోకల్ ఫర్ లోకల్’ అనే స్ఫూర్తిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం మీరు పండుగ షాపింగ్ కోసం మార్కెట్‌కు వెళ్ళినప్పుడు మీరు ఒక విషయం గమనించి ఉండవచ్చు. ప్రజల ఇష్టాలు, వారి ఇళ్లలోకి తీసుకువచ్చిన వస్తువులు దేశం స్వదేశీభావనవైపు తిరిగి వస్తున్నట్లు స్పష్టంగా సూచించాయి. ప్రజలు ఇష్టపూర్వకంగా భారతీయ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. చిన్న చిన్న దుకాణదారులు కూడా ఈ మార్పును అనుభవించారు. ఈసారి యువత కూడా ‘వోకల్ ఫర్ లోకల్’ అనే స్ఫూర్తిని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరానికి షాపింగ్‌లో కొత్త దశ ప్రారంభం అవుతుంది. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తాను. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రాన్ని గుర్తుంచుకోండి. దేశంలో తయారు చేసిన వాటిని మాత్రమే కొనండి. దేశప్రజలు కష్టపడి తయారుచేసిన వాటిని మాత్రమే అమ్మండి.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ నెల భారతీయ క్రీడల పరంగా సూపర్ హిట్ అయింది. భారత మహిళా జట్టు ఐ.సి.సి. మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంతో ఈ నెల ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా మైదానంలో మరికొన్ని కార్యక్రమాలు జరిగాయి. కొన్ని రోజుల కిందట టోక్యోలో డెఫ్ ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ భారతదేశం 20 పతకాలు సాధించి, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కబడ్డీ ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా మన మహిళా క్రీడాకారులు కూడా చరిత్ర సృష్టించారు. టోర్నమెంటులో వారి అత్యుత్తమ ప్రదర్శన ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుంది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో కూడా మన క్రీడాకారులు అద్భుతంగా ప్రదర్శన కనబరిచారు. అక్కడ వారు 20 పతకాలు సాధించారు.
మిత్రులారా! ఇంకా ఎక్కువగా చర్చల్లోకి వచ్చిన విషయం మన మహిళా జట్టు అంధ క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మన జట్టు ఈ టోర్నమెంట్‌ను గెలుచుకోవడం విశేషం. ఈ జట్టులోని ప్రతి క్రీడాకారిణి పట్ల దేశప్రజలు చాలా గర్వంగా ఉన్నారు. నేను ఈ జట్టును ప్రధానమంత్రి నివాసంలో కలిశాను. వాస్తవానికి ఈ జట్టు ధైర్యం, అభిరుచి మనకు చాలా నేర్పుతాయి. ఈ విజయం మన క్రీడా చరిత్రలో గొప్ప విజయాలలో ఒకటి. ఇది ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
మిత్రులారా! ఈ రోజుల్లో మన దేశంలో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ కొత్త క్రీడా సంస్కృతి వేగంగా ఉద్భవిస్తోంది. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటే నా ఉద్దేశ్యం మీ పరిమితులను పరీక్షించే క్రీడా కార్యకలాపాలు. కొన్ని సంవత్సరాల కిందటి వరకు మారథాన్, బైక్‌థాన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతి నెలా 1500 కి పైగా ఎండ్యూరెన్స్ క్రీడలు జరుగుతున్నట్టు నాకు తెలిసింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అథ్లెట్లు చాలా దూరం ప్రయాణిస్తారు.
మిత్రులారా! ఎండ్యూరెన్స్ క్రీడలకు ఒక ఉదాహరణ ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్. సముద్రంలో 4 కిలోమీటర్లు ఈత కొట్టడం, 180 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం, దాదాపు 42 కిలోమీటర్ల మారథాన్ లో పరుగెత్తడం- ఈ మూడు పనులను మీకున్న ఒక రోజు కంటే తక్కువ సమయంలో చేయాలని మీకు చెబితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఉక్కు ధైర్యం ఉన్న వ్యక్తులు ఈ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అందుకే దీన్ని ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్ అని పిలుస్తారు.
ఇటీవల గోవాలో ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఈ రోజుల్లో ప్రజలు ఇటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మన యువ స్నేహితుల బృందాలలో చాలా ప్రజాదరణ పొందుతున్న అనేక ఇతర పోటీలు ఉన్నాయి. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి చాలా మంది కలిసి వస్తున్నారు. ఇవన్నీ ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడానికి మార్గాలు.
మిత్రులారా! ప్రతి నెలా మిమ్మల్ని కలవడం నాకు ఎల్లప్పుడూ కొత్త అనుభవం. మీ గాథలు, మీ ప్రయత్నాలు నాకు కొత్తగా స్ఫూర్తినిస్తాయి. మీరు మీ సందేశాలలో పంపే సూచనలు, అనుభవాలు భారతదేశ వైవిధ్యాన్ని ఈ కార్యక్రమంలో చేర్చడానికి మమ్మల్ని ప్రేరేపిస్తాయి. వచ్చే నెలలో మనం కలిసే సమయానికి 2025 చివర్లోకి వస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాలలో చలి తీవ్రమవుతుంది. శీతాకాలంలో మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. వచ్చే నెలలో మనం ఖచ్చితంగా కొన్ని కొత్త విషయాలు, కొత్త వ్యక్తిత్వాలపై చర్చిస్తాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
*****
#MannKiBaat has begun. Do hear. https://t.co/0Wp9vjJWUm
— PMO India (@PMOIndia) November 30, 2025
The month of November brought many inspirations. #MannKiBaat pic.twitter.com/Ml3tYfgBhj
— PMO India (@PMOIndia) November 30, 2025
India has set a historic record with food grain production. #MannKiBaat pic.twitter.com/yiRNFMMvBb
— PMO India (@PMOIndia) November 30, 2025
PM @narendramodi highlights how a team of youngsters from Pune succeeded in a unique drone competition organised by ISRO. #MannKiBaat pic.twitter.com/fH0I4PtPFG
— PMO India (@PMOIndia) November 30, 2025
A sweet revolution across India! #MannKiBaat pic.twitter.com/jeYbz2UHdA
— PMO India (@PMOIndia) November 30, 2025
From Europe to Saudi Arabia, PM @narendramodi shares how the world is celebrating the Gita. #MannKiBaat pic.twitter.com/YCDMLt4s76
— PMO India (@PMOIndia) November 30, 2025
The incredible contributions of Jam Saheb that the world is honouring today... #MannKiBaat pic.twitter.com/KbUxibRiRW
— PMO India (@PMOIndia) November 30, 2025
Glad to see that many young, highly qualified professionals are now adopting the field of natural farming, says PM @narendramodi in #MannKiBaat pic.twitter.com/aVa0mB7dzI
— PMO India (@PMOIndia) November 30, 2025
The fourth Kashi-Tamil Sangamam is commencing on the 2nd December at Namo Ghat in Kashi.
— PMO India (@PMOIndia) November 30, 2025
PM @narendramodi urges everyone to be a part of the Kashi-Tamil Sangamam. #MannKiBaat pic.twitter.com/Mrk4BsjnVE
INS Mahe has been inducted into the Indian Navy. Its indigenous design is drawing wide appreciation. #MannKiBaat pic.twitter.com/9lYxib1hUj
— PMO India (@PMOIndia) November 30, 2025
Winter tourism in Uttarakhand is attracting many people. #MannKiBaat pic.twitter.com/uOhMd1qgHM
— PMO India (@PMOIndia) November 30, 2025
Enthusiasm for the sacred relics of Bhagwan Buddha has been observed in many countries. World over, people expressed gratitude to India for sending Buddhist relics. #MannKiBaat pic.twitter.com/0t0MpWvwtl
— PMO India (@PMOIndia) November 30, 2025
Vocal for Local! #MannKiBaat pic.twitter.com/qau8x27hgi
— PMO India (@PMOIndia) November 30, 2025
India's superhit sports month! #MannKiBaat pic.twitter.com/5EzYrg0GkF
— PMO India (@PMOIndia) November 30, 2025
The month of November has been one of many occasions which will make 140 crore Indians proud, some of which are:
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Dharma Dhwajarohan Utsav in Ayodhya.
150th birth anniversary celebrations of Bhagwan Birsa Munda.
150 years of Vande Mataram.
India moved closer to being a global… pic.twitter.com/QDL0LahcSU
India’s Gen Z is doing wonders when it comes to tech and innovation. Highlighted an effort which showcases our youth’s passion towards drones.#MannKiBaat pic.twitter.com/xlfIHyvCa3
— Narendra Modi (@narendramodi) November 30, 2025
From Jammu and Kashmir to Karnataka and Nagaland, India’s farmers are achieving remarkable success in honey production. Also appreciated KVIC for their efforts in this sector. #MannKiBaat pic.twitter.com/14JhzVd1bt
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Gita Mahotsavs in Saudi Arabia and Latvia are noteworthy efforts, which deepen cultural connect with the Indian diaspora and those passionate about Indian culture and spirituality.#MannKiBaat pic.twitter.com/JIwGa4tSSM
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Talked about a special gesture in Israel which paid tributes to Jam Saheb Digvijaysinhji for his humanitarian spirit.#MannKiBaat pic.twitter.com/r2XTsx1PQt
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Kashi looks forward to hosting the Kashi Tamil Sangamam!#MannKiBaat pic.twitter.com/ZdszXjdZUy
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Come, wed in India!#MannKiBaat pic.twitter.com/sCz2VhLS2M
— Narendra Modi (@narendramodi) November 30, 2025
Buddhist relics from India have received a very special welcome in Bhutan, Thailand, Russia, Mongolia and other nations indicating how the thoughts of Lord Buddha connect us and inspire us.#MannKiBaat pic.twitter.com/OWrfVRCff1
— Narendra Modi (@narendramodi) November 30, 2025
ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದಿಂದ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ನಾಗಾಲ್ಯಾಂಡ್ ವರೆಗೆ, ಭಾರತದ ರೈತರು ಜೇನು ಉತ್ಪಾದನೆಯಲ್ಲಿ ಉತ್ತಮ ಯಶಸ್ಸನ್ನು ಕಾಣುತ್ತಿದ್ದಾರೆ. ಈ ವಲಯದಲ್ಲಿ ಕೆವಿಐಸಿಯ ಪ್ರಯತ್ನಗಳನ್ನೂ ಶ್ಲಾಘಿಸಿಲಾಯಿತು. #MannKiBaat pic.twitter.com/ywG30BAxZS
— Narendra Modi (@narendramodi) November 30, 2025
காசி தமிழ் சங்கமத்தை நடத்துவதற்கு, காசி நகரம் ஆவலுடன் எதிர்நோக்கியுள்ளது!#MannKiBaat pic.twitter.com/S2jJ2qknnr
— Narendra Modi (@narendramodi) November 30, 2025
उत्तराखंड में ‘आदि कैलाश परिक्रमा रन’ के बाद अब यहां लोगों में Winter Games को लेकर भारी उत्साह है। राज्य में Winter Tourism को बढ़ावा देने के लिए जिस तरह से कनेक्टिविटी और इंफ्रास्ट्रक्चर पर फोकस किया गया है, वो पूरे देश को प्रेरित करने वाला है।#MannKiBaat pic.twitter.com/tbO3ThOyZe
— Narendra Modi (@narendramodi) November 30, 2025
यह देखकर बहुत संतोष होता है कि आज ‘Vocal for Local’ की भावना को देश के करोड़ों लोगों ने अपने जीवन का हिस्सा बना लिया है। मैंने भी दक्षिण अफ्रीका में हुए G-20 शिखर सम्मेलन के दौरान देशवासियों की ओर से विश्व के नेताओं को जो उपहार भेंट किए, उनमें इसी भावना का ध्यान रखा है।… pic.twitter.com/VdvFY8O2rM
— Narendra Modi (@narendramodi) November 30, 2025