పిఎంఇండియా
2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్, చికిత తానిపర్తిలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేస్తూ ఈ ఘనతను సాధించడం.. వారి విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మన ఆర్చర్ల అద్భుత ఘనతగా ఈ విజయాన్ని అభివర్ణించిన శ్రీ మోదీ.. జట్టు మొత్తానికీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“భారత్‌కు మరో బంగారు పతకం!
2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ టీం విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన జ్యోతి సురేఖ వెన్నం, ప్రీతిక ప్రదీప్, చికిత తానిపర్తిలకు అభినందనలు. అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును సమం చేసిన వారి విజయం మరింత ప్రత్యేకమైనది. మన విలుకారులకు అద్భుత విజయమిది. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. భారత జట్టుకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి @narendramodi”
A Gold for India!
— PMO India (@PMOIndia) September 30, 2026
Congratulations to Jyothi Surekha Vennam, Prithika Pradeep and Chikitha Taniparthi on winning the Gold Medal in the Women’s Compound Team event at the Asian Games 2026. This is even more special because their performance also equalled the World Record. This is…