ఐచి – నగోయాలో ప్రారంభమైన 2026 ఆసియా పారా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
భారత పారా అథ్లెట్ల పట్టుదల, అంకితభావం, అజేయ స్ఫూర్తి 140 కోట్ల మంది భారతీయులకు ప్రేరణనిస్తున్నాయని, వారి పట్ల దేశం ఎంతో గర్విస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
“ ఐచి – నగోయాలో ప్రారంభమైన 2026 ఆసియా పారా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన పారా అథ్లెట్ల పట్ల భారతదేశం ఎంతో గర్విస్తోంది. వారి పట్టుదల, అంకితభావం, అజేయ స్ఫూర్తి 140 కోట్ల మంది భారతీయులకు ప్రేరణనిస్తున్నాయి. క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పోటీపడి తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
***
As the Asian Para Games 2026 begin in Aichi-Nagoya, conveying my best wishes to the Indian contingent. India is immensely proud of our phenomenal para-athletes. Their grit, dedication and indomitable spirit inspire 140 crore Indians. May they compete with confidence and give their very best.
— Narendra Modi (@narendramodi) October 18, 2026