Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన అనాహత్ సింగ్‌ను అభినందించిన ప్రధాని


2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం నమోదవటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుగోల్డ్ మెడల్ గెలుచుకొని వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన తొలి భారతీయ స్క్వాష్ క్రీడాకారిణిగా నిలిచిన అనాహత్ సింగ్‌ను ఆయన అభినందించారుఈ విజయం.. యువతలో స్క్వాష్ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తెస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

2026 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం!

స్వర్ణ పతకం సాధించి వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా నిలిచిన అనాహత్ సింగ్ కు అభినందనలు… ఈ విజయం యువతలో స్క్వాష్ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తెస్తుంది.”

 

***