పిఎంఇండియా
ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు. ప్రజా జీవితంలో ప్రధాని శ్రీ మోదీ పూర్తి చేసుకున్న 25 సంవత్సరాల ప్రస్థానం, నేటి అవసరాలను తీర్చేందుకు సేవ, భవిష్యత్తు ఆకాంక్షల నెరవేర్చేందుకు సంకల్పానికి కట్టుబడి ఉండటాన్ని ప్రతిబింబిస్తుందని ఈవ్యాసం తెలియజేస్తుంది.
ఢిల్లీ పాలనకు సంబంధించిన పాలనాంశాలను ప్రస్తావిస్తూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి చెందిన ఢిల్లీని నిర్మించడమే తమ లక్ష్యమని శ్రీమతి రేఖా గుప్తా పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 జాతీయ లక్ష్య సాధనలో ఢిల్లీ తన వంతు సహకారం అందించేలా చేయడమే తమ ధ్యేయమని తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ప్రజా జీవితంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం.. నేటి అవసరాలకు సేవ, రేపటి ఆకాంక్షల సాధనకు సంకల్పం అనే అంశాలను ప్రతిబింబిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా తన వ్యాసంలో పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుని వరకు చేర్చడం నుంచి విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాలను మెరుగుపరచడం వరకు ఢిల్లీ పాలనకు సంబంధించిన పానాపరమైన అంశాలను ఆమె ప్రస్తావించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక భాగంగా వికసిత్ ఢిల్లీని నిర్మించడమే లక్ష్యం’’
****
PM @narendramodi's 25 years in public life bring together Seva for today's needs and Sankalp for tomorrow's aspirations, writes Delhi CM Smt. @gupta_rekha. She draws lessons for Delhi's governance, from reaching the last mile with welfare schemes to improving education, healthcare and skills. The goal is to build Viksit Delhi as a key part of Viksit Bharat 2047.
— PMO India (@PMOIndia) October 9, 2026