Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

50 కేజీల‌ రెజ్లింగ్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న వినేశ్ ఫోగాట్ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండోనేశియా లోని జ‌కార్తా- పాలెంబంగ్ లో జ‌రుగుతున్న 18వ‌ ఏశియ‌న్ గేమ్స్- 2018 లో 50 కేజీల మల్లయుద్ధం పోటీ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను వినేశ్ ఫోగాట్ కు అభినంద‌న‌లు తెలియజేశారు.

“మ‌రొక ఆటల పోటీలు, మ‌రొక ప‌త‌కం!  వినేశ్ ఫోగాట్ గారు సాధించిన విజ‌యం తో భార‌త‌దేశం సంతోషిస్తోంది.  ఏశియ‌న్ గేమ్స్- 2018 లో 50 కేజీల మల్లయుద్ధం పోటీ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు ఆమె కు ఇవే అభినంద‌న‌లు.  వినేశ్ గారు మరో మారు సాధించినటువంటి ఈ విజ‌యం రానున్న క్రీడాకారుల‌కు త‌ప్ప‌క ప్రేరణ ను అందించగలుగుతుంది” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.