పిఎంఇండియా
హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ తో తన సంభాషణలను ఆయన గుర్తుచేసుకొంటూ, స్వామీజీ తనకు మార్గదర్శకుడు అని, సంఘానికి ఆయన చేసిన సేవలు ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకొనేవే అన్నారు.
రేపు ఉదయం ఎర్ర కోట మీది నుండి ప్రసంగించిన తరువాత ప్రధాన మంత్రి గుజరాత్ లోని సారంగ్ పూర్ కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కు కడపటి నమస్కారములు సమర్పిస్తారు.
“ హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ కరుణ, వినమ్రత మూర్తీభవించిన మనుషులలో ప్రముఖుడు. సమాజానికి ఆయన అందించిన సేవ సదా స్మరణీయం.
హెచ్ హెచ్ ప్రముఖ్ స్వామి మహరాజ్ నాకు మార్గదర్శకుడు. ఆయనతో జరిపిన సంభాషణలను నేనెన్నటికీ మరచిపోలేను. ఆయన లేని లోటు తీరనిది ” అని ప్రధాన మంత్రి అన్నారు.
After his address from the Red Fort tomorrow morning, PM will go to Sarangpur, Gujarat to pay his last respects to HH Pramukh Swami Maharaj.
— PMO India (@PMOIndia) August 14, 2016