Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ ను అభినందించిన ప్రధానమంత్రి


పిఎస్ ఎల్ వి-35 ను మరియు ఉన్నత వాతావరణ ఉపగ్రహం స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని, ఇంకా మరొక 7 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ (ఇస్రో) ను, ఆ సంస్థ శాస్త్రవేత్తలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి తమ సందేశంలో “ఇది భారతదేశానికి అత్యంత ఉల్లాసపూర్వకమైన మరియు గర్వకారకమైన క్షణం. పిఎస్ ఎల్ వి- సి35/ఎస్ సిఎటిఎస్ఎటి -1 మరియు ఇంకొక 7 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో కు అభినందనలు.

మన అంతరిక్ష శాస్త్రవేత్తలు చరిత్రను లిఖిస్తూనే ఉంటారు. వారి నవోన్మేష ఉత్సాహం 125 కోట్ల మంది భారతీయులకు మరియు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని ఆర్జించిపెట్టింది” అని పేర్కొన్నారు.

***