ముప్ఫై రెండు వేల కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము లో ఈ రోజు న ప్రారంభించి, వాటి ని దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు ఆరోగ్యం, విద్య, రహదారులు, రైలు మార్గాలు, విమానయానం, పెట్రోలియమ్ మరియు పౌర ప్రయోజనాలు ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన రంగం తో పాటు అనేక ఇతర రంగాల కు సంబంధించినవి. జమ్ము, కశ్మీర్ లో క్రొత్త గా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసుకొన్న సుమారు 1500 మంది వ్యక్తుల కు నియామక ఉత్తర్వుల ను ప్రధాన మంత్రి అందజేశారు. ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్ము’ కార్యక్రమం లో భాగం గా వేరు వేరు ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.
కిశ్త్ వాడ్ జిల్లా కు చెందిన వీణా దేవి గారు తాను ఉజ్జ్వల యోజన యొక్క ప్రయోజనాల ను అందుకొన్నట్లు, దానితో తన జీవనం మెరుగు పడినట్లు ప్రధాన మంత్రి కి తెలియ జేశారు. ప్రస్తుతం తాను తన కుటుంబం కోసం మరియు స్వయం గా తన కోసం కాలాన్ని కేటాయించేందుకు వీలు చిక్కిందని ఆమె అన్నారు. ఇదివరకు వంట చేయడం కోసం అడవి లోకి వెళ్ళి వంట చెరకును తెచ్చుకొనేదాన్ని అని ఆమె తెలిపారు. తమ కుటుంబ సభ్యుల కు ఆయుష్మాన్ కార్డులు ఉన్నాయని ఆమె ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చి, ఈ కార్డుల జారీ కి గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వీణా దేవి గారు మరియు ఆమె కుటుంబ సభ్యులు చక్కని ఆరోగ్యం తో ఉండాలి అని ఆకాంక్షించారు.
రాష్ట్రీయ ఆజీవిక అభియాన్ లబ్ధిదారుల లో ఒకరైన కఠువా నివాసి కీర్తి శర్మ గారు ప్రధాన మంత్రి తో మాట్లాడుతూ, ఒక స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) తో అనుబంధం కలిగి ఉన్నప్పడు ఒనగూరే ప్రయోజనాల ను గురించి తెలియ జేశారు. ఆమె 30,000 రూపాయల రుణం తో తన వ్యాపార సంస్థ ను ప్రారంభించారు. ఒక లక్ష రూపాయల రెండో రుణాన్ని కూడా ఆమె స్వీకరించి, ఆ సొమ్ము తో మూడు గోవుల ను సమకూర్చుకొన్నట్లు వివరించారు. ఒక్క తమ స్వయం సహాయ సమూహమే కాకుండా జిల్లా అంతటా మహిళ లు వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడగలుగుతారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆమె సభ్యురాలు గా ఉన్న సమూహం బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించివేసింది; ప్రస్తుతం వారి వద్ద 10 గోవులు ఉన్నాయి. ఆమె మరియు ఆమె గ్రూపు సభ్యులు అనేక ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి ని కూడా పొందారు. మూడు కోట్ల మంది లఖ్పతి దీదీ ల (లక్షాధికారి సోదరీమణుల)ను సిద్ధం చేయాలి అనే లక్ష్యం తో ప్రధాన మంత్రి చేపట్టిన ఈ ప్రాజెక్టు కు తమ పూర్తి సహకారాన్ని అందిస్తాం అంటూ ఆమె హామీ ని ఇచ్చారు.
పూంచ్ ప్రాంత రైతు శ్రీ లాల్ మొహమ్మద్ ప్రధాన మంత్రి తో మాట్లాడుతూ, తాను ఒక సరిహద్దు ప్రాంత నివాసి ని అని పరిచయం చేసుకొన్నారు. తన కు ఒక చిన్న మట్టితో కట్టిన ఇల్లు ఉండేదని, సరిహద్దు కు అవతలి వైపు నుండి ఇంటి మీదకు తుపాకి గుండ్లు దూసుకు వస్తూ ఉండేవన్నారు. పక్కా ఇంటి ని కట్టుకోవడం కోసం పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా 1,30,000 రూపాయలు అందాయని, ప్రస్తుతం తాను ఆ విధం గా కట్టుకొన్న ఇంట్లో తలదాచుకొంటున్నానని శ్రీ లాల్ మొహమ్మద్ ప్రధాన మంత్రి కి చెప్తూ, ఆయన కు తన ధన్యవాదాల ను తెలియ జేశారు. ప్రభుత్వం యొక్క పథకాలు దేశం లో సుదూర ప్రాంతాల కు చేరుకొంటూ ఉండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ లాల్ మొహమ్మద్ కు పక్కా ఇల్లు సమకూరినందుకు అభినందనల ను తెలియ జేశారు. శ్రీ లాల్ మొహమ్మద్ తన వంతు గా ప్రధాన మంత్రి ని ప్రశంసిస్తూ, ‘వికసిత్ భారత్’ ఇతివృత్తం ప్రధానం గా సాగిన ఒక రెండు పంక్తుల ను వినిపించారు.
బాందీపురా కు చెందిన శహీనా బేగం గారు ఒక స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) లో సభ్యురాలు. ప్రధాన మంత్రి తో ఆమె మాట్లాడుతూ, సమాజ శాస్త్రం లో తాను స్నాతకోత్తర పట్టా ను సాధించినప్పటికీ నిరుద్యోగం కారణం గా ఎన్నో ఇబ్బందుల ను ఎదుర్కోక తప్పలేదు అంటూ వివరించారు. 2018వ సంవత్సరం లో ఆమె స్వయం సహాయ సమూహం లో చేరారు. తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం ఆమె రుణాన్ని స్వీకరించారు. ఆ తరువాత నేశనల్ రూరల్ లైవ్లీహుడ్ మిశన్ యొక్క సహాయాన్ని అందుకొని, ఆ వ్యాపారాన్ని మరింత గా విస్తరించారు. దీనితో ఆమె తాను ఎంచుకొన్న రంగం లో గుర్తింపు ను తెచ్చుకొని, ఒక లఖ్పతి దీదీ (లక్షాధికారి సోదరీమణి)గా ఎదిగారు. ప్రధాన మంత్రి ఆమె కు అభినందనల ను తెలియ జేసి, మారుమూల గ్రామాల లో ఉండే మహిళ లు లఖ్పతి దీదీ లు గా మారేందుకు వారికి లభిస్తున్న అవకాశాల ను సంతోషం తో అందుకొంటున్నారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శహీనా బేగం గారు ప్రేరణ ను పొందారు అని ఆయన అన్నారు. ఆమె తిరిగి మాట్లాడుతూ, కోళ్ళ పెంపకం వ్యాపారం కోసం కిసాన్ క్రెడిట్ కార్డు తాలూకు ప్రయోజనాల ను వినియోగించుకొన్నట్లు వెల్లడించారు. ఆమె ను స్నాతకోత్తర స్థాయి వరకు చదివించిన ఆమె తల్లితండ్రుల ను ప్రధాన మంత్రి కొనియాడారు. శహీనా బేగం లో శ్రమ పట్ల గల సమర్పణ భావం ప్రశంసనీయం అని కూడా ఆయన అన్నారు. మహిళ లు వారు కన్న కలల ను నెరవేర్చుకోవడం తో పాటు సాధికారిత దిశ లో పయనించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘మోదీ యొక్క హయాం లో ప్రతిదీ సాధ్యమే.’’ అన్నారు.
జల్ జీవన్ మిశన్ లబ్ధిదారుల లో పుల్వామా కు చెందిన శ్రీ రియాజ్ అహమద్ కోలీ ఒకరు. ప్రధాన మంత్రి తో ఆయన మాట్లాడుతూ, తమ పల్లె లో ప్రతి ఒక్క ఇంటి కి నల్లా నీరు అందుతోందని, ఇది తన కుటుంబ సభ్యుల జీవనం లో ఒక పెనుమార్పు ను తీసుకు వచ్చిందన్నారు. తమ గ్రామం లోని మహిళ ల ఆశీర్వాదాల ను ఆయన ప్రధాన మంత్రి కి తెలియ జేశారు. 370వ అధికరణం రద్దు అయిన తరువాత ఆయన ఆయనకు ఉన్న భూమి యొక్క హక్కుల ను చేజిక్కించుకొన్నారు. దీని తో ఆయనతో పాటు ఆయన కు చెందిన ఆదివాసి సముదాయం లోని ఇతర సభ్యులు కూడా ఎంతగానో లాభపడ్డారు. ప్రధాన మంత్రి ఒక రాజకీయ కార్యకర్త గా తాను ఉన్న రోజుల ను తలచుకొంటూ గుజ్జర్ సముదాయం అందించినటువంటి ఆతిధ్యం పట్ల ప్రశంస ను వ్యక్తం చేశారు.
సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జమ్ము కు ఇదివరకు తాను వచ్చిన సందర్బాల తో పోలిస్తే ఈ రోజు న ప్రజలు ప్రతికూల వాతావరణ స్థితి లో సైతం ఉత్సాహం గా పెద్ద సంఖ్యల లో తరలి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద తెర ల మీద చూడడం కోసం మూడు వేరు వేరు సభా ప్రాంగణాల వద్ద జమ్ము పౌరులు భారీ సంఖ్యల లో గుమికూడారు అని కూడా ఆయన తెలియ జేశారు. జమ్ము, కశ్మీర్ ప్రజల లోని ఉత్సాహాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమాన్ని ఒక దీవెన అని అభివర్ణించారు. ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమం వికసిత్ భారత్ కే పరిమితం కాదు, మరి దీనిలో దేశవ్యాప్తం గా వేరు వేరు విద్య సంస్థల కు చెందిన వారు లక్షల సంఖ్య లో పాలుపంచుకొంటున్నారు అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమాన్ని జమ్ము, కశ్మీర్ లో ఉన్న 285 బ్లాకుల లోని పౌరులు చూస్తున్నారని, ఆయన చెప్తూ, ఈ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ప్రజల లో వ్యక్తం అవుతున్న ఉత్సాహాన్ని ఆయన మెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి తనతో సంభాషించిన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల వల్ల సమకూరుతున్న లాభాల ను గురించి వారి భావాల ను సూటి గాను, స్పష్టం గాను వ్యక్తం చేసిన తీరు ను ప్రశంసించారు. వికసిత్ భారత్ వికసిత్ జమ్ము, కశ్మీర్ మరియు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లంటే జమ్ము, కశ్మీర్ ప్రజల లో వ్యక్తం అవుతున్నటువంటి భావన కు గాను ప్రధాన మంత్రి వారికి అభినందనల ను తెలియ జేశారు. ప్రతి లబ్ధిదారు యొక్క ఇంటి ముంగిట కు చేరుకోవాలి అనేదే ప్రభుత్వం యొక్క నిబద్ధత అని ఆయన పునరుద్ఘాటించారు. అర్హత ఉన్న లబ్ధిదారుల ను ఎవ్వరి ని అయినా వదలి వేసే ప్రసక్తే లేదు అంటూ ఆయన హామీ ని ఇచ్చారు. ‘‘మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మనం వికసిత్ జమ్ము, కశ్మీర్ ను ఆవిష్కరించి తీరుతాం. 70 సంవత్సరాలు గా నెరవేరని కలల ను మోదీ త్వరలోనే నెరవేర్చుతాడు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
A remarkable day for Jammu and Kashmir! Launching initiatives which will propel holistic development in the region. https://t.co/21BA1DaHcz
— Narendra Modi (@narendramodi) February 20, 2024
हम विकसित जम्मू-कश्मीर बनाकर ही रहेंगे: PM @narendramodi pic.twitter.com/YQULR9rOpL
— PMO India (@PMOIndia) February 20, 2024
विकसित भारत, विकसित जम्मू-कश्मीर pic.twitter.com/UH8uOqpM0V
— PMO India (@PMOIndia) February 20, 2024
नया भारत, अपनी वर्तमान पीढ़ी को आधुनिक शिक्षा देने के लिए ज्यादा से ज्यादा खर्च कर रहा है: PM @narendramodi pic.twitter.com/mhZXQ9rERU
— PMO India (@PMOIndia) February 20, 2024
अब जम्मू कश्मीर, एक संतुलित विकास की ओर बढ़ रहा है। pic.twitter.com/nCW6TZbz9I
— PMO India (@PMOIndia) February 20, 2024
भारत के संविधान में जिस सामाजिक न्याय का भरोसा दिया गया है, वो भरोसा पहली बार जम्मू-कश्मीर के सामान्य जन को भी मिला है: PM @narendramodi pic.twitter.com/QXhKvYI5me
— PMO India (@PMOIndia) February 20, 2024
विकसित होते जम्मू कश्मीर को लेकर आज पूरी दुनिया में बहुत उत्साह है: PM @narendramodi pic.twitter.com/OjMnVd10wc
— PMO India (@PMOIndia) February 20, 2024