Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2014లో 248 కిలోమీటర్లుగా ఉన్న భారత మెట్రో రైలు నెట్‌వర్క్‌ ప్రస్తుతం దాదాపు 1,200 కి.మీ.కు విస్తరించిందన్న ప్రధానమంత్రి


భారత్‌లో మెట్రో రైలు వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో దేశంలో కేవలం అయిదు నగరాల్లో 248 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో మార్గాలు ఉండగా.. ప్రస్తుతం 26 నగరాల్లో దాదాపు 1,200 కిలోమీటర్లకు విస్తరించాయని ప్రధాని తెలిపారు.

 

ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ విస్తరణ వల్ల ట్రాఫిక్‌లో గడిపే సమయం తగ్గడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించడం, ఉత్పాదకత పెరగడం, మెరుగైన అవకాశాలు అందుబాటులోకి రావడం సాధ్యమవుతుందని అన్నారు.

 

పట్టణ భారతదేశం కోసం ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న మార్పు ఇదేనని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు. 

 

‘‘నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. 

 

2014కు ముందు ఉన్న వేగంతోనే దేశంలో మెట్రో వ్యవస్థ విస్తరణ కొనసాగి ఉంటే, పుణె వంటి నగరాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతకాలం వేచి ఉండాల్సి వచ్చేది?

 

సంవత్సరాలా… కాదు… బహుశా దశాబ్దాలే పట్టేవి.

 

అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

 

2014లో దేశంలోని అయిదు నగరాల్లో కేవలం 248 కిలోమీటర్ల మేర మాత్రమే మెట్రో మార్గాలు ఉండేవి.

 

నేడు 26 నగరాల్లో దాదాపు 1,200 కిలోమీటర్ల మేర మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉంది.
 

ప్రతిరోజూ కోటి మందికి పైగా ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు.

ట్రాఫిక్‌లో తక్కువ సమయం గడపడం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, ఉత్పాదకత పెరగడం, మెరుగైన అవకాశాలు లభించడం వంటివి దీని ఫలితాలు.
 

దీని ప్రభావం కేవలం గణాంకాలు, సంఖ్యలకే పరిమితం కాదు’’