పిఎంఇండియా
భారత సైనిక బలగాలు చూపిన వాస్తవాలను విశ్వసించకుండా, పాకిస్థాన్ వ్యాప్తి చేస్తున్న తప్పుడు కథనాలను పదేపదే ప్రచారం చేస్తున్నవారిని ఆయన తీవ్రంగా విమర్శించారు. భారత్ ఎప్పుడూ దృఢమైన, స్పష్టమైన వైఖరినే కొనసాగిస్తూ వచ్చిందని ఆయన పునరుద్ఘాటించారు.
గతంలో భారతదేశం నిర్వహించిన లక్ష్య నిర్దేశిత సైనిక చర్యలను ప్రస్తావిస్తూ, వాటిలో చూపిన వ్యూహాత్మక స్పష్టత, అమలు తీరును ప్రధాని ప్రముఖంగా పేర్కొన్నారు. సర్జికల్ దాడుల సమయంలో భారతదేశం శత్రు దేశ భూభాగంలోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సూర్యోదయానికి ముందే విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. బాలాకోట్ వైమానిక దాడుల్లో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కింద, భారతదేశం మళ్ళీ స్పష్టమైన లక్ష్యంతో పనిచేసిందని, పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ప్రధాన కేంద్రాన్ని, వారి ప్రణాళిక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, నిధుల మూలాలు, ట్రాకింగ్, సాంకేతిక మద్దతు, ఆయుధ సరఫరా సహా మొత్తం మౌలిక సదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగిందని వివరించారు. “భారతదేశం చాలా కచ్చితంగా ఉగ్రవాదుల నాడి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని వారి కార్యకలాపాల మూలాన్ని నిర్వీర్యం చేసింది” అని ప్రధానమంత్రి అన్నారు.
“భారత దళాలు మరోసారి తమ లక్ష్యాలను 100% సాధించాయి, దేశ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ మైలురాళ్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించేవారిని విమర్శిస్తూ, వారిని దేశం బాగా గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు. మే 6 రాత్రి, మే 7 ఉదయం ఈ ఆపరేషన్ జరిగింది. మే 7 న సూర్యోదయం తరువాత భారత సైన్యం పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి మిషన్ పూర్తయినట్టు ప్రకటించిందని తెలిపారు. ఉగ్రవాద వ్యవస్థలను, వాటి సూత్రధారులను, వాటికి ఆయుధాలు, ఇతర అవసరాల చేరవేత మార్గాలను ధ్వంసం చేయాలనే భారతదేశ లక్ష్యాలు మొదటి రోజు నుంచే స్పష్టంగా ఉన్నాయని, ప్రణాళికాబద్ధంగా ఈ మిషన్ పూర్తయిందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ను ఉటంకిస్తూ, భారత సాయుధ దళాలు తమ విజయాన్ని నిమిషాల్లోనే పాకిస్థాన్ సైన్యానికి తెలియజేశాయని, తద్వారా భారత ఉద్దేశాలు, ఫలితాలు స్పష్టంగా అర్ధమయ్యేలా చేశాయని ప్రధానమంత్రి ధృఢంగా పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం వారి అవివేకాన్ని చూపుతోందని ఆయన పేర్కొన్నారు. వారు తెలివిగా వ్యవహరిస్తే, ఇంత ధైర్యంగా ఈ తప్పుడు నిర్ణయం తీసుకునేవారు కాదని చెప్పారు. భారత్ పూర్తిగా సిద్ధంగా ఉండి, సరైన సమయం కోసం ఎదురు చూసిందని, భారత్ పోరాటం ఒక దేశంతో కాదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే విధానమని ప్రధానమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదులకు మద్దతుగా యుద్ధరంగంలోకి ప్రవేశించాలని పాకిస్థాన్ నిర్ణయించడంతో భారత్ దీటుగా బదులిచ్చిందని చెప్పారు. మే 9 అర్ధరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు భారత క్షిపణులు పాక్ ఊహకు అందనంత తీవ్రతతో వారి లక్ష్యాలపై దాడి చేశాయని ప్రధాని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ కింద భారత్ తీసుకున్న నిర్ణయాత్మక చర్య పాకిస్థాన్ ను మోకరిల్లేలా చేసిందని ప్రధాని సభకు తెలిపారు. భారత్ చర్యకు ఆ దేశ ప్రజలు విస్తుపోయిన తీరు, వారి స్పందనలు టెలివిజన్లలో విస్తృతంగా కనిపించాయని ఆయన గుర్తు చేశారు. భారత్ స్పందనకు పాక్ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయిందంటే, దాని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజీఎంఓ) నేరుగా భారతదేశానికి ఫోన్ చేసి, దాడిని ఆపమని వేడుకున్నారని, ఇక దాడులను తాము తట్టుకోలేమని ఆయన అంగీకరించారని శ్రీ మోదీ తెలిపారు.
మే 7వ తేదీ ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో భారత్ తన లక్ష్యాలను సాధించిందని, పాక్ మరింత రెచ్చగొడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని స్పష్టం చేసిందని ఆయన పునరుద్ఘాటించారు. “భారత్ విధానం సరైన ఉద్దేశంతో, సక్రమమైన ఆలోచనతో, సాయుధ దళాల సమన్వయంతో రూపుదిద్దుకుంది. ఇది ఉగ్రవాదాన్ని, దాని నిర్వాహకులను, వారి స్థావరాలను నిర్మూలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. భారత్ చర్య ఉద్దేశం ఉద్రిక్తతలను పెంచడం ఎంతమాత్రం కాదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
భారత్ చర్యపై ఏ ప్రపంచ నాయకుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రధాని పేర్కొన్నారు. మే 9వ తేదీ రాత్రి భారత రక్షణ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశంలో ఉన్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు పలుమార్లు తనతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. సమావేశం అనంతరం తిరిగి కాల్ చేసినప్పుడు, పాక్ పెద్ద స్థాయిలో ఎదురుదాడి ప్రారంభించవచ్చన్న సమాచారం అందినట్టు ప్రధానమంత్రి తెలిపారు. దీనిపై తాను స్పందిస్తూ.. ‘పాక్ ఉద్దేశం అదే అయితే, వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, భారత్ మరింత బలంగా ప్రతీకారం తీర్చుకుంటుందని, తూటాలకు ఫిరంగులతో సమాధానం చెబుతామని” స్పష్టం చేసినట్టు తెలిపారు. మే 9వ తేదీ రాత్రి, మే 10వ తేదీ ఉదయం భారతదేశం శక్తిమంతంగా తిరిగి దాడి చేసి, పాక్ సైనిక మౌలిక సదుపాయాలను భారీ బలప్రయోగంతో ధ్వంసం చేసిందని ప్రధాని తెలిపారు. ఇక భారత్ నుంచి ప్రతి ప్రతిస్పందన మునుపటి కంటే బలంగా ఉంటుందని పాకిస్థానీలకు ఈపాటికి పూర్తిగా అర్థమై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. “పాకిస్థాన్ మళ్లీ ఏదైనా దుస్సాహసం చేస్తే అది తగిన, భయంకరమైన ప్రతీకారాన్ని ఎదుర్కొంటుంది. ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ చురుకుగా, దృఢంగా కొనసాగుతోంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.
“నేటి భారతదేశం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది స్వావలంబన స్ఫూర్తితో వేగంగా పురోగమిస్తోంది” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు, ఆత్మనిర్భరత దిశగా భారతదేశం ప్రయాణాన్ని ప్రజలు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో, విపక్షాలు తమ రాజకీయ విమర్శల కోసం పాకిస్థాన్ పై ఎక్కువగా ఆధారపడుతున్న దురదృష్టకరమైన ధోరణిని కూడా దేశం చూస్తోంది” అని ప్రధాని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 16 గంటల చర్చలో కూడా, విపక్షాలు పాక్ నుంచి సమస్యలను దిగుమతి చేసుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందని, ఇది చాలా విచారకరమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు.
యుద్ధాల స్వరూపం మారిపోతున్న నేపథ్యంలో – అవాస్తవ సమాచారం, కల్పిత కథనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారత సైనిక దళాల మనోబలాన్ని దెబ్బతీయడానికి, ప్రజల్లో అవిశ్వాసం కలిగించడానికి కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని హెచ్చరించారు. ప్రతిపక్షాలు, దాని మిత్రపక్షాలు పాక్ ప్రచారానికి ప్రతినిధులుగా మారి భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశ సైనిక విజయాలను ప్రశ్నించడానికి, తక్కువ చేయడానికి పదేపదే జరుగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, విజయవంతమైన సర్జికల్ దాడుల తరువాత, ప్రతిపక్ష నాయకులు సాయుధ దళాల నుంచి ఆధారాలు డిమాండ్ చేసిన విషయాన్ని శ్రీ మోదీ గుర్తు చేశారు. అయితే ప్రజల మనోభావాలు సైన్యానికి అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్ష నేతలు గళం మార్చి మూడు నుంచి పదిహేను వరకు భిన్నమైన సంఖ్యలను ఉటంకిస్తూ తాము కూడా సర్జికల్ దాడులు నిర్వహించినట్టు చెప్పుకున్నారని ప్రధాని పేర్కొన్నారు.
బాలాకోట్ విమాన దాడుల అనంతరం, విపక్షాలు ఆ ఆపరేషన్‌ను నేరుగా వ్యతిరేకించలేకపోయినా, ఫోటో ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయని ప్రధాన మంత్రి తెలిపారు. దాడి ఎక్కడ జరిగింది? ఏం ధ్వంసమయ్యింది? ఎంతమంది మృతిచెందారు? వంటి ప్రశ్నలను వారు పదే పదే అడిగారని, ఇవన్నీ పాక్ మాటల చాతుర్యాన్ని ప్రతిబింబించాయని ఆయన వ్యాఖ్యానించారు.
భారత వైమానిక దళం పైలట్ అభినందన్ ను పాకిస్థాన్ బంధించినప్పుడు ఆ దేశంలో సంబరాలు జరగడం సహజమే అనీ, అయితే భారత్‌లో కొందరు నిస్సిగ్గుగా అనుమానాలు వ్యక్తపరిచి – ప్రధాన మంత్రి సంకటంలో ఉన్నారని, అభినందన్ తిరిగి రాకపోవచ్చని చర్చ జరిపారని ఆయన అన్నారు. అభినందన్ భారత్ కు తిరిగి రావడం సాహసోపేత సంకల్పంతోనే సాధ్యమైందని, ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విమర్శకులంతా ఒక్కసారిగా మౌనం వహించారని ప్రధాని వ్యాఖ్యానించారు.
పహల్గామ్ దాడి తర్వాత ఒక బీఎస్ఎఫ్ జవానును పాకిస్థాన్ బందీగా తీసుకున్నప్పుడు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తమకు పెద్ద అవకాశం లభించినట్టు కొన్ని వర్గాలు భావించాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. సైనికుని భవితవ్యం, అతడి కుటుంబ పరిస్థితి, అతడు తిరిగి వచ్చే అవకాశం గురించి ఊహాజనిత ప్రశ్నలను లేవనెత్తుతూ సామాజిక మాధ్యమాల్లో అనేక కథనాలను వ్యాప్తి చేశారని విమర్శించారు. అయితే ఈ ప్రచారానికి భారత్ స్పష్టతతో హుందాగా స్పందించిందని, తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, ప్రతి సైనికుడిని రక్షించే తన నిబద్ధతను పునరుద్ఘాటించిందని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్ ఘటన తర్వాత పట్టుబడిన బీఎస్ఎఫ్ జవాను కూడా గౌరవంగా, హుందాగా తిరిగివచ్చారని ప్రధానమంత్రి తెలిపారు. ఇందుకు ఉగ్రవాదులు, వారిని నడిపించే శక్తులతో పాటు వారిని చూసి భారత్ లోని కొందరు వ్యక్తులు కూడా బాధపడినట్టు కనిపిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సర్జికల్ దాడుల సమయంలో కూడా రాజకీయ లాభాల కోసం కొన్ని ఆటలు ఆడే ప్రయత్నాలు జరిగాయని, కానీ అవి ప్రజల్లో ఎటువంటి ఆదరణ పొందలేక విఫలమయ్యాయని అన్నారు. వైమానిక దాడుల సమయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి కానీ అవి కూడా విఫలమయ్యాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు విమర్శకులు తమ వైఖరిని మార్చుకున్నారని, మొదట ఆపరేషన్ ను అంగీకరించడానికి నిరాకరించారని, ఆ తర్వాత ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారని వ్యతిరేకించే వారు ఎప్పుడూ అభ్యంతరం చెప్పడానికి ఒక సాకు వెతుక్కుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
సాయుధ దళాల పట్ల ప్రతిపక్షాలు చాలాకాలంగా ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తున్నాయని, ఇటీవల కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కూడా ప్రతిపక్షాలు విజయాన్ని జరుపుకోలేదని, దాని ప్రాముఖ్యతను గుర్తించలేదని ప్రధాని గుర్తు చేశారు. డోక్లాం ప్రతిష్ఠంభన సమయంలో భారత బలగాలు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే ప్రతిపక్ష నేతలు రహస్యంగా అనుమానాస్పద వర్గాల నుంచి వివరణలు కోరారనడానికీ చరిత్రే సాక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ కు ప్రతిపక్షాలు క్లీన్ చిట్ ఇచ్చినట్లు కనిపించడంపై ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రవాదులు పాక్ జాతీయులని రుజువు చేయాలంటూ ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్ ను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంలో పాకిస్థాన్ కూడా ఇదే డిమాండ్ చేయడం గమనార్హమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అలవాట్లు, అలాంటి ధైర్యంతో బాహ్య శక్తుల కథనాలను ప్రతిధ్వనించే ప్రవర్తన విపక్షాల్లో ఇప్పటికీ కొనసాగుతోందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈరోజు ప్రజల ముందు స్పష్టమైన సాక్ష్యాలు, వాస్తవాలు ఉన్నాయి. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు ఇంకా అనుమానాలు వ్యక్తపరచడం ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత స్పష్టమైన ఆధారాలు లభించకపోతే ఈ వ్యక్తులు ఇంకా ఎలా స్పందించేవారోనని, అప్పుడు వారి ప్రతిస్పందనలు మరింత తప్పుదోవ పట్టించేవిగా లేదా బాధ్యతారాహిత్యంగా ఉండేవని ఆయన అన్నారు.
ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు తప్పుడు కథనాలను సృష్టించిన పాకిస్థాన్.. వాటిని ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. ఆ మరుసటి రోజే తాను స్వయంగా ఆదంపూర్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలోనే అబద్ధాలను తేటతెల్లం చేశానని తెలిపారు. తప్పుడు నివేదికల వ్యాప్తిలో ఇకమీదట విజయం సాధించలేరనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
ప్రస్తుత ప్రతిపక్షం దేశాన్ని చాలా కాలం పాటు పరిపాలించిందన్న ఆయన.. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో వారికి పూర్తిగా తెలుసునని అన్నారు. అనుభవం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటనలను అంగీకరించేందుకు వారు ఎల్లప్పుడూ నిరాకరించటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన అయినా, విదేశాంగ మంత్రి పలుమార్లు స్పందించినా.. హోం, రక్షణ మంత్రులు ఇచ్చిన వివరణలు అయినా నమ్మేందుకు ప్రతిపక్షం నిరాకరిస్తోందని మోదీ విమర్శించారు. దశాబ్దాలుగా పాలించిన పార్టీకి దేశంలోని అధికారిక వ్యవస్థల విషయంలో ఇంత అపనమ్మకాన్ని ఎలా చూపించగలదని ప్రశ్నించారు. పాకిస్థాన్‌కు అనుగుణంగా మారుతోన్న వైఖరిని చూస్తుంటే ప్రతిపక్షం ఇప్పుడు ఆ దేశ రిమోట్ కంట్రోల్‌లో పనిచేస్తోందని ఎద్దేవా చేశారు.
తాము చెప్పదలచుకున్న వాటిని లిఖిత పూర్వకంగా యువనేతలకు ఇచ్చి, వారితో మాట్లాడించారని ప్రతిపక్షనేతను విమర్శించారు. అలాంటి నాయకులకు మాట్లాడే ధైర్యం లేదని అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న క్రూరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను “దృష్టిని మారల్చే ఒక చర్య”గా అభివర్ణించిన అలాంటి నాయకత్వాన్ని ఖండించారు. ఇది.. ఒక భయానక ఘటనకు సంబంధించిన చేదు జ్ఞాపకాల గాయాన్ని పెద్దది చేయటమే అవుతుందని, దీనినొక సిగ్గుచేటు చర్యగా అని అభివర్ణించారు.
పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులను మొన్న భద్రతా దళాలు మట్టుబెట్టాయని తెలిపిన మోదీ.. ఆపరేషన్ చేపట్టిన రోజు గురించి నవ్వు, ఎగతాళితో కూడిన ప్రశ్నలను లేవనెత్తటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని కోసం శ్రావణ మాసంలో పవిత్ర సోమవారం కావాలా! అని వ్యంగ్యంగా బదులిచ్చారు. ఈ వైఖరిని తీవ్ర నిరాశకు ప్రతిబింబంగా వర్ణించిన ఆయన.. ప్రతిపక్షాల దిగజారుడు పరిస్థితిని ఇది తెలియజేస్తోందని అన్నారు.
ఆయుధాలతో దేశం రక్షణలో ఉన్నప్పుడు జ్ఞాన అన్వేషణ, తాత్విక భావనలు వృద్ధి చెందుతాయన్న పురాతన గ్రంథాల్లోని భావనను ప్రధాని ప్రస్తావించారు. “సరిహద్దులో బలమైన సైన్యం ఉంటే ప్రజాస్వామ్యం శక్తిమంతంగా, సురక్షితంగా ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.
“గత దశాబ్దంలో సైన్యం సాధించిన సాధికారతకు ఆపరేషన్ సిందూర్ ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది” అని ఉద్ఘాటించారు. ఈ సామర్థ్యం ఆకస్మికంగా వచ్చింది కాదని, ఇది నిరంతరం దృష్టి సారించి చేసిన కృషి ఫలితమని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పటి పరిస్థితికి.. ఇది పూర్తి వ్యతిరేకంగా ఉందని.. వారి హయాంలో రక్షణ రంగంలో స్వావలంబన అనే విషయాన్ని పరిగణించలేదని విమర్శించారు. నేటికీ గాంధీ ఆలోచనలతో ముడిపడి ఉన్న “స్వావలంబన” అనే భావనను కూడా వారు అపహాస్యం చేస్తున్నారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీల పాలనలో ప్రతి రక్షణ ఒప్పందం వ్యక్తిగత లాభం కోసం ఉన్న ఒక అవకాశంగా మారిందని పేర్కొన్న ఆయన.. చిన్న పరికరాల కోసం కూడా విదేశాలపై ఆధాపడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రాత్రి సమయంలో చూసేందుకు ఉపయోగించే కెమెరాలు లేకపోవడం వంటి లోపాలను ఈ సందర్భంగా ఎత్తిచూపారు. జీపులు మొదలుకొని బోఫోర్స్, హెలికాప్టర్ల వరకు రక్షణకు సంబంధించిన ప్రతి కొనుగోలు చుట్టు కుంభకోణాలు ఉండేవని విమర్శించారు. ఆధునిక ఆయుధాల కోసం భారత రక్షణ దళాలు దశాబ్దాలుగా వేచి ఉండాల్సి వచ్చిందని ప్రధానంగా పేర్కొన్నారు. చరిత్ర చూసుకుంటే రక్షణ తయారీలో భారత్ అగ్రగామిగా ఉందన్న విషయాన్ని సభకు తెలియజేశారు. కత్తులతో యుద్దాలు చేసే కాలంలో కూడా భారత ఆయుధాలను ఉన్నతమైనవిగా పరిగణించేవారని తెలిపారు. బలంగా ఉన్న భారత రక్షణ రంగ తయారీ వ్యవస్థను స్వాతంత్ర్యం అనంతరం ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచి, ఒక క్రమపద్ధతిలో నాశనం చేశారన్నారు.
పరిశోధన, తయారీకి ఉన్న మార్గాలు సంవత్సరాలుగా మూసేసి ఉన్నాయని, అదే విధానాలు కొనసాగి ఉంటే ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కనీసం ఊహించలేకపోయేదని అన్నారు. ఆ పరిస్థితులే ఉంటే ఆయుధాలు, యుద్ధ పరికరాలు, మందుగుండు సామగ్రిని సకాలంలో పొందటంలో భారత్ ఇబ్బంది పడేదని.. సైనిక చర్య జరుగుతున్నప్పుడు కూడా అంతరాయాలు ఏర్పడుతాయన్న భయం వెంటాడేదని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్‌లో తయారీ కార్యక్రమం కింద తయారైన ఆయుధాలు ఆపరేషన్ సిందూర్ విజయం సాధించటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని ప్రధానంగా చెప్పారు.
బలమైన, స్వావలంబన, ఆధునిక దేశాన్ని నిర్మించాలనే నిర్ణయం దశాబ్దం కిందట భారతీయులు తీసుకున్నారని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా రక్షణకు సంబంధించి వరుస సంస్కరణలకు అదే ప్రేరణగా నిలిచిందని ప్రధాని గుర్తు చేసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ఒక ప్రధాన సంస్కరణ అని అన్నారు. ఎంతో కాలంగా దీనిపై చర్చ కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్నప్పటికీ.. భారత్‌లో ఈ నియామకం చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను త్రివిధ దళాలు హృదయపూర్వకంగా అంగీకరించడాన్ని ఆయన ప్రశంసించారు.
తివిధ దళాలు కలిసి పనిచేయటం, వాటి ఏకీకరణలో గొప్ప సామర్థ్యం ఉందని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన.. అన్ని స్థాయిలలో నౌకాదళం, వైమానిక దళం, సైన్యం ఏకీకరణ కావటం అనేది దేశ రక్షణ సామర్థ్యాన్ని రెట్టింపు చేసిందని అన్నారు. ఈ మార్పు ఫలితాన్ని ఆపరేషన్ సిందూర్ విజయం తెలియజేస్తోందని పేర్కొన్నారు.
ప్రారంభంలో సమ్మెలు, ఆందోళనలు వంటి ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ రక్షణ రంగ తయారీకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, సంస్కరణలను అంగీకరించటం, అధిక ఉత్పాదకతను సాధించటం పట్ల ఆయా సంస్థల సిబ్బంది, కార్మికులను ప్రశంసించారు. రక్షణ రంగ ద్వారాలను ప్రైవేట్ కంపెనీల కోసం భారత్ తెరిచిందని.. నేడు ప్రైవేట్ రంగం గణనీయమైన పురోగతిని సాధిస్తోందని ప్రధానంగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో వందలాది అంకురాలు ఆవిష్కరణలకు గణనీయంగా దోహదపడుతున్నాయని అన్నారు. వీటిలో చాలా వరకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 27-30 సంవత్సరాల వయస్సు గల యువతీయువకుల నేతృత్వంలో అంకురాలేనని తెలిపారు.
డ్రోన్‌లకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ప్రధానంగా 30-35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులే నిర్వహిస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్‌లో వారి సహయ సహకారాలు కీలక పాత్ర పోషించాయని ప్రధాని పేర్కొన్నారు. వారందరిని ప్రశంసిస్తున్నట్లు తెలిపిన ఆయన.. దేశం పురోగమిస్తూనే ఉంటుందని వారందరికీ హామీ ఇస్తున్నట్లు తెలియజేశారు.
రక్షణ రంగంలో ‘భారత్‌లో తయారీ’ అనేది కేవలం నినాదం కాదని చెబుతూ.. స్పష్టమైన ముందూచూపుతో బడ్జెట్ పెంపు, విధాన మార్పులు, కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినట్లు అన్నారు. ఇవి స్వదేశీ రక్షణ తయారీ రంగం వేగంవంతమైన వృద్ధి సాధించేలా చేశాయని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశ రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు, రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 250 శాతం పెరిగినట్లు తెలియజేశారు. గత 11 సంవత్సరాలలో రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగి.. ఇప్పుడు దాదాపు 100 దేశాలకు చేరుతున్నాయని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ భారతదేశానికి ప్రపంచ రక్షణ మార్కెట్‌లో బలమైన స్థానాన్ని ఇచ్చిందని పేర్కొన్న మోదీ.. కొన్ని కీలక ఘట్టాలు చరిత్రపై శాశ్వత ప్రభావాన్ని చూపెడతాయని అన్నారు. భారతీయ ఆయుధాలకు పెరుగుతోన్న డిమాండ్..దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తుందని, ఎంఎస్‌ఎంఈలను శక్తిమంతం చేస్తుందని, యువతకు ఉపాధి అందిస్తుందని పేర్కొన్నారు. భారత యువతీయువకులు ఆవిష్కరణల ద్వారా భారతదేశ సమర్థతను చూపిస్తున్నారని తెలిపారు.
రక్షణ రంగ స్వావలంబన అనేది జాతీయ ప్రయోజనాల కోసమే కాకుండా నేటి పోటీ యుగంలో ప్రపంచ శాంతికి కూడా అవసరమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. “భారతదేశం బుద్ధ భూమి… యుద్ధ భూమి కాదు. దేశం శ్రేయస్సు, శాంతిని కోరుకుంటున్నప్పటికీ.. రెండింటికీ బలం, సంకల్పం అవసరం” అని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని గొప్ప యోధుల భూమిగా వర్ణించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాజా రంజిత్ సింగ్, రాజేంద్ర చోళ, మహారాణా ప్రతాప్, లచిత్ బోర్ఫుకన్, మహారాజా సుహెల్దేవ్ లాంటి ప్రముఖులను ప్రస్తావించారు. అభివృద్ది, శాంతికి వ్యూహాత్మక బలం చాలా ముఖ్యమని ప్రధానంగా పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు జాతీయ భద్రత పట్ల స్పష్టమైన దృక్పథం ఎప్పుడూ లేదని, ఈ విషయంలో వారు రాజీ పడుతూనే ఉన్నారని మోదీ ప్రధానంగా అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారు.. పాకిస్థాన్‌ను వారికి ఎవరు అప్పగించారో ముందు సమాధానం చెప్పాలన్నారు.
స్వాతంత్ర్యానంతర తీసుకున్న నిర్ణయాలు దేశంపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. కీలకమైన సమయాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. అక్సాయ్ చిన్‌లోని 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోవటానికి దారి తీసిందని అన్నారు. దీనిని బంజరు భూమిగా తప్పుడు ముద్ర వేశారని అన్నారు. 1962, 1963 మధ్య అధికారంలో ఉన్న పార్టీ నాయకులు జమ్మూ, కాశ్మీర్‌లోని పూంచ్, యురి, నీలం లోయ, కిషన్‌గంగాతో సహా కీలక ప్రాంతాలను అప్పగించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
చరిత్రలో తీసుకున్న దౌత్య నిర్ణయాలు భారత నీటి హక్కులూ, అభివృద్ధి విషయంలో- ముఖ్యంగా ఇండస్ జలాల ఒప్పంద నిర్ణయాలను ప్రధానమంత్రి ఖండించారు. భారత్‌లో పుట్టిన నదుల్లో నుంచి 80 శాతం నీటిని పాకిస్థానుకు కేటాయించడానికి అప్పటి ప్రధానమంత్రి అంగీకరించారనీ, సువిశాల భారత దేశానికి 20 శాతం మాత్రమే మిగిల్చారని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఈ నిర్ణయంలో ఏపాటి విచక్షణ ఉందంటూ ప్రశ్నిస్తూ… తెలివిడి, దౌత్య వివేచన, దేశ హితం లోపించాయన్నారు.
భారత్‌లో పుట్టి పారే నదులు మన పౌరులకే.. మరీ ముఖ్యంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రైతులకే చెందుతాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నదీ జలాల పంపకంపై అప్పటి పాలక పక్షం కుదుర్చుకున్న ఒప్పందం దేశంలో చాలా విశాల ప్రాంతాన్ని నీటి ఎద్దడికి గురి చేయడంతోపాటు అంతర్రాష్ట్ర జల వివాదాలూ తలెత్తాయి. దీని నుంచి పాకిస్థాన్ లాభపడింది.
నదులతో భారత్‌కు సాంస్కృతికంగానూ, నాగరికత పరంగానూ ఉన్న అనుబంధాన్ని పట్టించుకోలేదని, దీంతో ఎక్కువగా నష్టపోయింది భారతీయ రైతులేనని, వారికి న్యాయంగా దక్కాల్సింది వారికి దక్కలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
ఈ పరిస్థితే తలెత్తకపోయి ఉంటే, పశ్చిమప్రాంతాల నదుల్లో అనేక ప్రధాన నీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు అవకాశం లభించేదని ఆయన వివరించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లతో పాటు ఢిల్లీ రైతులు సరిపడ నీళ్లను అందుకొని ఉండేవాళ్లనీ, తాగునీటి ఎద్దడి ఎదురయ్యేది కాదని ఆయన అన్నారు. దీనికి తోడు, భారత్ పరిశ్రమలను ఏర్పాటు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేసి ఉండేదన్నారు.
అప్పటి ప్రభుత్వం పాకిస్థానుకు కాల్వల నిర్మాణానికి కోట్లాది రూపాయలను కూడా సమకూర్చిందని, ఇది భారత్ హితం కోణంలో చూస్తే ఎంతమాత్రం తగదని ప్రధానమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇండస్ నీటి ఒడంబడిక అమలును ఆపేసిందని శ్రీ మోదీ చెప్పారు. ‘‘రక్తమూ, నీళ్లూ కలసి ప్రవహించవు అని భారత్ చెప్పింది’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
2014కు పూర్వం..దేశం అభద్రతలో ఉందని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఎవరూ పట్టించుకోకుండా వదలివేసిన వస్తువులా.. అవి బాంబులు కావచ్చు, వాటి జోలికి ఎవరూ పోవద్దు’’ అంటూ .. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులు, విమానాశ్రయాలు, ఆలయాలు ఇతర బహిరంగ స్థలాల దగ్గర తరచుగా ప్రకటనలు వినిపించారని ఆయన గుర్తుచేశారు. ఆ కాలంలో దేశమంతటా భయంతో నిండిన వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ఆనాటి పాలక పక్షం నేతృత్వంలోని ప్రభుత్వ బలహీనత వల్ల ఎంతోమంది పౌరులు ప్రాణాలు కోల్పోయరన్నారు. పౌరులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టి ఉండవచ్చు.. గత 11 సంవత్సరాల్లో నమోదైన ప్రగతే దీనికి ఒక ఉదాహరణ అని ఆయన చెబుతూ, 2004 నుంచి 2014 మధ్య కాలంలో దేశాన్ని పీడించిన ఉగ్రవాద ఘటనలు భారీగా తగ్గిపోయాయని వివరించారు.
ఉగ్రవాదాన్ని అదుపుచేయడం సాధ్యమే అనుకొన్నప్పుడు అందుకు తగిన చర్యలను మునుపటి పాలన యంత్రాంగాలు ఎందుకు తీసుకోలేదని ప్రధానమంత్రి ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వాలు కొన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే రాజకీయాలు నడుపుతూ, ఓట్ బ్యాంకును కాపాడుకొనే వైఖరిని అవలంబిస్తూ ఉగ్రవాదం శాఖోపశాఖలుగా విస్తరించడానికి అవకాశాన్ని అందించాయని ఆయన ఆరోపించారు.
పార్లమెంటు భవనంపై 2001లో దాడి జరిగిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ, దోషిగా పేర్కొన్న ఉగ్రవాది అఫ్జల్ గురును అప్పటి పాలకపక్షం ‘‘నిర్దోషి అన్నట్లు’’గా చూసిందని విమర్శించారు. 26/11 ముంబయి దాడుల వేళ… ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పట్టుకొన్నప్పుడు, అతడి పాకిస్థానీ జాతీయత గురించి ప్రపంచం మొత్తానికీ తెలిసినా ఆ దాడి ఘటనను ‘‘కాషాయ బీభత్సం’’గా చిత్రించే యత్నాలు ఎలా జరిగిందీ ఆయన వివరించారు.
ఆ కాలపు అధికార పక్షానికి చెందిన నాయకుడు ఒకరు లష్కరే తయ్యబా కంటే పెనుముప్పుగా మారింది హిందూ గ్రూపులే అని అమెరికాకు చెందిన ఒక ప్రముఖ దౌత్యవేత్తతో అన్నారని ప్రధానమంత్రి ఉదాహరించారు. వారు విదేశాల్లో చేసే ప్రచారానికి ఇదొక ఉదాహరణ అని ఆయన అన్నారు.
భారత రాజ్యాంగాన్ని జమ్మూకాశ్మీర్‌లో పూర్తి స్థాయిలో అమలుపరచకుండా అడ్డుపడినందుకు ప్రతిపక్షాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ భద్రత విషయంలో ఎప్పటికప్పుడు రాజీ పడుతూ, కొన్ని వర్గాలను సంతోషపెట్టే రాజకీయాలను నడుపుతున్నందు వల్ల.. బాబా సాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆ ప్రాంతంలో అమలు కాలేదని ప్రధానమంత్రి తెలిపారు.
ఒక్కతాటి మీద నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేశ హితం కోరేటప్పుడు ఐక్యత అనే పరమార్థాన్ని విడచిపెట్టరాదని ఆయన అన్నారు. పహల్గామ్ విషాద ఘటనను గురించి ప్రస్తావిస్తూ, అది దేశ ప్రజలను ఎంతగా కలచి వేసిందీ ప్రధానంగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించిందనీ, ఈ ఆపరేషన్‌లో ధైర్య సాహసాలు, స్వయంసమృద్ధి, జాతీయ దృఢసంకల్పం కలబోసుకున్నాయని ప్రధానమంత్రి అభివర్ణించారు.
భారతీయ ప్రతినిధి వర్గాలు వివిధ దేశాలకు వెళ్లి చిత్తశుద్ధితోను, స్పష్టంగాను వాదనను వినిపించాయని ఆయన ప్రశంసించారు. వారి వాదనలో ‘సిందూర్ స్ఫూర్తి ’ మారుమోగిందని, ఈ స్ఫూర్తే దేశం లోపలా దేశం బయటా కూడా భారత్ అనుసరిస్తున్న వైఖరికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.
ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన సూటి సందేశాన్ని వ్యతిరేకించే రీతిలో కొందరు ప్రతిపక్ష నేతలు ప్రతిస్పందించారని ఆరోపణలు రావడం పట్ల ప్రధానమంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశానికి అనుకూలంగా సభలో మాట్లాడిన వారిని మౌనంగా ఉంచే ప్రయత్నాలు సాగాయంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మనస్తత్వాన్ని గురించి ఆయన చెప్తూ ధైర్యంగా, ప్రయోజనకరంగా మాట్లాడడం మేలు అని బోధించిన ఒక కవితా పంక్తిని సభ్యులతో పంచుకున్నారు.
పాకిస్థాన్ పట్ల దయ చూపడానికి దారితీసిన రాజకీయ ఒత్తిడులను విడనాడాల్సిందిగా ప్రతిపక్షానికి శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు. దేశం విజయాన్ని సాధించిన సందర్భాలను రాజకీయంగా ఎగతాళి చేసే సందర్భాలుగా మార్చవద్దని ఆయన హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని వేళ్ళతో సహా భారత్ పెకలించివేస్తుందని ప్రధానమంత్రి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఇది పాకిస్థానుకు స్పష్టమైన హెచ్చరికగా ఉంటుందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపనంత కాలం భారత్ తన ప్రతిస్పందన పూర్వక చర్యలను చేపడుతూనే ఉంటుందని అని ఆయన స్పష్టం చేశారు.
భారత భవిష్యత్తు సురక్షితంగా, సమృద్ధంగా ఉంటుందన్న దృఢసంకల్పాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రజల మనోభావాలకు తగినవిధంగా అర్థవంతమైన చర్చను చేపట్టినందుకు సభకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
Speaking in the Lok Sabha.
— Narendra Modi (@narendramodi) July 29, 2025
https://t.co/5YMO8qcisH
मैं भारत का पक्ष रखने के लिए खड़ा हुआ हूँ: PM @narendramodi in Lok Sabha pic.twitter.com/jSpcNQmszn
— PMO India (@PMOIndia) July 29, 2025
A Vijay Utsav of the valour and strength of the Indian Armed Forces. pic.twitter.com/6yjYhsLqVc
— PMO India (@PMOIndia) July 29, 2025
Operation Sindoor highlighted the power of a self-reliant India! pic.twitter.com/CWKAQzfzEv
— PMO India (@PMOIndia) July 29, 2025
During Operation Sindoor, the synergy of the Navy, Army and Air Force shook Pakistan to its core. pic.twitter.com/GZMPpfz5KN
— PMO India (@PMOIndia) July 29, 2025
India has made it clear that it will respond to terror on its own terms, won't tolerate nuclear blackmail and will treat terror sponsors and masterminds alike. pic.twitter.com/r4T3mBUWs4
— PMO India (@PMOIndia) July 29, 2025
During Operation Sindoor, India garnered widespread global support. pic.twitter.com/SN56e2DUsw
— PMO India (@PMOIndia) July 29, 2025
Operation Sindoor is ongoing. Any reckless move by Pakistan will be met with a firm response. pic.twitter.com/rARk30BCwz
— PMO India (@PMOIndia) July 29, 2025
A strong military at the borders ensures a vibrant and secure democracy. pic.twitter.com/SBbCom3iQK
— PMO India (@PMOIndia) July 29, 2025
Operation Sindoor stands as clear evidence of the growing strength of India's armed forces over the past decade. pic.twitter.com/AYgAixTYsV
— PMO India (@PMOIndia) July 29, 2025
India is the land of Buddha, not Yuddha (war). We strive for prosperity and harmony, knowing that lasting peace comes through strength. pic.twitter.com/gSp2sMCc4L
— PMO India (@PMOIndia) July 29, 2025
India has made it clear that blood and water cannot flow together. pic.twitter.com/rD2A17BhDO
— PMO India (@PMOIndia) July 29, 2025
ऑपरेशन सिंदूर को लेकर विजयोत्सव का मतलब है- हमारी सेनाओं के शौर्य और सामर्थ्य की विजय गाथा का उत्सव! pic.twitter.com/cSq8u2yJYM
— Narendra Modi (@narendramodi) July 30, 2025
ऑपरेशन सिंदूर कितना सफल रहा है, इसका अंदाजा इसी बात से लगाया जा सकता है कि आज भी आतंक के आकाओं की नींद उड़ी हुई है। pic.twitter.com/HWvrz32LJG
— Narendra Modi (@narendramodi) July 30, 2025
हम गोली का जवाब गोले से देंगे! pic.twitter.com/0XYwJzyu2F
— Narendra Modi (@narendramodi) July 30, 2025
ऐसे अनेक उदाहरण हैं, जो बताते हैं कि कांग्रेस किस प्रकार अपने राजनीतिक मुद्दों के लिए पाकिस्तान पर निर्भर होती जा रही है… pic.twitter.com/g815wS55NI
— Narendra Modi (@narendramodi) July 30, 2025
पहलगाम हमले पर कांग्रेस ने पाकिस्तान को क्लीन चिट दे दी है। ये पहली बार नहीं है, जब देश में आतंकी घटनाओं को लेकर उसने ऐसा रवैया दिखाया है। pic.twitter.com/iZFk4jCHLF
— Narendra Modi (@narendramodi) July 30, 2025
कांग्रेस के पास राष्ट्रीय सुरक्षा को लेकर कभी कोई विजन नहीं रहा। आजादी के बाद उसने कुछ ऐसे फैसले लिए, जिनकी सजा देश को आज भी भुगतनी पड़ रही है। pic.twitter.com/EWR2V0OfDs
— Narendra Modi (@narendramodi) July 30, 2025