Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బహ్రెయిన్‌ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి


బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారుబహ్రెయిన్ రాజుకి పండుగ శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. ప్రాంతీయ భద్రతా అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపారు.

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకుఆ దేశ ప్రజలకు ఈద్ఉల్ఫితర్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారుఈ సంభాషణలో ఇరువురు నేతలు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారుఇంధనపౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారుఇటువంటి దాడులు ప్రపంచ ఆహారఇంధనఎరువుల భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారుఅంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడటంషిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన  ప్రాముఖ్యత గురించి ఇరువురు చర్చించారుబహ్రెయిన్‌లోని భారతీయ సమాజ సంక్షేమం కోసం నిరంతరం మద్దతు అందిస్తున్నందుకు  ఆ దేశ రాజుకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘బహ్రెయిన్ రాజు  హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫలప్రదమైన చర్చలు జరిపానుఈ సందర్భంగా ఆయనకుబహ్రెయిన్ ప్రజలకు ఈద్ఉల్ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశాను.

పశ్చిమ ఆసియా ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులపై మేం చర్చించాంఆ ప్రాంతంలోని ఇంధనపౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించాంఇటువంటి చర్యలు ప్రపంచ ఆహారఇంధనఎరువుల భద్రతపై చూపే ప్రతికూల ప్రభావంపై చర్చించాం.

అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడటంషిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా స్పష్టం చేశాం.

బహ్రెయిన్‌లోని భారతీయ సమాజ సంక్షేమం కోసం నిరంతర మద్దతు అందిస్తున్నందుకు ఆదేశ రాజుకి ధన్యవాదాలు తెలియజేశాను.’’

 

***