పిఎంఇండియా
గవర్నర్ ఆర్ ఎన్ రవి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శంతను ఠాకూర్ గారు, సుకాంత మజుందార్ గారు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారు, నా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సోదరీ సోదరులారా!
నేడు కోల్‌కతా గడ్డపై నుంచి పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం లిఖించబోతుంది. సుమారు 18 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైనన రహదారి, రైల్వే, ఓడరేవు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశానికి కొత్త ఊపునిస్తాయి. వాణిజ్యం, పరిశ్రమలను ప్రోత్సహిస్తాయి. లక్షలాది మంది జీవితాలను సులభతరం చేస్తాయి. వారికి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఖరగ్‌పూర్-మోరెగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. దుబ్రాజ్‌పూర్ బైపాస్, కంగ్‌షవతి, శిలావతి నదులపై నిర్మిస్తున్న పెద్ద వంతెనలు అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టుల సందర్భంగా పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేడు దేశంలో రైల్వేలను ఆధునీకరించేందుకు వేగవంతమైన ఉద్యమం జరుగుతోంది. ఇందులో పశ్చిమ బెంగాల్ వెనుకబడకూడదన్నదే మా సంకల్పం. అందుకే పశ్చిమ బెంగాల్ రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రయత్నాలు చేస్తోంది. నేడు కలైకుండ, కనిమహులి విభాగాల్లో స్వయంచాలక బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను దేశానికి అంకితం చేశాం. ఇది రద్దీగా ఉండే రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది. ప్రయాణీకులకు వేగం, సౌకర్యం కూడా మెరుగుపడేలా చేస్తుంది.
మిత్రులారా,
నేడు కామాఖ్యగుడి, అనారా, తమ్లుక్, హల్దియా, బరాభుమ్, సియూరి అనే ఆరు స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా ప్రారంభించాం. ఈ స్టేషన్‌లలో బెంగాల్ సంస్కృతి ఇప్పుడు మరింత ప్రకాశిస్తోంది. ఇక్కడ ఇంకా మరెన్నో స్టేషన్లను కూడా పునరాభివృద్ధి చేస్తున్నాం. పురూలియా, ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును కూడా ప్రారంభించాం. ఈ రైలు సర్వీసు కేవలం పశ్చిమ బెంగాల్ ప్రజలకే కాకుండా జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
రహదారి, రైలు అనుసంధానతలు ఎంత ముఖ్యమో ఓడరేవులు, జల రవాణాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి. దశాబ్దాలుగా ఈ విషయంలో తూర్పు భారతదేశం సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ నేడు జలమార్గాలు వాణిజ్యం, పారిశ్రామిక పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తున్నాయి. ఈ దిశగా నేడు ముఖ్యమైన ఓడరేవు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. కోల్‌కతా, హల్దియా వంటి ఓడరేవులు తూర్పు భారతదేశంలో చాలా కాలంగా ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. హల్దియా డాక్ కాంప్లెక్స్‌ను యాంత్రీకరిస్తున్నాం. ఇది సరుకు రవాణా కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. ఓడరేవు సామర్థ్యాన్ని పెంచుతుంది. వాణిజ్యానికి కొత్త సౌకర్యాలను కల్పిస్తుంది. కోల్‌కతా డాక్ సిస్టమ్‌లో బాస్కుల్ వంతెన పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి. కిడ్డర్‌పూర్ డాక్ వద్ద సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ తూర్పు ప్రాంతంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
***
Speaking at the launch of development works in Kolkata. These initiatives will boost connectivity and improve the quality of life for people.
— Narendra Modi (@narendramodi) March 14, 2026
https://t.co/yMphItf5By
आज देश में रेलवे को आधुनिक बनाने का तेज अभियान चल रहा है।
— PMO India (@PMOIndia) March 14, 2026
हमारा ये संकल्प है कि पश्चिम बंगाल इस अभियान में पीछे न रहे।
इसीलिए, केंद्र सरकार, पश्चिम बंगाल के रेलवे इंफ्रास्ट्रक्चर का भी तेजी से विस्तार कर रही है: PM @narendramodi
कोलकाता और हल्दिया जैसे बंदरगाह लंबे समय से पूर्वी भारत में व्यापार के प्रमुख केंद्र रहे हैं।
— PMO India (@PMOIndia) March 14, 2026
हल्दिया डॉक कॉम्प्लेक्स का मशीनीकरण हो रहा है।
इससे कार्गो ऑपरेशन और तेज होगा, बंदरगाह की क्षमता बढ़ेगी और व्यापार के लिए नई सुविधा मिलेगी: PM @narendramodi