పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన భక్తితత్పరతను వ్యక్తీకరిస్తూ భక్తకోటికి ఒక లేఖ రాశారు. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర మొదలైందని, దేవభూమి ఉత్తరాఖండ్‌లోని శ్రీ కేదార్నాథ్ ధామ్ తలుపులను తెరిచారనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. యాత్రలో పాలుపంచుకోవడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న భక్తులను ఉద్దేశించి ఆయన ఒక లేఖను రాస్తూ, వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భానికున్న ఆధ్యాత్మిక విశిష్టతను శ్రీ మోదీ ప్రస్తావిస్తూ కేదార్నాథ్ ధామ్, చార్‌ధామ్‌ల సందర్శన యాత్ర మన నమ్మకం, ఏకత, సమృద్ధ సాంస్కృతిక సంప్రదాయాల దివ్య ఉత్సవంగా వర్ణించారు. ఈ యాత్రలతో మనకు భారత సనాతన సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక చేతనల దర్శనం కూడా లభించగలదని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘దేవభూమి ఉత్తరాఖండ్ పవిత్ర ధరిత్రిలో శ్రీ కేదార్నాథ్ ఆలయాన్ని ఈ రోజు పూర్తి విధివిధాన సహితంగా మన భక్తగణం కోసం తెరిచారు.
కేదార్నాథ్ ధామ్తో పాటు చార్‌ధామ్‌ను దర్శించుకొనేందుకు చేపట్టే ఈ యాత్ర మన నమ్మకం, ఏకత, సమృద్ధ సంప్రదాయాల సమ్మిళిత దివ్య ఉత్సవంగా భాసిస్తోంది. ఈ యాత్రలతో మనం భారత సనాతన సంస్కృతిని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం.
ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర ఆరంభోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌కు విచ్చేసే భక్తగణాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా భావనలను ఒక లేఖలో వ్యక్తం చేశాను.
బాబా కేదార్ కృప అందరిపై వర్షించాలనీ, యాత్రలు శుభకరంగా పూర్తవ్వాలనీ నేను కోరుకుంటున్నాను.
హర్– హర్ మహాదేవ్’’ అని పేర్కొన్నారు.
***
देवभूमि उत्तराखंड की पवित्र धरती पर आज श्री केदारनाथ धाम के कपाट पूरे विधि-विधान के साथ हम सभी श्रद्धालुओं के लिए खोल दिए गए हैं।
— Narendra Modi (@narendramodi) April 22, 2026
केदारनाथ धाम और चारधाम की यह यात्रा हमारी आस्था, एकता और समृद्ध परंपराओं का दिव्य उत्सव है। इन यात्राओं से हमें भारत की सनातन संस्कृति के दर्शन भी… pic.twitter.com/BYQItBsZi4